డ్యాన్స్ అంటే కేవలం వినోదమే కాదు… అంతకుమించిన వ్యాయామం.. బాడీ ఫిట్‌గా ఉండేందుకు ఎంతగానో దోహదం చేస్తుంది. చాలామంది ఏదో పండుగకో.. పబ్బానికో.. ఆనందంగా ఉన్నప్పుడు చేస్తారు.. కానీ నిజానికి ఆనందంగా ఉన్నప్పుడు డ్యాన్స్ చేయడం కాదు.. డ్యాన్స్ చేస్తే ఆనందంగా ఉంటారనేది నిజం. డ్యాన్సింగ్ తో మెదడు మరింత చురుకు ఉంటుందని పరిశోదకులు చెబుతున్నారు.
- ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా అందరిలోనూ ఒత్తిడి భారం అధికమవుతోంది. జుంబా డ్యాన్స్ చేయడం ద్వారా ఒత్తిడిని సులభంగా అధిగమించవచ్చు. ఎందుకంటే ఇది ఫిజికల్ ఎక్సర్సైజ్ మాత్రమే కాదు. మెదడుకి కూడా ప్రశాంతతను అందిస్తుంది.
- సంగీతం, డ్యాన్స్ రెండూ మనలోని ఒత్తిడిని తగ్గిస్తాయి. జుంబాలో సంగీతం, డ్యాన్స్ రెండూ ఉంటాయి. కాబట్టి ఒత్తిడి చిటికేసినట్టుగా మాయమవుతుంది. అంటే మానసికంగా మన ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- డ్యాన్స్ చేయడం వల్ల మెదడు షార్ప్‌గా తయారవుతుంది. ఎందుకంటే ట్రైనర్‌ని చూస్తూ స్టెప్పులేయడంతో పాటు వాటిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మేధో వికాసాన్ని పెంచుతుందట. ఈ విషయం కొన్ని అధ్యయనాల్లో సైతం రుజువైంది.
- రోజూ క్రమం తప్పకుండా జుంబా చేసే వారిలో జ్ఞాపకశక్తి మెరుగు పడటంతో పాటు నిర్ణయం తీసుకొనే సామర్థ్యం సైతం మెరుగుపడిందని తేలింది. అంతే కాదు డ్యాన్స్ కారణంగా తెలివితేటలు అమోఘంగా వృద్ది చెందుతాయట.
- నృత్యం మన మెదడుకు మేధో సవాలు విసురుతుంది. సంగీతానికి అనుగుణంగా శరీరం వంపులు తిరగడం అవగాహనాశక్తి, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మేళవిపుతోనే సాధ్యమవుతుంది.
రోజూ తప్పకుండా ఏదో వ్యాయామం చేయాలనుకున్నవారిలో చాలామంది డ్యాన్స్‌కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారని చాలా పరిశోధనల్లో తేలింది. ఎందుకంటే.. ఇలా చేయడం వల్ల ఏదో వర్కవుట్ చేసినట్లు కాకుండా ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు. జుంబా, ఏరోబిక్స్ ఇలా ఏదైనా సరే డ్యాన్స్‌తోనే ముడిపడి ఉంటుంది. మ్యూజిక్ వినడం, దానికి తగ్గట్లు బాడీని కదిలించడం.. అన్ని కూడా రిలాక్స్ చేసే పనులే.. ఇలా చేయడం వల్ల చక్కని వ్యాయామం చేసినట్లే.. ఆ కారణంగా ఆరోగ్యం మీ సొంతమైనట్లే.. కండరాలు, ఎముకలను బలంగా చేయడం, బాడీని ఫిట్‌గా ఉంచడం, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడం డ్యాన్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్. డ్యాన్స్ శరీరంలో ఎండోర్ఫిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. బ్రెయిన్ లో ఫీల్ గుడ్ హార్మోన్స్ విడుదల కావడం వల్ల డిప్రెషన్ తగ్గించుకోవచ్చు. తద్వారా మెదడు మరింత చురుగా పని చేస్తుంది.