మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత అవసరవెూ నిద్ర కూడా అవసరమే. మంచి ఆరోగ్యముతో ఉండాలంటే రోజుకు 8 గంటల నిద్ర అవసరం. నిద్ర వల్ల విశ్రాంతిని `పొందడమే కాదు.. మన శరీరంలోని అతి ముఖ్య పనులకు సహాయపడుతుంది. నిద్ర ఆరోగ్యానికి మంచిది కదా అని….చాలామంది నిద్ర పోవడమే పెద్ద పనిగా పెట్టుకుంటారు… చాలా అధ్యాయాల్లో ఎక్కువ నిద్ర ఆరోగ్యానికి మంచివి కాదు అని తేలింది. ఎక్కువ నిద్ర వల్ల కలిగే ఆరోగ్యసమస్యలు ఏంటి…?
నిద్రపోవడం అంటే అందరికీ ఇష్టమే. సాధారణంగా చాలా మంది సమయం దొరికితే చాలు హ్యాపీ నిద్రపోవాలి. రెస్ట్ తీసుకోవాలి అనుకుంటారు. ప్రతి ఒక్కరికీ నిద్ర చాలా అవసరం. ఎంత అవసరం అంటే ఆరోగ్యానికి మంచి చేసేంత. ఈ విషయం అందరికీ తెలిసిందే. నిద్రలేమి వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయన్న విషయం మనందరీకి తెలిసినదే. . ఆరు గంటల కన్న తక్కువ నిద్రపోవడాన్ని తక్కువ నిద్ర అని.. పది గంటల కన్నా ఎక్కువ నిద్రపోవడాన్ని ఎక్కువ నిద్ర అని అంటారు. ఈ రెండూ కూడా మన ఆరోగ్యానికి హానిచేసేవే. అయితే ప్రతిరోజు 6 నుండి 8 గంటల పాటూ నిద్రపోవటం ఆరోగ్యానికి మంచిది అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 9 గంటల కంటే ఎక్కువ సమయం పాటూ నిద్రపోవటం వలన శరీర విధులలో ఆటంకాలు ఏర్పడతాయి. అతినిద్ర వలన పూర్తి ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఎక్కువ సమయం నిద్ర మంచిది కాదా ?
అతినిద్ర వలన మెదడు పనితీరు కూడా దెబ్బతింటుంది. మెదడు పనితీరులో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. నిద్ర విషయంలో ఒక్కొక్కరిలో ఒక్కో అలవాటు ఉంటుంది. కానీ ఎక్కువ సమయం పడుకున్న వారు డిప్రెషన్ కు గురయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశోధనలలో తేలింది. పది గంటల కంటే ఎక్కువ సమయం పాటూ పడుకునే వారిలో, టైప్- 2 మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ సమయం పాటూ నిద్రపోవటం వలన గుండె సంబంధిత సమస్యలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు.
ఒంట్లో బాగాలేనప్పుడు లేదా ఏదైనా భాదలో ఉన్నప్పుడు నిద్రపోతే ఉపశమనం కలుగుతుంది. కాని ఎక్కువ సేపు నిద్ర నిద్రపోవడం వల్ల భాదను తగ్గించకపోగా పెంచుతుంది. ఎక్కువ సేపు పక్క మీద పడుకోవటం వల్ల వీపు భుజాల నొప్పి మెుదలవుతుంది. అతి నిద్రవల్ల తరచుగా తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి. అతి నిద్ర వల్ల శారీరక మానసిక సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి రోజు తగినంత సేపు నిద్ర పోవడం ఆరోగ్యానికి మంచిది.
ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల ఊబకాయం సమస్యలు వచ్చే అవకాశముంది. వయసు పైబడిన వారు పది గంటలకు మించి నిద్రపోవడం వల్ల వారిలో మతి మరుపు సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. అతి నిద్రతో టెన్షన్ పెరుగుతుంది. అతి నిద్ర ఏకాగ్రతను దెబ్బతీస్తుంది.అతి నిద్ర, మనిషి వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేస్తుంది. ఉద్యోగం చేసేవారికి అతి నిద్ర ఇంకా ప్రమాదకరం. ఎక్కువ సమయం నిద్రపోకుండా ఉండేందుకు ఏదైనా పనిచేసేలా ప్లానింగ్ చేసుకోవాలి.
పనిచేస్తున్నప్పుడు నిద్ర ముంచుకురాగానే కాస్తా అటూఇటూ నడవాలి. శరీరాన్ని ఉత్తేజితపరిచే కాఫీ, టీ తీసుకోవడం వల్ల నిద్ర పోకుండా చూసుకోవచ్చు. ప్రతి రోజూ ఒకే సమయానికి పడుకోవడం, ఒక సమయానికి నిద్రలేవడం చాలా మంచిది.అతి నిద్ర వల్ల శారీరక మానసిక సమస్యలు తలెత్తుతాయి. వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేస్తుంది. కాబట్టి రోజు తగినంత సేపు నిద్ర పోవడం ఆరోగ్యానికి మంచిది.