Sagittal imbalance – వెన్ను ఆకారాన్ని దెబ్బతీసే సాగిటాల్ అసమతుల్యత ఎలా మొదలౌతుంది..?

By manavaradhi.com

Published on:

Follow Us
Sagittal imbalance

నడుము వంగడం… వయసై పోయిన వారికి సర్వ సాధారణంగా ఉండే సమస్య. కొందరిలో ఉండకపోవచ్చు కూడా. 60 ఏళ్ళ లోపే ఇలాంటి సమస్య వచ్చిందంటే అది కచ్చితంగా సాగిటాల్ ఇమ్ బ్యాలన్స్ సిండ్రోమ్. వెన్నెముకలో ఏర్పడే సమస్యల వల్ల ఇది సమతౌల్యం తప్పుతుంది. ఫలితంగా శరీరం అదుపు తప్పుతుంది. కుదురుగా నిలబడలేని పరిస్థితి ఏర్పడుతుంది.

మానవ మనుగడకు అతి ముఖ్యమైన శరీర భాగాల్లో కంటి తర్వాతి స్థానం వెన్నెముకదే. మనిషి నడవడం దగ్గర్నుంచి ప్రతి పనిలోనూ దీని ప్రాధాన్యత ఎంతో ఉంది. సాధారణంగా వెన్నెముక తల దగ్గర్నుంచి, నడుము వరకూ మరీ వంపు తిరగని S ఆకారంలో ఉంటుంది. సాధారణంగా కూర్చుకున్నప్పుడు ఇది నిటారుగా కనిపిస్తుంది. నాభి స్థానం దగ్గర ఈ వెన్నెముక ఓ చిన్న వంపు తిరిగి ఉంటుంది. మొత్తం మీద తల దగ్గర్నుంచి నడుము వరకూ వెన్నె పూస చిన్న చిన్న భాగాలుగా ఉంటుంది. ఇది తన పని నిర్వర్తించడానికి అనువుగా అంటే… వంగేందుకు, కూర్చునేందుకు, నిలబడేందుకు, పడుకునేందుకు… ఇలా ఒక భంగిమ నుంచి మరో భంగిమలోకి మారేటప్పుడు… వెన్ను పూసలోని భాగాలు వాటంతట అవే మార్పులు చెందుతూ ఉంటాయి. అందుకే మనిషి ముందుకు వెనక్కు వంగ గలడు.

ఎప్పుడైతే నడుము లేదా మోకాలు వరకూ సరైన విధంగా దీని పని తీరు లేకపోతే అది సాగిటాల్ అసమతుల్యతకు దారి తీస్తుంది. మనిషి పుట్టిన నాటి నుంచి వెన్నెముక వయసు సంబంధింత మార్పులకు లోనవుతూ ఉంటుంది. సాధారణంగా పెద్ద వయసు వచ్చాక వంగుతూ గూనితనంగా మారుతుంది. వెన్నెముక డిస్క్ క్రమంగా దాని సైజును మార్చుకుంటూ ఉండడం వల్ల డిస్క్ ల మధ్య సందులు ఏర్పడతాయి. ఇవి మరింత ఎక్కువ అయినప్పుడు.. డిస్క్ లకు క్షీణత లాంటి సమస్యలు కూడా ఉత్పన్నం అవుతాయి. ఈ పరిస్థితుల్లో నడుము పై భాగంలో ఉండే డిస్క్ లు సమతౌల్యత కోల్పోతాయి. ఫలితంగా మనిషిని నిలువుగా నిలబెట్టాల్సిన వెన్నెముక గతి తప్పుతుంది. దీనివల్ల నిలబడడమే కాదు… సరిగ్గా కూర్చోవడం కూడా కష్టమౌతుంది.

సాగిటల్ ఇమ్ బ్యాలన్స్ కు ఎన్నో కారణాలు ఉండవచ్చు. ముఖ్యంగా శస్త్ర చికిత్సలు జరిగినప్పుడు.. వెన్నెపూస కొన్ని మార్పులకు లోనవుతుంది. ఇలాంటి సమయంలో దానికి దృఢత్వం వేగంగా క్షీణిస్తుంది. దీనివల్ల వెన్నులో అనుకోని మార్పులు సంభవించవచ్చు. కొందరు రోగుల యొక్క వెన్నెముక కైఫోసిస్ ప్రాంతంలో ఆకృతి మారిపోతుంది. వెన్నెముక కీలు యొక్క కండరాలు ఎక్కువగా పని చేయడం వల్ల, తల మరియు భుజాలు ఎక్కువగా వంచడం వల్ల వెన్నుపూస అనుకోని మార్పులకు లోనవుతుంది. ఇది ఇలానే ఉంటే కీళ్ళ మీద భారం పడి… ప్రమాదకరమైన కీళ్ళనొప్పులకు దారి తీస్తుంది.ఈ సమయంలో నిలబడి నడవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఏరేటల్ స్పైన్ కూడా అలసటకు లోనై… కండరాల నొప్పులకు కారణమౌతుంది. కైఫోసిస్ గట్టిగా ఉంటే… కండరాలను లాగడానికి కూడా సాధ్యం కాదు ఫలితంగా మరింత త్వరగా అలసిపోతాయి. ఏదేమైనా కైఫోసిస్ బాగా ఇబ్బంది పడ్డప్పుడు… ఆ ప్రదేశంలో మార్పులు జరుగుతాయి. ఈ మార్పులు… నడుము దగ్గర్నుంచి మోకాలు వరకూ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా నడవడం, కూర్చోవడం కూడా కష్టమౌతుంది.

సాధారణంగా వయసు ఈ సమస్యలకు ప్రధాన కారణం అవుతుంది. వయసుతో పాటే వెన్నుపూసలో వచ్చే మార్పులు ఎన్నో ఇబ్బందులు సృష్టిస్తాయి. అంత కాకుండా… శస్త్రచికిత్సలు సైతం వెన్నుపూస మీద ప్రభావాన్ని చూపించి… సాగిటాల్ అసమతౌల్యతకు కారణం అవుతుంది. ఎక్కువగా బరువులు మోయడం, సరిలేని నడక, ఎత్తుగా ఉండే చెప్పులు వేసుకోవడం లాంటి కారణాల వల్ల ఈ సమస్యలు ఉత్పన్నం అవుతుంటాయి. కంప్యూటర్ ముందు ఎక్కువగా కూర్చోవడంతో పాటు… సరైన భంగిమలో కూర్చోకపోవడం వల్ల కూడా వెన్నెముక మీద అధిక భారం పడి, ఈ సమస్యలు తలెత్తుతాయి.

వెన్నుపూసకు వచ్చే ప్రతి సమస్యను దీనితో పోల్చాల్సిన అవసరం లేదు. వెన్నునొప్పి ఈ సమస్యకు ముందు మనకు తెలియజేసే ప్రధాన సూచన. అనుకోని వెన్ను నొప్పులు మొదలైనప్పుడు… వెన్ను పూసను ఎక్స్ రే తీయించుకోవాలి. వెన్నులో ఏవైనా సమస్యలు వచ్చాయా, అవి ఏ దిశకు వెళుతున్నాయి అనే అంశాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేయంచుకుంటూ ఉండాలి. నడిచే విధానంలో సైతం ఒక క్రమపద్ధతి చాలా అవసరం. అలా లేనప్పుడు… ఎన్నో సమస్యలు ఉత్పన్నమౌతాయి. అలానే కూర్చునేసమయంలో కూడా వెన్నుపూసను పూర్తిగా వంచకుండా… నిటరుగా ఉంచి కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. దీని వల్ల వెన్నె మీద భారం పెద్దగా పడదు. ఎక్కువ సేపు కూర్చోవలసిన పరిస్థితి ఉన్నప్పుడు… నడుము వెనుకభాగాన ఏదైనా సపోర్ట్ పెట్టుకుని కూర్చోవడం చాలా అవసరం. అలా చేయడం వల్ల వెన్నెముక మీద భారాన్ని చాలా వరకూ తగ్గించుకోవచ్చు.

Leave a Comment