Meenakshi Chaudhary: హీరోయిన్ మీనాక్షి చౌదరి అక్కినేని హీరోను పెళ్లి చేసుకోబోతుందా..!

By manavaradhi.com

Updated on:

Follow Us
Sushanth and Meenakshi Chaudhary

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ అంతేకాదు అటు తమిళంలోను మంచి గుర్తింపు తెచ్చుకుంది మీనాక్షి చౌదరి. “ఇచ్చట వాహనములు నిలపరాదు” సినిమాద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈ తర్వాత వరసగా మాస్ మహారాజ రవితేజ ఖిలాడి చిత్రంలో, విశ్వఖ్ సేన్ నటించిన హిట్ లో , గుంటూరు కారం సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బుబు కు మరదలి పాత్రలో ప్రేక్షులను మెప్పించింది. తమిళంలో విజయ్ సరసన గోట్ అనే సినిమాలో కూడా నటించింది. రీసెంట్‌గా దుల్కర్ సల్మాన్ సరసన లక్కీభాస్కర్ లో నటించి మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా మెగా హీరో వరుణ్‌ తేజ్‌ సరసన మట్కా సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఈనెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం మీనాక్షి చౌదరికి సంధించిన ఒక వార్త సోషల్‌ మీడియాలో తెగ చక్కెరలు కోడుతుంది. అది ఏంటంటే అక్కినేని కుంటుంబంలోని ఓ హీరో ను పెళ్లి చేసుకోబోతుందంట..! ఇంతకీ ఆహీరో ఎవరంటారా…. ఇక ఆ హీరో ఎవరో కాదు అక్కినేని నాగార్జున సోంత మేనల్లుడు సుశాంత్ అంటా. అడ్డా, లవ్లీ, కరెంట్‌, కాళిదాసు లాంటి సినిమాల్లో నటించి సుశాంత్‌ ప్రేక్షకులను అలరించారు. అల వైకుంఠపురంలో చేసిన పాత్ర మంచి పేరు తీసుకువచ్చింది. కొన్నాళ్ల నుంచి సుశాంత్‌, మీనాక్షి చౌదరి డేటింగ్‌ లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నారని ఫిలిం నగర్‌ వర్గాల సమాచారం. ఇందులో వాస్తవమెంతో తెలియదుకానీ సోషల్‌ మీడియాలో మాత్రం ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన వార్త ట్రెండింగ్ లో ఉంది.

మీనాక్షి చౌద‌రి మోడల్ నుంచి నటిగా మారిది 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది. హర్యానాకు చెందిన ఈ భామ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. హీరోయిన్‌గా తెరంగేట్రం చేయకముందే ఫోటో షూట్స్‌తో అదరగొట్టింది. చదువుకున్న రోజుల్లో రాష్ట్ర స్థాయి స్విమ్మర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ. ఫెమినా మిస్ ఇండియా 2018 పోటీలో హర్యానా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 గా కిరీటాన్ని పొందింది.సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటూ అభిమానులను ఖుషి చేస్తుంది.

Leave a Comment