మనం తినే ఏ ఆహార పదార్థం కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, గుడ్లు వంటివైతే చాలా త్వరగా పాడైపోతాయి. ఈ క్రమంలో వాటిని సంరక్షించుకునేందుకు చాలా మంది ఆయా ఆహార పదార్థాలను ఫ్రిజలలో పెడుతుంటారు. అయినప్పటికీ కొన్ని పదార్థాలు పాడైపోతాయి. అయితే అలా పాడుకాకుండా ఇంకొంచెం ఎక్కువ రోజులు ఆహార పదార్థాలు నిల్వ ఉండేందుకు ఏం చేయాలి..?
ఆహారాన్ని నిలువ ఉంచుకునేందుకు ఒక్కోక్కరు ఒక్కోక్క పద్దతిని అనుసరిస్తారు. చాలా మంది ఏం తీసుకొచ్చినా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఫ్రెష్ గా ఉంటుందనుకుంటారు. అది మంచి పద్దతి కాదు. నిజానికి ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన వస్తువులు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. మరికొన్ని ఆహార పదార్థాలు ఏ మాత్రం అందులో పెట్టకూడదు. ఎందుకంటే.. వాటివల్ల హానికలిగే అవకాశం ఉంది.
చాలామంది ఫుడ్ మిగిలిన వెంటనే ఫ్రిడ్జ్ లో తోసేయడం ఒకఅలవాటుగా ఉంటుంది. ఫ్రూట్స్, బ్రెడ్, వెజిటబుల్స్, సాస్, సరుకులు కూడా కొంతమంది పెట్టేస్తుంటారు.అయితే కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల వాటి ఫ్లేవర్ మారిపోతాయి. న్యూట్రీషన్స్ తగ్గిపోతాయి. అలాగే అవి చెడిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఏ ఆహారాలన్ని ఎలా నిల్వ ఉంచుకోవాలో తెలుసుకుని మరి భద్రపరుచుకోవాలి.
ఆహారం యొక్క ఉష్ణోగ్రతను తగ్గించడం వలన సూక్ష్మజీవుల చర్యలు ఆగిపోయి ఆహారం పరిరక్షించబడుతుంది. ఘనీభవించిన ఆహార పదార్థాలు తాజా ఆహారం కంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఎందుకంటే సూక్ష్మజీవులు తక్కువ ఉష్ణోగ్రతల వద్ద చురుకుగా ఉండలేవు. అందువలనే మనం ఆహారాన్ని ఫ్రిజ్లో పెట్టినపుడు సూక్ష్మజీవులను పెరగకుండా నివారించవచ్చు.
పాల్లో లాక్టోబాసిల్లస్ అని పిలువబడు బ్యాక్టీరియా చాలా చురుకుగా త్వరగా ఆహారాలను పెరుగుగా మార్చేస్తుంది . ఈ కారణం చేతనే పాలుచాలా త్వరగా పాడవుతాయి. చాలా త్వరగా పాడయ్యే మరో ఆహారం బటర్ . మీరు కనుక బటర్ ను చల్లని వాతావరణంలో ఉంచకపోతే త్వరగా పాడైపోతుంది.
కూరగాయల్లో నీటిశాతం ఎక్కువగా ఉన్నవి చాలానే ఉన్నాయి . వీని చల్లని వాతావరణంలో స్టోర్ చేసుకోవాలి. శరీరం చల్లగా ఉండాలంటే పెరుగును తప్పని సరిగా తీసుకోవాలి. అయితే పెరుగును సరిగా నిల్వచేయకపోతే త్వరగా పడావుతుంది.
గుడ్లు ముద్రించిన తేదీ నుండి ఐదు వారాల వరకు నిల్వ ఉంటాయి. అయితే బాగా ఉడికించిన గుడ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండవు. పండ్లు సిట్రస్ పండ్లు మరియు ఆపిల్ వంటి వాటిని సరిగ్గా శీతలీకరించిన చేస్తే రెండు వారాలు మరియు మొత్తం నెల వరకు నిల్వ ఉంటాయి.
ముడి బియ్యం కొన్ని రోజుల పాటు మాత్రమే నిల్వ ఉంటుంది. కానీ పాలిష్ చేసిన తెల్ల బియ్యం అలా కాదు. ఎన్ని రోజుల పాటు అయినా నిల్వ ఉంటుంది. కాకపోతే ఆ బియ్యాన్ని గాలి చొరబడని పాత్రలు, సంచుల్లో ఉంచాల్సి ఉంటుంది. ఉప్పుకు నీరు తగలకుండా డబ్బలో ఉంచితే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది.
చక్కెరలో బాక్టీరియా పెరగదు. కనుక దాన్ని ఎంత కాలం ఉంచినా పాడవ్వదు. అయితే వాతావరణంలో ఉన్న తేమ తగిలితే చక్కెర గట్టి పడుతుంది. అన్ని రకాల పప్పు దినుసులు, సోయా, బీన్స్ జాతులకు చెందిన గింజలు కూడా ఎన్ని రోజులైనా పాడవ్వవు. వాటిల్లో పోషకాలు అలాగే ఉంటాయి. వీటిని ఎన్ని రోజుల పాటు అయినా నిల్వ చేయవచ్చు. అయితే పురుగులు పట్టకుండా చూసుకోవాల్సి ఉంటుంది.అలాగే గాలి, తేమ తగలదు కనుక పాలిథిన్ సంచుల్లోను ,అల్యూమినియం తగరంలోను ప్యాకింగ్ చేసిన ఆహారం కూడా సూక్ష్మజీవుల బారి నుండి రక్షింపబడుతుంది .
సరైన ఉష్ణోగ్రతలో ఆహారం ఉడికించకపోవడం, త్వరగా పాడై ఆహారం అపరిశుభ్రతకు గురి అవుతుంది. కనుక ఆహారం సరియైన ఉష్ణోగ్రతలో ఉడికించాలి. ఎందుకంటే ఉష్ణోగ్రతలోను హెచ్చుతగ్గుల వలన బాక్టీరియా పెరుగదల రెట్టింపు అవుతుంది.