కొన్ని రకాల వ్యాధులు స్త్రీ పురుషులకు వేరు వేరుగా ఉంటాయి. వారిలో ఉండే హార్మోన్ల తేడాల కారణంగా సమస్యల విషయంలోనూ ఈ తేడాలు ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ విషయంలోనూ ఇదే రకంగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీల విషయంలో ఈ సమస్య సృష్టించే ఇబ్బందులు ఏమిటి, పరిష్కారాలు ఏమిటో తెలుసుకుందామా.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది శరీరపు వ్యాధి నిరోధక వ్యవస్థ తన కణజాలం మీద దాడి చేసే ఒక స్వయం వ్యాధినిరోధక డిజార్డర్. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో జీవక్రియల మార్పుల వలన, జన్యుపరమైన మార్పుల వలన వచ్చే కీళ్ల జబ్బుల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకటి. ప్రపంచ జనాభాలో 0.5 శాతం నుంచి 1 శాతం వరకు ఈ జబ్బుతో బాధపడుతున్నారు. 20 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల మధ్య వయసు గల వారిలో వచ్చే అవకాశం చాలా ఎక్కువ. పురుషులలో కన్నా స్త్రీలలో మూడింతలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. శరీరంలోని జీవక్రియల అసమతుల్యత వలన, రోగ నిరోధక వ్యవస్థలోని మార్పుల వలన రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది. దీనితోపాటు శారీరక, మానసిక ఒత్తిడి కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. మానసిక ఒత్తిడి వలన జన్యుపరమైన మార్పులు సంభవించి ఈ జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరైన ఆరోగ్య పద్ధతులు పాటించనివారు, ధూమపానం, మద్యపానం చేసేవారిలో ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ పురుషులు కంటే అధికంగా స్త్రీల లో ఎక్కువుగా కనిపిస్తుంది. జాయింట్లలో వచ్చే తీవ్రమైన నొప్పినే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఇది చేతులు, పాదాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎముకలు, కండరాలు, లిగ్మెంట్‌లపై ఎక్కువగా ప్రభావం ఉంటుంది. నొప్పి, వాపు, నొప్పి ఉన్నచోట ఎర్రగా మారడం, కీళ్లు బిగుసుకుపోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఇది అటోఇమ్యూన్ వ్యాధి. వంశపారపర్యంగా, ఇతర ఇన్‌ఫెక్షన్ల మూలంగా, వ్యాధి నిరోధకశక్తి అతిగా స్పందించడం వల్ల ఇది వస్తుంది.ఈ కీళ్ల జబ్బు వలన, కీళ్లలో ఉండే సైనవియల్ మెంమిబ్రెన్ దెబ్బతింటుంది. కీళ్లలో అవసరమైన సైబ్రస్ టిష్యూ పేరుకుపోతుంది. ఈ ప్యానస్ అనే చెడు పదార్థం వలన కీళ్లలో కార్టిలేజ్ దెబ్బతింటుంది. కీళ్లలో వాపులు తరచుగా వస్తూ పోతూ ఉంటాయి. ఈ జబ్బులో లక్షణాలు కొన్నిసార్లు అధికం అవడం, తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుంది. ఎప్పుడైతే లక్షణాలు అధికం అయినప్పుడు జ్వరంగా ఉండటం, కీళ్లలో వాపులు, కీళ్లు ఎరుపెక్కడం, కీళ్లు బిగుసుకు పోవడం, తీవ్రమైన నొప్పి, కదలికలు తగ్గిపోతాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో కేవలం కీళ్లు దెబ్బతినడమే కాకుండా, శరీరంలో ఇతర అవయవాలు కూడా దెబ్బతింటాయి. ఊపిరితిత్తుల్లోని హైపో, గుండె పైపోర దెబ్బతినే అవకాశం ఉంటుంది. తద్వారా గుండెనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. తరుచుగా ఊపిరితిత్తులో ఇన్‌ఫ్లమేషన్ కారణంగా తుమ్ములు రావడం, దగ్గురావడం జరుగుతుంది.
కొన్ని పరీక్షల ద్వారా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ను సులబంగా గుర్తించవచ్చు. రక్తంలో యాంటీబాడీస్ కనుగొనే పరీక్ష రుమటాయిడ్ ఫ్యాక్టర్ పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు. అలాగే కీళ్లను ఎక్స్‌రే తీయించి ఎముకలలో ఎరోషన్స్‌ను గుర్తించి నిర్ధారించవచ్చు. ఇలాంటి కీళ్లజబ్బుల బారిన పడకుండా ప్రతిరోజు వ్యాయామం చేయాలి. సరియైున పోషకాహారం తీసుకోవాలి. ఎలాంటి వైరల్ ఇన్‌ఫెక్లన్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతినిత్యం యోగా, ధ్యానం చేయాలి.తగినంత నిద్ర పొందడం వలన మంట మరియు నొప్పి మరియు అలసట తగ్గించడానికి సహాయపడుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వారు ఆహార నియమాలు పాటించాలని లేదు. అయితే వారంలో రెండు రోజులు చేపలు తీసుకోవడం వల్ల కార్డియాక్ రిస్క్ తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ఉంటాయి. చేపలు ఇష్టం లేకపోతే వాల్‌నట్స్, సోయాబీన్స్ తీసుకోవచ్చు.