Migraine : మైగ్రేన్‌ (పార్శపు తలనొప్పి) వేధిస్తున్నదా? దాన్ని తగ్గించడం ఎలా?

By manavaradhi.com

Updated on:

Follow Us
Migraine

మైగ్రేన్ దీన్నే పార్శపు తలనొప్పి అంటారు. మైగ్రేన్ ఈరోజుల్లో చాలా మందిని వేధిస్తోంది. ఈ తలనొప్పితో నేడు ఎంతోమంది శారీరక, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. మైగ్రేన్ రావడానికి ఎన్నో కారణాలున్నాయి. అసలు ఈ మైగ్రేన్ తలనొప్పి ఎందుకు వస్తుంది? ఇది మన ఆరోగ్యం పై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది.

సాధారణంగా మైగ్రేన్ ఒకరోజు నుంచి మూడు రోజుల వరకు ఉంటుంది. తర్వాత తగ్గిపోతుంది. కానీ .. ఉన్నప్పుడు మాత్రం భరించరాని నొప్పి కలిగిస్తుంది. కొంత మందిలో తలనొప్పితోపాటు వాంతులు కూడా ఉంటాయి. పెద్ద వెలుతురులను .. ఘాటైన వాసనలు కూడా వారు భరించలేరు. మీరు మైగ్రేన్ తలనొప్పితో భాదపడుతున్నట్లయితే, అది అనేకములైన ఇతర అనారోగ్య పరిస్థితులకు కూడా కారణం కావొచ్చు. ఒక అధ్యయనం ప్రకారం… భవిష్యత్తులో ఎదుర్కోబోయే కొన్నిరకాల ఆరోగ్య పరిస్థితులను కూడా మైగ్రేన్ తలనొప్పి సూచిస్తుంది. పెరిగే ప్రమాదం కూడా ఉంటుందని తేలింది.

మైగ్రేన్ తలనొప్పిని పార్శ్వపు తలనొప్పిగా కూడా వ్యవహరిస్తారు. మైగ్రెయిన్ తలనొప్పులు, డిప్రెషన్ నుంచి ఆస్థమా, గుండె జబ్బులకు సంబంధించిన పలు సమస్యలతో ముడిపడి ఉంటుంది. మైగ్రెయిన్ సమస్యకు దారితీసే మార్గాలు అనేకం ఉంటాయి. ఈ మార్గాలు వ్యక్తి వ్యక్తికి భిన్నంగా ఉంటాయి. క్రమంగా ఈ సమస్యను ఎదుర్కోవడం కొంచం క్లిష్టతరంగా ఉంటుంది. సమస్యకు కారణం తెలుసుకోవడం ద్వారా పార్శ్వపు తలనొప్పికి సరైన చికిత్స చేయవచ్చు. అందరికీ ఒకేరకమైన చికిత్స అంటూ మైగ్రేన్ సమస్యలో ఉండదు. చికిత్స, మైగ్రేన్ తలెత్తడానికి గల కారకాల మీద ఆధారపడి ఉంటుంది.

మైగ్రెన్ తలనొప్పి సమస్యతో భాదపడుతున్నవారు.. ఇతర అనారోగ్య పరిస్థితుల గురించిన అవగాహన అవసరం. ఈ భిన్న ఆరోగ్య సమస్యల గురించిన అవగాహన కలిగి ఉండడం ద్వారా మైగ్రేన్ సమస్యతో పాటుగా, మైగ్రేన్ కారక అనారోగ్య సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు. ఎవరైతే తరచుగా మైగ్రెయిన్ సమస్యను అనుభవిస్తున్నట్లయితే, అది డిప్రెషన్ సమస్యను సైతం రెట్టింపు చేస్తుంది. సమస్యను గుర్తించని పక్షంలో, తీవ్ర పరిస్థితులకు కూడా దారితీస్తుంది.

మైగ్రెయిన్ నొప్పి సంబంధించిన అగ్రవ్యాధుల్లో డిప్రెషన్ కూడా ఒకటి. దీర్ఘకాలిక పార్శ్వపు నొప్పి ఉన్న వ్యక్తులు ఆందోళనల సమస్యను అధికంగా కలిగి ఉంటారు. ఆందోళన కలిగి ఉన్న రోగులు మైగ్రెయిన్స్ ఎలా కలిగి ఉంటారో, మైగ్రేన్ నొప్పి ఉన్నవాళ్ళు ఆందోళనలను కూడా అలాగే కలిగి ఉంటారు. అనేక అధ్యయనాలు, స్ట్రోక్ మరియు మైగ్రేన్లు మధ్య సంబంధాలు ఉన్నట్లుగా తేల్చాయి. అంతేకాకుండా సాధారణ ప్రజలతో పోల్చితే మైగ్రేన్లు తలెత్తినప్పుడు కలిగే లైట్ సెన్సిటివిటీ ఉన్న వ్యక్తులు రెట్టింపు స్ట్రోక్ ప్రమాదాన్ని కలిగి ఉంటారని తేలింది.

మూర్చ మరియు పార్శ్వపు నొప్పి రెండూ తీవ్రస్థాయిలో మానసిక మార్పులను ప్రభావితం చేస్తాయి. వీటిలో ఏ సమస్య తలెత్తినా, మరొకటి కూడా తోడుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మైగ్రెయిన్స్ అధికంగా ఉండే పురుషులు మరియు మహిళలు అధికంగా గుండె వ్యాధుల ప్రమాదాన్ని కలిగి ఉంటారు. గుండె పోటు, అధిక రక్తపోటు, మధుమేహం వంటివి, మైగ్రెయిన్ బాధితులకు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒక అధ్యయనంలో తేలింది. ఆస్థ్మా మరియు మైగ్రేన్ రెండింటికి ఇన్ఫ్లమేషన్ సమస్య కూడా కారకంగా ఉంటుంది.

మెదడు వెలుపల ఉన్న రక్తనాళాల వాపు, నొప్పిని కలిగించగలదు. ఇది మైగ్రెయిన్ యొక్క సంకేతంగా ఉంటుంది. పార్శ్వపు నొప్పికి సంబంధించిన ప్రధానమైన వ్యాధులలో ఇది కూడా ఒకటి. పార్శ్వపు నొప్పి కలిగి ఉంటే, అధిక బరువు, సమస్యను మరింత తీవ్రతరం చేయవచ్చు. పార్శ్వపు నొప్పిని తరచుగా కలిగిఉంటే ఊబకాయం మైగ్రేన్ సమస్యను పెంచే ట్రిగ్గర్ వలె ఉంటుంది. ఊబకాయంతో భాద పడేవారికి మైగ్రేన్ సర్వసాధారణ విషయంగా ఉంటుంది.

పార్శ్వపు నొప్పి కలిగిన వ్యక్తులకు జీర్ణ సంబంధ సమస్యల ప్రాబల్యం అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా కడుపు ఉబ్బరం, ప్రేగు వాపు వ్యాధి మరియు ఉదరకుహర వ్యాధి ప్రధానంగా ఉన్నాయి. రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ ఈ సమస్యతో ఉన్నవాళ్ళు, కాళ్ళు కదిలించడానికి కూడా సమస్యను కలిగిఉంటారు. క్రమంగా ఇది రోజూవారీ కార్యకలాపాల మీద మరియు, నిద్ర మీద ప్రభావాన్ని కలిగి ఉంటుంది. RLS మరియు పార్శ్వపు నొప్పి మధ్యగల సంబంధం, డోపమైన్ అనే న్యూరోట్రాన్స్మిటర్ హార్మోన్ విడుదల మీద ప్రభావాన్ని కలిగి ఉంటాయి.

మంచి ఆరోగ్య అలవాట్లను పాటించడం ద్వారా మైగ్రేన్ ను నివారించుకోవచ్చు. తలనొప్పి ఏరకమైనది అయినా సరే తరచూ వేదిస్తుంటే….. అసలు అశ్రద్ధ చేయకూడదు. వెంటనే వైద్యున్ని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోండి. మైగ్రేన్ తలనొప్పితో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

Leave a Comment