Harmonal Imbalance : హార్మోన్ల అసమతుల్యతను ఎలా నియంత్రణలో ఉంచుకోవాలి?

By manavaradhi.com

Published on:

Follow Us
Harmonal Imbalance

నేడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది సర్వసాధారణంగా మారింది. దీనికి ముఖ్య కారణం ఒత్తిడితో కూడిన జీవనశైలితో పాటు మనం తీసుకొనే అనారోగ్యకరమైన ఆహారం. ఈ హార్మోనుల అసమతుల్యత అనేక సమస్యలకు దారి తీస్తుంది. ఈ సమస్యలు పురుషుల్లో కంటే స్త్రీలలోనే ఎక్కువగా ఉంటాయి. ఈ హార్మోనుల అసమతుల్యత వల్ల వచ్చే ఇతర రుగ్మతల గురుంచి తెలుసుకుందాం.

మనిషి జీవించడానికి శ్వాస ఎంత అవసరమో ఆరోగ్యంగా ఉండడానికి హార్మోనులు కూడా అంతే అవసరం. గర్భాశయంలో పిండంగా ఏర్పడినప్పటి నుంచి మనిషి జీవించి ఉన్నంత వరకు శరీరం మీద హార్మోన్ల ప్రభావం ఉంటుంది. ఈ హార్మోన్‌లు ఎక్సోక్రైన్, ఎండోక్రైన్ అని రెండు రకాలు. ఎక్సోక్రైన్ గ్రంథులు విడుదల చేసే స్రావాలు నాళాల ద్వారా స్రవిస్తాయి. వీటికి ఉదాహరణలు స్వేదగ్రంథులు, కాలేయం. ఈ కాలేయం క్లోమం, జీర్ణ రసాలను ఉత్పత్తి చేస్తుంది. పిట్యుటరీ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్, ఎడ్రినల్ గ్రంథులు ఎండ్రోక్రైన్ గ్రంథులకు నాళాలు ఉండవు. వీటి నుంచి వెలువడిన హార్లోన్లు రక్తంలో కలసి శరీరమంతా వ్యాపిస్తాయి. మగవారిలో వృషణాలు, స్త్రీలలో అండాశయాలను ఎండోక్రైన్ గ్రంథులుగా చెప్పవచ్చు

హార్మోనులు అవసరానికి మించి విడుదలైనా, తక్కువగా విడుదలైనా దుష్పరిణామాలు కలుగుతాయి. ఇవి మానసిక , శారీరక ఎదుగుదలకు ఉపయోగపడతాయి. శరీరంలో గ్లూకోజ్ నియంత్రణ ఇన్సులిన్ పాత్ర హార్మోనుల అసమతుల్యత వల్ల థైరాయిడ్‌ లోపం ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లల్లో మతిమరుపు, బరువు పెరగడం, జుట్టురాలడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనిని హైపోథైరాయిడిజమ్ అంటారు. ఆడపిల్లల్లో నెలసరి సమస్యలు, మొటిమలు, ఎదుగుదలలోపం, అతి బరువు, అవాంఛిత రోమాలు వంటి లక్షణాలు ఉంటాయి. మగపిల్లల్లో మొటిమలు, ఛాతీ ఎక్కువగా ఉండడం, జుట్టురాలడం, మీసాలు, గడ్డాలు రావడంలో లోపాలు హార్మోన్‌ల వల్ల వచ్చే సమస్యలే. అలాగే గ్రోత్ హార్మోన్ ఎక్కువ తక్కువలు కూడా పొడవు పెరగడం మీద ప్రభావం చూపిస్తాయి. నిదానంగా పెరగడాన్ని డ్వార్ఫిజమ్, వయసుకు మించి పెరగడాన్ని జైగాంటిజమ్ అంటారు.

మహిళల్లో సంతానసాఫల్య సమస్యలు, బరువు పెరగడం, అవాంఛితరోమాలు, అండాశయంలో తిత్తులు, హైపర్‌థైరాయిడ్, కుషింగ్ వ్యాధి, మెనోపాజ్ దశలో సమస్యలు, మగవారిలో వీర్యకణాలు తక్కువగా ఉండడం, సెక్స్ సమస్యలు వంటివన్నీ హార్మోన్ తేడాల వల్ల వచ్చే సమస్యలు. హార్మోనుల అసమతుల్యత వల్ల శరీరం నుంచి వేడి ఆవిర్లు వస్తాయి. రెగ్యులర్ గా వ్యాయామం చేయకపోయినా, సరిగా భోజనం చేయకపోయినా కూడా బరువు పెరుగుతుంటారు. రుతుక్రమంలో తేడాలు వస్తుంటాయి. మానసిక ఆందోళన ఎక్కువవుతుంది.

హార్మోన్లను సమతుల్యం చేయడానికి కొన్ని ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఈ హార్మోనులను సమతుల్యం చేయడానికి లేదా కంట్రోల్ చేయడానికి కొన్ని బేసిక్ హెల్తీ ఫుడ్స్ అందుబాటులో ఉన్నాయి. హార్మోనులను సమతుల్యంగా ఉంచడంలో ఫైబర్ ఫుడ్స్ గొప్పగా సహాయడుతాయి. గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ లో ప్రోటీనులు, న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హార్మోనులను బ్యాలెన్స్, కంట్రోల్ చేస్తాయి. హార్మోనులను బ్యాలెన్స్ చేయడానికి కొబ్బరి నూనె ఎక్కువగా ఉపయోగపడుతుంది.ఈ నూనెలో ఎక్కువగా శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అలాగే మహిళల్లో ఈ సమస్యను నివారించాలంటే కాఫీని త్రాగాలి . కాఫీలో ఉండే కెఫిన్ మహిళల్లో ఎండోక్రైన్ సిస్టమ్ కు అంతరాయం కలిగిస్తుంది. దాంతో శరీరంలో కార్టిసోల్ ఉత్పత్తిని క్రమబద్దం చేస్తుంది.

హార్మోనుల అసమతుల్యంతో బాధపడే మహిళలు తాజా పండ్లను తీసుకోవడం ఒక అలవాటుగా చేసుకోవాలి. ముఖ్యంగా ప్లెవనాయిడ్స్ అధికంగా ఉన్న పండ్లను ఎక్కువగా తీసుకోవాలి . ఇవి శరీరంలో హార్మోనులను సమతుల్యం చేస్తాయి. ఇవేకాక ఆర్గానిక్ ఫుడ్స్ కూడా ముఖ్యమనవి. వీటిలో ఎలాంటి రసాయనాలుండవు. అందుకే ఆర్గానిక్ ఫుడ్ పవర్ ఫుల్ గా,నేచురల్ గా న్యూట్రీషియన్స్ కలిగి ఉండటం వల్ల ఇవి శరీరంలో హార్మోనులను మంచి ట్రాక్ లో ఉంచుతుంది.

Leave a Comment