స్త్రీలలో గర్భాశయం లేదా పొత్తి కడుపులో నొప్పి ఎందుకొస్తుందో తెలుసా ? గర్భాశయంలో నొప్పికి కారణాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు కొన్ని వ్యాధుల ద్వారా లేదా నెలసరి లో సమస్యల వల్ల లేదా అపెండిసైటీస్ వల్ల లేదా మూత్రాశయంలో సమస్యల వల్ల కూడా గర్భాశయంలో నొప్పి వచ్చే అవకాశం ఉంది. పొత్తి కడుపులో నొప్పి నొప్పిని నిర్ధారించుకోవాలంటే నిపుణులైన వైద్యులను సంప్రదించడం మంచిది.
స్త్రీలలో పొత్తికడుపు కింది భాగంలో ఉండేదే గర్భాశయం. అయితే ఈ గర్భాశయంలో కొన్ని సార్లు నొప్పి వస్తూ ఉంటుంది ఈ నొప్పికి కారణాలు చాలానే ఉన్నాయి. కారణాలు ఏవైనా గర్భాశయంలో నొప్పి సాధారణమే. గర్భాశయంలో నొప్పి లేదా పొత్తి కడుపులో నొప్పి మూత్రాశయంలో సమస్య వల్ల మొదలవ్వచ్చు లేదా అండాశయంలో సమస్యల వల్ల కూడా మొదలవ్వచ్చు. కొన్నిసార్లు ఈ నొప్పి గర్భాశయం చుట్టూ ఉండే ఎముకలు లేదా కండరాలు, నరాలు, రక్తనాళాల్లో సమస్యల వల్ల కూడా కలగవచ్చు. ఈ నొప్పి కొంతమందిలో కొంతకాలం మాత్రమే ఉండొచ్చు మరికొంతమందిలో దీర్ఘకాలికంగా ఉండవచ్చు. కారణాలు ఏవైనా గర్భాశయంలో నొప్పిని గుర్తించగానే డాక్టర్ ని సంప్రదించడం మంచిది.
చెప్పుకుంటూ పోతే గర్భాశయంలో నొప్పికి కారణాలు ఒకదాని మించి ఒకటి చాలానే ఉన్నాయి. కారణాలు కచ్చితంగా తెలిస్తే దానికి తగిన మందులు వాడవచ్చు లేదా వెంటనే డాక్టర్ ని సంప్రదించి సరియైన చికిత్స తీసుకోవడం మంచిది. మూత్రంలో వచ్చేఇన్ఫెక్షన్ గర్భాశయంలో నొప్పికి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. దానిని నిర్ధారించడం కోసం మూత్రపరీక్షను చేస్తారు డాక్టర్లు. అండాశయంలో సిస్ట్ లు కూడా గర్భాశయంలో నొప్పికి కారణం కావచ్చు. ఈ సిస్ట్ లను గుర్తించడానికి అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా చేయాల్సి ఉంటుంది.
శారీరక సమస్యలే కాకుండా కొన్నిసార్లు మానసిక సమస్యలు అంటే మానసిక ఒత్తిడి, డిప్రెషన్, అంధోళన వంటివి కూడా స్త్రీలలో పొత్తికడుపు నొప్పికి కారణాలు కావచ్చు. ఎందుకంటే కొంతమందిలో శారీరక లక్షణాలే కాకుండా మానసికంగా ఉద్రేకభరితమైన లక్షణాలను కూడా మనం చూడవచ్చు.