Winter Tips:శీతాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి ఎలా రక్షణ పొందవచ్చు?

By manavaradhi.com

Published on:

Follow Us
winter tips for health

వాతావరణం చల్లగా మారింది. చలి తీవ్రత ఎక్కువ అవుతున్న కొద్దీ నిద్రానంగా ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ తలెత్తుతాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా జలుబు, దగ్గు, ఫ్లూ, వైరస్ వ్యాధులతో పాటు చర్మ వ్యాధులు, ఆస్తమా, కీళ్ళ నొప్పుల వ్యాధులు, చిన్న పిల్లల్లో విరేచనాలు, వైరల్‌ జ్వరాలు మనల్ని పలకరిస్తు ఆందోళనకు గురిచేస్తుంటాయి.

శీతాకాలంలో పలు రకాల సమస్యలు వస్తుంటాయి. వీటిలో పలు రకాల చర్మ వ్యాధులు, జలుబు, దగ్గు, ఆస్తమా, కీళ్ళ నొప్పుల వ్యాధులు, చిన్న పిల్లల్లో విరేచనాలు, వైరల్‌ జ్వరాలు, మలేరియా, ఫైలేరియా, కండరాల నొప్పులు ముఖ్యమైనవి. వీటితోపాటు సొరియాసిస్‌, ఎక్జిమా, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌, దురద రావడం లాంటి సమస్యలు వస్తుంటాయి. సోరియాసిస్ అనేది తరచుగా కన్పించే చర్మ వ్యాధి. వెండి పొలుసుల్లా తయారై గోకినప్పుడు అవి రాలిపోతాయి. దీనికి స్పష్టమైన కారణం తెలియదు. శరీరంలో అన్నిచోట్లా ఇది కన్పిస్తుంది. ఈ శీతాకాలంలో వచ్చే మరో చర్మ వ్యాధి ఎక్జిమా. ఇది అలర్జీ వల్ల వస్తుంది. ఇది శరీరంలో ఎక్కడైనా రావచ్చు. దీని నివారణకు యాంటీబయాటిక్స్‌ వాడాలి.


జలుబు, దగ్గు సమస్యలు కూడా మనల్ని ఈ చలి కాలంలో వేధిస్తాయి. ఇవి బ్యాక్జీరియా వల్లగాని, వైరస్‌ వల్లగాని రావచ్చు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ తుంపర్లు గాలిలో కలిసి పది అడుగులు దూరం వుండే వ్యక్తికి కూడా సంక్రమించవచ్చు. గది తలుపులు, కిటికీలు పూర్తిగా మూసినప్పుడు ఈ వైరస్‌ త్వరగా మిగతా వారికి సోకే ప్రమాదం వుంది. వృద్ధులకు, వ్యాధుల నుండి కోలుకొనే వ్యక్తులకు, చిన్నపిల్లలకు, బలహీనులకు వారి రోగనిరోధకశక్తి క్షీణించినప్పుడు త్వరగా వ్యాప్తిస్తుంది. రోగి వాడిన దుప్పట్లుగాని, ముక్కును తుడుచుకోవడం వల్లే గాని, అతడు ముక్కును తాకి అదే చేతితో ఏదైనా వస్తువు తాకితే, అదే వస్తువును వేరెవరైనా తాకితే వారికి కూడా సంక్రమిస్తుంది

కీళ్ళనొప్పుల వాపులు కూడా ఈ శీతకాలంలో వస్తున్నాయి. సరైన వ్యాయామం లేకుంటే ఇవి ఎక్కువగా కన్పిస్తాయి. రక్తనాళాలు ముడుచుకుని రక్తప్రసరణ సరిగ్గా జరగక టాక్సిన్స్‌ వుండి కీళ్ళనొ ప్పులు ఎక్కువవుతాయి. రుమాటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌, గౌట్‌ వ్యాధి ఉన్న వారిలో ఎక్కువగా వాపు కనిపిస్తుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే నీరు ఎక్కువగా తాగడం, పళ్లరసాలు ఎక్కువగా తీసుకోవడం, గోరు వెచ్చని నీళ్లలో కాళ్లు, చేతులను కొద్దిసేపు ఉంచడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న పిల్లలోని విరేచనాలు కూడా ఈ శీతాకాలంలో ఎక్కువగా వస్తుంది. ఈ సమస్యకు ముఖ్య కారణం రోటోవైరస్‌. దీంతో కలిగే విరేచనాలు సాధారణ మందులతో త్వరగా తగ్గవు. అందుకే పిల్లలు పుట్టిన 7వ నెలలో, 8వ నెలలో వ్యాక్సిన్‌ తప్పనిసరిగా వేయించాలి. ఒక్కోసారి నులిపురుగుల వల్ల జియార్డిసెస్‌ వల్ల కూడా విరేచానాలు రావచ్చు. వీరికి ఎలక్ట్రోలైట్‌ పౌడరు నీళ్లలో కలిపి ఇవ్వాలి. డీహైడ్రేషన్‌ ఎక్కువగా ఉంటే సెలైన్‌ ఎక్కించాల్సిన ఉంటుంది.

వైరల్‌ జ్వరాలు కూడా ఈ శీతాకాలంలో మనల్ని పలకరిస్తుంటాయి. డెంగీ వ్యాధి, చికున్‌ గున్యా ఈడిస్‌ ఈజిప్టై అనే దోమవల్ల కలుగుతాయి. వీటిలో అకస్మాత్తుగా చలి జ్వరం కీళ్ళనొప్పులు, వాపులు, వాంతులు, విరేచనాలు, విపరీతమైన నిస్సత్తువ ఉంటాయి. ఈ దోమలు పగటిపూటనే కుడతాయి. ఇవి మంచి నీటిలో పెరుగుతాయి. నివారణకు ఒళ్ళంతా కప్పే దుస్తులు వేసుకోవాలి. ఇంట్లో గాని పరిసరాల్లో నిల్వఉండేవి రోజూ మారుస్తూ ఉండాలి. వీటికి పెయిన్‌ కిల్లర్స్‌, క్రోసిన్‌ మందులు వాడాలి.

ఈ శీతాకాలంలో మలేరియా, ఫైలేరియా లాంటి జ్వరాలు కూడా వస్తుంటాయి. కాబట్టి వీటి నివారణ కోసం దోమ తెరలు వాడటం, శరీరమంతా కప్పే దుస్తులు కప్పుకోవడం, వీటి లార్వాను నాశనం చేసే పైరిథ్రియమ్‌ మందులు పిచికారితో నాశనం చేయడం, ఓడోమస్‌ లేపనం పూసుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కీళ్ల నొప్పులున్న వారికి ఉదయం లేవగానే ‘మార్నింగ్‌ స్టిఫ్‌సెస్‌ రావచ్చు. కాబట్టి వీరు తగిన వ్యాయామం చేయాలి. రక్త ప్ర సరణ బాగా జరిగి ఉపశమనం కలుగుతుంది.

ఏ కాలంలోనైనా తగిన శారీరక శ్రమ ఉంటే బద్ధకం తగ్గి ఒంట్లో చురుకుదనం పెరుగుతుంది. ఉదయానే వ్యాయామం చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. చర్మానికి తగినంతగా సూర్యరశ్మి అందితే ఎముకలకు మేలు జరుగుతుంది. జలుబు, గొంతునొప్పితో బాధపడే వారు ఆకుకూరలు, ఉసిరికాయలు, అనాస పండ్లు, ఖర్జూరా, బొప్పాయి వంటి పదార్థాలను ఎక్కువగా తినాలి. సీ-విటమిన్ అధికంగా ఉన్న పండ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి.

శరీరంలో వేడిని పెంచేందుకు రాగులు, జొన్నలు, కొర్రలతో చేసిన జావ తాగాలి. గోరువెచ్చటి నీటిలో కాస్త నిమ్మరసం, తేనె కలిపి తాగితే మలబద్ధకం, గొంతు సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఐరన్, కాల్షియం పుష్కలంగా లభించే పాలకూరను తింటే ఎముకలకు దృఢత్వం వస్తుంది. చలి వేళ ఎముకలు పట్టేసినట్లు అనిపిస్తే తోటకూర, గోంగూర, పాలకూర, కరివేపాకు వంటివి విరివిగా వంటకాల్లో వాడాలి. ఎముకలు, చర్మ సంరక్షణకు ఉపయోగపడేలా ఐరన్, కాల్షియం, పీచు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు వంటి పోషకాలున్న ఆహారాన్ని తినాలి. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే శీతాకాలంలోనూ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది.

Leave a Comment