వచ్చినట్టు తెలియదు. అది ఇదేనా అనుకోవడానికి ఆస్కారం లేదు. కొంత మంది ఉత్త అనుమానమే అని కొట్టిపారేస్తే… మరికొంత మంది మాత్రం బెంబేలెత్తి పోతుంటారు. అదే ప్రీ డయాబెటిస్. టైప్ టూ మధు మేహం రావడానికి ముందు మనిషిని కుంగదీసే ఈ సమస్య ప్రమాదకరం కాదు… ఆలోచించాల్సిన సమయం అనేది వైద్యుల మాట. ప్రీ డయాబెటిస్ ఎలా వస్తుంది..?
సరిగ్గా నిద్రపట్టదు, అధికంగా దాహం వేస్తుంటుంది. ఎక్కువగా మూత్రానికి వెళ్ళాల్సి వస్తుంటుంది. షుగర్ వచ్చిందా అనే అనుమానంతో మధుమేహం పరీక్ష చేయించుకున్నప్పుడు ఇంకా డయాబెటిస్ రాలేదని చెబుతారు. కానీ రక్తంలో షుగర్ స్థాయి మాత్రం ఎక్కువగా ఉందని సూచిస్తారు. ఇదే ప్రీ డయాబెటిస్. ఇది షుగ వ్యాధి కాదు… భవిష్యత్ లో దాని బారిన పడబోతున్నారని చెప్పడానికి ఓ సూచన మాత్రమే. భారతదేశంతో పాటు… ప్రపంచ వ్యాప్తంగా ప్రీడయాబెటిస్ బారిన పడిన వారు ఎంతో మంది ఉన్నారు. వారిలో చాలా మందికి తమ సమస్య గురించి తెలియదు. వీటినే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. వీటిని ఎంత తక్కువ చేసుకుని జాగ్రత్త పడగలిగితే… అంతగా డయాబెటిస్ మన దరి చేరకుండా జాగ్రత్త పడవచ్చు.
ప్రీడయాబెటిస్ మొదలైందని తెలుసుకోవడానికి ముందే కొన్ని లక్షణాలు మనలో కనబడతాయి. అచ్చంగా డయాబెటిస్ లక్షణాలే అయినప్పటికీ… అప్పటికింకా డయాబెటిస్ స్థాయిలో ఇవి మనల్ని బాధించవు.
- • అతిగా దాహం వేయడం, ఎంత నీరు తాగినా దాహం తీరకపోవడం
- • ఎక్కువగా మూత్ర విసర్జనకు వెళ్ళవలసి రావడం
- • తీవ్రమైన అలసట బాధించడం
- • కళ్ళు బైర్లు కమ్మినట్టు ఉండడం, మసక మసకగా కనిపిస్తుండడం
- • తరచూ ఇన్ఫెక్షన్లు బాధించడం
- • చిన్న చిన్న గాయాలు మానకుండా, చీము పట్టడం
- • చేతులు, కాళ్ళు తిమ్మిర్లు పట్టడం
- • ఎక్కువగా స్త్రీలలో మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్లు బాధించడం
- ఈ లక్షణాలు ఉంటే మాత్రం దాన్ని ప్రీడయాబెటిస్ గా భావించి, వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.
ప్రీడయాబెటిస్ ను మూడు రకాలైన రక్త పరీక్షల ద్వారా కనుక్కోవచ్చు. ప్రీ డయాబెటిస్ పరిస్థితిలో రక్త పరీక్షలు అబ్ నార్మల్ గా ఉంటాయి. కానీ ఈ అబ్ నార్మల్ పరీక్షలు కచ్చితంగా డయాబెటిస్ వచ్చినప్పుడు లాగా ఉండవు. ఈ కారణంగానే ఈ పరిస్థితిని ప్రీ డయాబెటిస్ అంటారు. దీనికి సంబంధించి ప్రధానంగా 3 రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తారు. వీటిలో మొదటిది Hb A1 C పరీక్ష. దీని వల్ల మన రక్తంలో చక్కెర స్థాయి ఎంత ఉందో తెలుస్తుంది. ముఖ్యంగా ఆరువారాల వ్యవధిలో, ఏయే సమయాల్లో మన రక్తంలో ఎంత షుగర్ ఉందో తెలియడం వల్ల ప్రీ డయాబెటిస్ స్థాయిని సులభంగా గ్రహించవచ్చు. ఇక రెండో పరీక్ష FPG. అంటే ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ పరీక్ష. ఈ పరీక్ష చేయించుకునే వ్యక్తి క్రితం రాత్రి నుంచి అంటే పరీక్షకు కనీసం ఎని మిది గంటల ముందు ఏ విధమైన ఆహారానని తీసుకుని ఉండకూడదు. దీని వల్ల ప్లాస్మాలో గ్లూకోజ్ ఏ స్థాయిలో ఉందనే విషయం తెలుస్తుంది. ఇక మూడో పరీక్ష O G T T. సాధారణంగా ఈ పరీక్షను రెండో పరీక్షతో పాటే జరుపుతుంది. ముందుగా FPG పరీక్ష జరిపిన తర్వాత 75 గ్రాముల చక్కెర ఉన్న ద్రావణాన్ని తాగిన 30 నిముషాలు, 60 నిముషాల తర్వాత రెండు సార్లుగా ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షల ద్వారా రక్తంలో షుగర్ స్థాయి ఎలా ఉంది, ప్రీ డయాబెటిస్ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనే విషయాలు తెలుస్తాయి.
సాధారణంగా 45 సంవత్సరాల వయసు దాటిన వారిలో ప్రీ డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆసియా వాసుల్లో కూడా ఈ సమస్య ఎక్కువే. కుటుంబంలో ఎవరైనా డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్న వారు ఉంటే, వారికి ఈ సమస్య వెన్నాడుతుందని గుర్తుంచుకోవాలి. అదే విధంగా ఎక్కువగా రక్తపోటుతో బాధపడే వారినీ ఈ సమస్య దరిచేరుతుంది.
గర్భంతో ఉన్నప్పుడు డయాబెటిస్ వచ్చిన స్త్రీలలోనూ ఈ సమస్య ఎక్కువే. ప్రీడయాబెటిస్ వచ్చిన వారిలో బాహ్య చర్మం పొరలు దళసరి అయ్యే లక్షణాలు కనపడతాయి. శరీర ప్రాంతాల్లో అక్కడక్కడా చర్మం ముడతలు పడడం, వింతగా ఉండడం, మందమైన నల్లని మచ్చలు శరీరం మీద వ్యాపిస్తాయి. ఎక్కువగా మోకాలు వెనుక, పిడికిలి, మోచేతుల లోపల, మెడ మీద ఈ సమస్య కనిపిస్తుంది. ఈ సమస్య మొదలయ్యాక భయపడకుండా ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా భవిష్యత్ లో షుగ్ వ్యాధి బారిన పడకుండా రక్షణ పొందవచ్చు. ఆహారం తర్వాత కీలకమైనది వ్యాయామం. సరైన వ్యాయామం లేకపోవడం వల్లే ఎక్కువ మంది షుగర్ వ్యాధి బారిన పడుతున్నారన్నది వైద్యుల మాట. అంతే కాకుండా… ఎండ తగలకుండా ఏసీ గదుల్లో ఉండడం, కాలు బయట పెట్టాలంటే వాహనాలు వాడడం లాంటివి ఈ వ్యాధిని పెంచి పోషించే అలవాట్లు. ఇలాంటి వాటన్నింటి నుంచి దూరంగా ఉండడం ద్వారా ప్రీడయాబెటిస్ అదుపులో పెట్టుకోవచ్చు.
నిజానికి ప్రీడయాబెటిస్ గంటలు మ్రోగి జాగ్రత్త పడమనే సూచనలు ఇవ్వడం కూడా ఒకందుకు మంచిదే. 6 గంటల కంటే తక్కువ నిద్రపోయే వ్యక్తుల్లో ఈ వ్యాధి అధికంగా కనిపిస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. నాడీవ్యవస్థ, నిద్ర బలహీన మధ్య హార్మోన్ల సంబంధాల ఫలితంగా కూడా ప్రీడయాబెటిస్ మొదలు కావచ్చు. ఈ సమస్య మొదలయ్యాక… డయాబెటిస్ వచ్చే ప్రమాదం కేవలం 40 శాతం మాత్రమే ఉంది. మంచి ఆహారం, వ్యాయామం, నిద్ర, భోజన వేళలు జాగ్రత్తగా పాటిస్తే… డయాబెటిస్ ప్రమాదం నుంచి బయటపడవచ్చు.