Health Benefits : నువ్వుల్లో దాగున్న ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

By manavaradhi.com

Published on:

Follow Us
Sesame Seeds

సాధారణంగా నువ్వులు భారతీయ వంటకాలలో అరుదుగా వినియోగిస్తుంటారు. ముఖ్యంగా పండుగల సమయంలో వీటి వాడకం ఎక్కువ. అయితే న‌ల్ల నువ్వుల వాడ‌కం మ‌న వ‌ద్ద చాలా త‌క్కువే. న‌ల్ల నువ్వుల్లో ఎన్నో గ్రేట్ రెమెడీస్ దాగున్నాయ‌ని, వీటి వాడ‌కం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని సెల‌విస్తున్నారు.

నువ్వులు.. మ‌నం నిత్యం వంట‌కాల్లో వినియోగించే వాటిలో ముఖ్య‌మైన‌ది. నువ్వులు.. తెలుపు, న‌లుపు, ఎరుపు రంగుల్లో ల‌భిస్తుంటాయి. నువ్వుల నుంచి తీసిన నూనెను వంట‌కాల్లో, ప‌చ్చ‌ళ్ల త‌యారీలో విరివిగా ఉప‌యోగిస్తుంటారు. శరీరానికి అవసరమైన, ఆరోగ్యాన్ని పెంపొంచే అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటాయి. అందుకే వీటిని ‘పవర్ హౌసెస్స పిలుస్తుంటారు. ఇవి మినరల్స్, కాల్షియం, జింక్, ఐరన్, థయామిన్, విటమిన్ ఈ లను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి మేలు చేసే చాలా రకాల మూలాకాలు వీటిలో ఉంటాయి.

నువ్వుల నూనెలో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. వీటితో తయారుచేసిన పదార్థాలు ఎక్కువకాలం నిల్వ ఉంటాయి. స్త్రీలలో హార్మోన్ల సమస్యకు నువ్వులు చక్కని పరిష్కారంగా చెప్తుంటారు స్త్రీ వైద్య‌నిపుణులు

నల్ల నువ్వుల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీహిస్టమైన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటి పెంచడంలో సహాపడుతాయి. ఆస్తమా, బ్రాంకైటీస్‌, జలుబు, దగ్గు వంటి అనరోగ్య సమస్యలను నివారించడంలో తోడ్ప‌డుతాయి. రోజూ తీసుకునే ఆహారంలో నువ్వులను చేర్చుకోవడం వల్ల బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ ను తగ్గిస్తుంది. దాంతో ప్యాంక్రియాటిక్‌ పనితీరు మెరుగ్గా ఉంటుంద‌ని ప‌లు ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. నల్ల నువ్వుల్లో యాంటీ కాన్విల్సివ్‌ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల కొన్ని రకాల అనారోగ్యాలను నివారిస్తుంది.

నల్ల నువ్వుల్లో ఉండే ఔషధ గుణాల వల్ల బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ట్యూమర్ ఏర్పడకుండా నివారించవచ్చు అంటున్నారు పరిశోధకులు. నల్ల నువ్వుల్లో ఉండే ఆప్టోప్టోసిన్‌ సెల్స్‌ లుకేమియాకు గురికాకుండా నివారిస్తుంది. జాయింట్‌ పెయిన్స్ నివార‌ణ‌లో నువ్వుల నూనె బాగా సహాయపడుతుంది. ఆర్థరైటిస్‌ తో బాధపడేవారు ఉప‌యోగిస్తే మంచి ఫ‌లితం ఉంటుంది. నల్ల నువ్వులు తలనొప్పిని నివారించడంలో గొప్పగా పనిచేస్తుంది.

న‌ల్లనువ్వుల్లో ఉండే పోష‌కాలు వృద్దాప్యంలో వ‌చ్చే అనేక ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను అడ్డుకోవ‌డంలో న‌ల్లనువ్వులు గొప్ప‌గా ప‌నిచేస్తాయ‌ని హార్వ‌ర్డ్ విశ్వ‌విద్యాల‌యం ప‌రిశోధ‌కులు తేల్చారు. విట‌మిన్ బీ కార‌ణంగా జుట్టు ఊడిపోవ‌డం, చిన్న‌త‌నంలోనే జుట్టు తెల్ల‌బ‌డ‌టం, జ్ఞాప‌క‌శ‌క్తిని పెంపొందించే విట‌మిన్లు న‌ల్ల నువ్వుల్లో పుష్క‌లంగా ఉంటాయి. దీనిలోని విట‌మిన్ ఈ చ‌ర్మ ఆరోగ్యానికి దోహ‌ద‌ప‌డుతుంది. వీటిలో ఉండే పీచు, లిగ్మిన్స్ ఫైటోస్టెరాల్డ్ వంటివి పేగు క్యాన్స‌ర్ రాకుండా చూస్తాయ‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. వీటిలో ఉండే సిసేమియం అనే ప‌దార్థం కాలేయాన్ని సంర‌క్షించ‌డంలో గొప్ప‌గా ప‌నిచేస్తుంది.

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించ‌డంలో, వీటి నూనె పేగు త‌డిబారిపోకుండా చేయ‌డంలో, పేగుల్లోని నులిపురుగుల్ని బ‌య‌ట‌కు పంప‌డంలో గ్రేట్‌గా స‌హ‌క‌రిస్తాయి. వీటిలోని మెగ్నీషియం బీపీని త‌గ్గిస్తుంది. వీటిలో ఉండే అన్ శ్యాచురేటెడ్ కొవ్వులు కొలెస్ట‌రాల్ పెరుగ‌కుండా చూస్తాయి. మెనోపాజ్ స‌మ‌యంలో ఎముక‌ల సాంద్ర‌త త‌గ్గిపోయే స‌మ‌స్య‌ను వీటిని తీసుకోవ‌డం ద్వారా నివారించ‌వ‌చ్చు.

ప‌వ‌ర్ హౌసెస్‌గా పిలుచుకొనే నువ్వుల్లో న‌ల్ల నువ్వుల‌ను పండుగ‌లు, ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాల్లో వినియోగిస్తుంటారు. న‌ల్ల నువ్వుల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో మూల‌కాలు ఉంటాయ‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. అందుక‌ని న‌ల్ల నువ్వులు తినండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Leave a Comment