Yoga : యోగాతో సంపూర్ణ ఆరోగ్యం..!

By manavaradhi.com

Published on:

Follow Us
yoga benefits

నిజమైన ఆరోగ్యానికి మూలాలు మనస్సులో ఉంటాయి. మనసు నిర్మలంగా, నిశ్చలంగా ఉన్న చోట వ్యాధులకు ఆస్కారం తక్కువగా ఉంటుంది. మ‌న‌సును ప్ర‌శాంతంగా ఉంచుకోవడం కేవ‌లం యోగ ద్వారా సాధించ‌వ‌చ్చ‌ని చెబుతున్నారు యోగా నిపుణులు. యోగా అంటే కేవలం ఆసనాలు మాత్రమే కాదు. ఇది ఒక జీవన విధానం. యోగ అంటే వ్యాయమంతో ఆధ్యాత్మికత కలవడం. ఇంద్రియాలను వశపర్చుకుని ఏకాగ్రత సాధించడం. నిత్యం యోగాతో శారీరక, మానసిక సమస్యలను దరి చేరకుండా చూసుకోవచ్చు.

యోగాతో ఏకాగ్రత పెరగడంతో పాటు మానసిక ఉత్తేజం కల్పిస్తుంది. శరీర సౌష్టవంతో పాటు చర్మకాంతి పెరుగుతుంది. సరైన రీతిలో హార్మోన్లు వెలువడటం వలన జ్ఞాపకశక్తి పెరగడం, జీర్ణవ్యవస్థ, రక్తప్రసరణ, శ్వాస సంబంధ అంశాలు సక్రమంగా పనిచేస్తాయి. రక్తహీనత, రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, ఆస్తమా, అజీర్తి, మలబద్ధకం, శ్వాసకోస వ్యాధులు, కీళ్లనోప్పులు మానసిక జబ్బులు తగ్గించుకునేందుకు వీలుంటుంది. పార్శ్వపు నొప్పి, తలనొప్పి వంటి వాటికి కూడా యోగాతో ఉపశమనం పొంద‌వ‌చ్చు.

రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, నాడీ వ్యవస్థ దెబ్బతినడం వంటి వాటి నుంచి ఉపశమనం పొంది పూర్తిగా ఆరోగ్యవంతంగా తయారయ్యేందుకు వజ్రాసనం, శుప్తవవూజాసనం, పరిపూర్ణ వజ్రాసనం ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. యోగాతో అవయవాలు, నాడీకేంద్రాల మధ్య సమన్వయం పెరిగి నరాల్లో కొత్త ఉత్తేజం నిండి మెదడు, శరీరం, మనసుకు కొత్త శక్తి వస్తుంది. నిత్యం 10 నుంచి 20 నిమిషాలు యోగా కోసం కేటాయించడం వ‌ల్ల మంచి ఫ‌లితాలు ఉంటాయి.

యోగ సాధన కేవలం శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, పూర్తి జీవన విధానాన్ని మార్చేస్తుంది. శరీరంలోని అవయవాలన్నీ కూడా ఫ్లెక్సిబుల్‌గా మారతాయి. కీళ్లు, నాడులు, కండరాలు అన్నీ కూడా చురుకుగా తయారవుతాయి. శరీర అంతర్భాగాలు, రక్తనాళాలన్నీ ఉత్తేజితమవుతాయి. యోగా చేసి సంపూర్ణ ఆరోగ్యంతో, మానసిక బలంతో నిత్యం యవ్వనంగా జీవించవచ్చు. శ‌రీరాన్ని వంచ‌కుండా నిటారుగా న‌డిచేందుకు యోగా ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. టైప్2 డ‌యాబెటిస్‌, బీపీ వంటి వ్యాధుల‌ను కూడా యోగా, ధ్యానంతో త‌గ్గించుకోవ‌చ్చు. అల‌స‌ట‌, నిద్ర స‌మ‌స్య‌లు, ఎసిడిటీ, ఊబ‌కాయం వంటి స‌మ‌స్య‌ల‌కు కూడా చెక్ పెట్ట‌వ‌చ్చు.

జీవనవిధానంలో యోగా ఒక‌ భాగమైతే ఎలాంటి అరోగ్య స‌మ‌స్య‌లు మ‌న‌ దరికి చేర‌వు. నిత్యం కొద్దిసేపు యోగా సాధ‌న‌కు స‌మ‌యం కేటాయించ‌డం ద్వారా ఆసుప‌త్రుల చుట్టూ తిరగాల్సి రావ‌డం త‌ప్పుతుంద‌ని గుర్తుంచుకోండి. నిత్యం యోగా చేయండి.. ఆరోగ్యంగా ఉండండి.

Leave a Comment