Health Tips: పెరుగుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

By manavaradhi.com

Published on:

Follow Us
Health Benefits Of Curd

చాలా మందికి పెరుగన్నం తినకపోతే భోజనం చేసినట్లే అనిపించదు. రోజుకి రెండుసార్లయినా పెరుగు తినాల్సిందే అంటున్నారు పోషకాహార నిపుణులు. మనం తీసుకునే ఆహారంలో పెరుగు దివ్యౌషధంలా పనిచేస్తుంది. బరువు తగ్గాలనో, నిద్ర వస్తుందనో ఇటీవ‌లికాలంలో చాలామంది పెరుగు తిన‌డం మానేస్తున్నారు. ఆవుపాలతో చేసే పెరుగుకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. అయితే గేదే పాలతో చేసిన పెరుగు కూడా ఆరోగ్యమే అంటున్నారు వైద్యులు. ఈ పెరుగుకు కొన్ని రకాల ఫ్లెవర్స్ కలిపి చేసే పెరుగును యోగర్ట్ పేరుతో పిలుస్తున్నారు. ఈ పెరుగుతో రకరకాల పళ్లను కలిపి తీసుకుంటే శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అనేక ఇన్ ఫెక్షన్లను నివారిస్తుంది. పెరుగు తినడం వలన జీర్ణ వ్యవస్థ చెక్కబడి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. రక్తపోటు వచ్చే అవకాశం లేకుండా చేస్తుంది.

యోగర్ట్ లో క్యాల్షియం ఎక్కువగా ఉండడం వలన ఎముకలు, దంతాల‌ను ధృడంగా చేస్తుంది. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉండడం వలన చర్మాన్ని మృదువుగా చేయడమే కాక, ముఖంపై పూతలా పేస్ ప్యాక్ చేసుకుంటే ముడతలు, మచ్చలను తగ్గిస్తుంది…అంతే కాకుండా చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. మెదడు చురుగ్గా పనిచేయడంలోనూ పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వేసవికాలంలో పెరుగు, మజ్జిగ తీసుకుంటే శరీరం వేసవి తాపానికి గురికాకుండా ఉంటుంది. పెరుగు నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల లాక్టోస్ అస‌హ‌నం, డ‌యోరియా, విరేచ‌నాలు, కోల‌న్ క్యాన్స‌ర్‌, ఇన్ఫ్ల‌మేట‌రీ బౌల్ డిసీజ్ వంటి స‌మ‌స్య‌లు రాకుండా కాపాడుతుంది. అల్సర్‌తో బాధపడేవారు పెరుగు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ప‌నిలో ఉన్న‌ప్పుడు కూడా తీసుకోవ‌డం వ‌ల్ల మరింత ఉత్తేజం పొందుతారు.

పెరుగులో ఉండే ప్రొబ‌యోటిక్ అంశాలు రోగ‌నిరోధ‌క‌శ‌క్తిని పెంపొందించ‌డంలో చాలా శ‌క్తివంతంగా ప‌నిచేస్తాయి. యోని ఇన్‌ఫెక్ష‌న్ల‌ను రాకుండా కాపాడుతుంది. ఆస్టియోపోరోసిస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌వారు పెరుగును నిత్యం తీసుకోవ‌డం వ‌లన మంచి ఫ‌లితం సాధించ‌వ‌చ్చు. పెరుగు నిత్యం తీసుకొనే వారిలో రక్తపోటు వచ్చే అవకాశం లేకుండా చేస్తుంది. పెరుగును ఏవిధంగానైనా తీసుకోవ‌చ్చు. పెరుగు తినేవారిలో క‌డుపు నిండిన భావన ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల మ‌ళ్లీ మ‌ళ్లీ తినాల‌ని అనిపించ‌దు. పెరుగును కొనే ముందు మీకు ఏది నప్పుతుందో తెలుస‌కుని మ‌రీ కొనాలి. ఫ్యాట్ త‌క్కువ‌గా ఉండేవాటినే ఎంచుకోవ‌డం ఉత్త‌మం. ఎంత‌మేర‌కు తీపి ఉండాలో కూడా కొనేముందు నిర్ణ‌యించుకోవాలి. యాక్టీవ్ క‌ల్చ‌ర్స్‌, ప్రొబ‌యోటిక్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. విట‌మిన్ డీ శాతం ఎంత ఉందో తెల్సుకోవాలి. ఉద‌యం వేళ అల్పాహారంతో క‌లిపి పెరుగు తీసుకోవ‌డం చాలా మంచిద‌ని పోష‌కాహార నిపుణులు సెల‌విస్తున్నారు.

Leave a Comment