Strengthen Ankles : చీలమండ ఆరోగ్య చిట్కాలు ..!

By manavaradhi.com

Published on:

Follow Us
Strengthen Ankles

మన శరీర బరువు మొత్తం కాళ్లపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా పాదాలపై ఆ బరువు తీవ్రంగా పడుతుంది. అంటే పాదాలు ధృఢంగా ఉండాలన్నమాట. బస్సు ఎక్కేటప్పుడు .. లేదా సరదాగా ఆటలాడేటప్పుడు .. ఫన్నీగా నడిచేటప్పుడు . . ఇతరత్రా కారణాల వల్ల మడమపై భారం పడుతుంది. దీంతో బెణుకుతో నొప్పి వేధిస్తుంది. చీలమండలోని లిగమెంట్లు లాగడం లేదా చిరగడం లేదా పక్కకు ఒరగడం వల్ల తీవ్రమైన నొప్పి కలుగుతుంది. దీనినే బెణుకు అంటారు. చీలమండ బెణకడం రెండు రకాలుగా జరుగవచ్చు. చీలమండ జాయింటు బైటి వైపునకు తిరగడం వల్ల పాదం లోపలికి ఒరగటం మొదటిది. దీనినే వైద్య పరిభాషలో ఇన్వర్షన్ ఇంజ్యూరీ అంటారు. చీలమండ బైట వైపున ఉండే లిగమెంట్లు బాగా సాగిపోయి చీరుకుపోయినప్పుడు ఇది జరుగుతుంది. రెండవ విధానంలో చీలమండ జాయింటు లోపలి వైపునకు తిరగడం వల్ల పాదం బైటి వైపునకు ఒరుగుతుంది. దీనిని వైద్య పరిభాషలో ఎవర్షన్ ఇంజ్యూరీ అంటారు. దీనిలో చీలమండ లోపలివైపు లిగమెంట్లు దెబ్బ తింటాయి…

బెణికిన ప్రాంతంలో నొప్పి తీవ్రంగా ఉంటుంది. ఒక్కోసారి వాపు కనిపిస్తుంది. తక్కువ తీవ్రతతో ఉన్న బెణుకుల్లో వాపు కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుంది. చాలా సందర్భాలలో మొదటి పది నిముషాలలో విపరీతమైన నొప్పి ఉండి, గంట, రెండు గంటలలో సద్దుమణుగుతుంది. చీలమండ జాయింటులోని లిగమెంట్లు దెబ్బ తిన్న స్థాయిని ఆధారం చేసుకుని లక్షణాలు తీవ్రత మారుతుంటుంది. కాలి పాదాలను , మడమలను దృఢంగా ఉంచుకుంటే … చాలా వరకు చీలమండ బెణకకుండా రక్షించుకోవచ్చు. ఇందుకోసం కొన్ని వ్యాయామాలు ఉన్నాయి. మొదటి ఎక్సర్ సైజ్ .. కాల్ఫ్ స్ట్రెచ్. ఇందులో గోడకు ఎదురుగా దాదాపు 2 అడుగుల దూరంలో నిలబడాలి. ఆ తర్వాత రెండు చేతులను గోడకు ఆనించాలి. భుజాలు వెడెల్పుగా సాగినట్లుగా ఉంచాలి. ఇప్పుడు రెండు పాదాలను ఒకదాని వెనుక ఒకటి ఉంచి.. రెండు బొటన వేళ్లపై నిడబడాలి. ఆ తర్వాత . . మెల్లగా .. మోకాళ్లను కిందకు ,పైకి వంచాలి. దీని వల్ల పాదాల్లో కండరాలు గట్టిపడతాయి. ఇలాగే .. రెండు పాదాలను మారుస్తూ .. దాదాపు 15 నిముషాల వరకు ఈ వ్యాయామం చేయవచ్చు.

రెండో ఎక్సర్ సైజ్ హీల్ స్ట్రెచ్. దీనిలో నేలపై కూర్చుని. . మోకాళ్లను కొద్దిగా వంచాలి. పాదం పై భాగంలో టవల్ చుట్టుకుని లూప్ ఏర్పాటు చేసుకోవాలి. దాన్ని క్రమంగా వెనక్కి లాగుతూ వదులుతూ ఉండాలి. మడమలో సాగిన ఫీలింగ్ వచ్చే వరకు ఈ వ్యాయామాన్ని కొనసాగించాలి. ఈ వ్యాయామాన్ని ప్రతి కాలుకు రోజుకు ఆరుసార్లు చేయవచ్చు. కాళ్లను బలోపేతం చేస్తే . . చీలమండ కండరాలు ధృఢంగా ఉంటాయి. ఇందులో పుష్ ఔట్,పుష్ అప్ అని రెండు రకాల వ్యాయామాలు చేయవచ్చు. గోడ ఎదురుగా కూర్చుని .. పాదాన్ని వ్యతిరేక దిశలో చదునుగా ఉంంచాలి. గోడకు వ్యతిరేకంగా నెడుతూ .. దాదాపు 3 నుంచి నాలుగు సెకన్ల పాటు పట్టుకోవాలి. పుష్ అప్ వ్యాయామంలో కుర్చీలో కూర్చునే ఓ పాదంపై మరో పాదం మడమను ఉంచాలి.. పైన ఉన్న మడమతో కింది భాగంపై ఒత్తిడి పెంచుతూ 3 నుంచి నాలుగు సెకన్ల పాటు ఈ వ్యాయామం చేయాలి. ఈ ఎక్సర్ సైజ్ లోనూ రెండు పాదాలను మారుస్తూ చేసుకోవడం వల్ల పాదాల కండరాలు దృఢంగా మారుతాయి. పాదాల్లో బ్యాలెన్స్ కూడా చాలా ముఖ్యం. నడిచేటప్పుడు .. పరుగు పెట్టేటప్పుడు కూడా బ్యాలెన్స్ తో వెళ్లడం అలవాటు చేసుకోవాలి. ఏ మాత్రం పట్టు తప్పినా ..చీలమండలో బెణుకు ఏర్పడి నోప్పికి దారి తీస్తుంది. ఇందుకోసం కూడా తగిన వ్యాయామాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని క్రమం తప్పకుండా చేయడం వల్ల బ్యాలెన్సింగ్ అలవాటు అవుతుంది. ముఖ్యంగా కాళ్లు, పాదాల్లో ఉన్న కండరాలు దృఢంగా తయారవుతాయి…

బెణుకులను నివారించుకోవడానికి సాధారణ చిట్కాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఆటలు ఆడేవారు , వ్యాయామాలు చేసే వారు .. ఈ చిట్కాలను తప్పనిసరిగా పాటించాలి. ఆటలు ఆడే ముందు చీలమండను సాగదీసే ఎక్సర్ సైజ్ చేయాలి. సరైన షూస్ ధరించాలి. అధిక బరువును వీలైనంత వరకు తగ్గించుకుంటే మంచిది.

Leave a Comment