Eating disorders – అతిగా తినడం ఎలా మానుకోవాలి?

By manavaradhi.com

Published on:

Follow Us
eating disorder

ఏ ఆహార పదార్థాన్నయినా సరే పరిమిత మోతాదులోనే తినాలి. అతిగా తినడం వల్ల అనర్థాలు సంభవిస్తాయి. తక్కువ మోతాదులో తింటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించే ఆహారాలు.. ఎక్కువ మోతాదులో తింటే నష్టాలను కలగజేస్తాయి. అయితే కొందరికి అతిగా తినడం అనే సమస్య ఉంటుంది.

అతి అనర్థదాయకం. ఆహారం విషయంలో దీన్ని దృష్టిలో పెట్టుకోవటం ఎంతైనా అవసరం. మనకు ఆహారం అవసరమే. అలాగని అతిగా తినటమూ మంచిది కాదు. ఇది మితిమీరితే బరువు పెరగటం దగ్గర్నుంచి గుండెజబ్బుల వరకూ రకరకాల ముప్పులు తెచ్చిపెడుతుంది. చాలామంది ఎప్పుడు తింటూనే ఉంటారు. అలాంటివారు అధిక బరువు ఎక్కుతారు. అలా పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్, కీళ్ల నొప్పులు, వంటి సమస్యలు వస్తాయి. ఇవే కాకుండా ఇంకా అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి.

కౌమారంలో శారీరకంగా, మానసికంగా ఒత్తిళ్లకు లోనవుతారు. అలాంటి సమయంలో వ్యాయామం లేకపోతే సులువుగా బరువు పెరుగుతారు. ఆ ఒత్తిడిలో కడుపు మాడ్చుకుంటారు. దీనివల్ల అనోరెక్సియా నర్వోసా, బ్యులీమియా మొదలైన ‘ఈటింగ్‌ డిజార్డర్స్‌’కు గురవుతారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ తినేలా చేసే వ్యాధి అతిగా తినే రుగ్మత. ఈటింగ్ డిజార్డర్స్ ఉన్న వ్యక్తి తాము ఎంత తిన్నామో దానిపై నియంత్రణ లేదని భావిస్తారు. అదే పరిస్థితుల్లో, అదే సమయంలో ఇతరుల కంటే ఎక్కువ ఆహారం తింటారు.

అతిగా తినకుండా ఉండటం మంచిది. రోజు టైం ప్రకారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే తీసుకునే ఆహారం లో పోషకాలు, ప్రొటీన్లు, ఉండేటట్టు చూసుకోవాలి. చాలా మంది భోజనాన్ని వేగంగా చేస్తుంటారు. ఇలా చేస్తే ఎక్కువగా తినేందుకు అవకాశం ఉంటుంది. కనుక కొద్దిగా ఆహార పదార్థాలను పెట్టుకుని నెమ్మదిగా తినాలి. దీంతో ఎక్కువ తింటున్నామన్న భావన కలుగుతుంది. ఫలితంగా ఆహారాలను తక్కువగా తినమని మెదడు సూచన చేస్తుంది. దీంతో ఆహారం తినడం ముగించేస్తాం. ఇలా అతిగా తినడం అనే సమస్యను తగ్గించుకోవచ్చు.

ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే వాటిని కొంచెం తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. కనుక ఆహారాన్ని తక్కువగా తింటారు. అతిగా తినకుండా జాగ్రత్త పడవచ్చు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, నట్స్, చిరుధాన్యాలు, తృణ ధాన్యాల్లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. వీటిని రోజూ తింటుంటే అతిగా తినడం అనే సమస్య నుంచి బయట పడవచ్చు.

నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల ఆహారాన్ని తక్కువగా తింటారు. అందువల్ల ఇకపై మీరు భోజనం చేస్తే నేలపై కూర్చుని తినండి. దీంతో ఆహారాన్ని తక్కువగా తింటుంటారు. ఫలితంగా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. భోజనం చేసేటప్పుడు చాలా మంది టీవీలు చూస్తుంటారు. కొందరు పుస్తకాలు చదువుతారు. కొందరు ఫోన్లు చూస్తారు. ఇలా చేయడం వల్ల నిజంగానే ఎక్కువగా తింటారు. ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం.. అనే దానిపై నియంత్రణ ఉండదు. కనుక తినేటప్పుడు వాటిని చూడరాదు. దీంతో ఆహారం తక్కువగా తినేందుకు అవకాశం ఉంటుంది. ఆహారాన్ని కనీసం 25 నుంచి 30 సార్లు బాగా నమిలి తినాలి. దీంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆహారం తక్కువగా తింటాము. ఫలితంగా అతిగా తినడం అనే సమస్య తగ్గుతుంది.

అనారోగ్యాలు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అతిగా తినకుండా ఉండాలి. అలాగే సమతుల ఆహారం తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఆహారంలో ధాన్యపు గింజలు, కూరగాయలు, పప్పు దినుసులు, పండ్లు, పాల ఉత్పత్తులు ఉండేలా చూసుకోవాలి.

Leave a Comment