వృద్ధాప్యం పైబడిన కొద్దీ .. మతిమరుపు సహజం. ఐతే ఈ లోగా రకరకాల అనారోగ్యాల కారణంగా వాడుతున్న మందులు .. త్వరగా ఈ వ్యాధి వచ్చేలా చేస్తున్నాయి. అంటే వివిధ అనారోగ్యాలకు తీసుకునే యాంటీకోలినెర్జిక్ మందుల ప్రభావంతో డెమెన్షియా లేదా అల్జీమర్స్ వ్యాధి వస్తోందన్నమాట. మతిమరుపు వ్యాధిపై ఈ మందుల ప్రభావం ఎంత ఉందో.. ఇప్పుడు తెలుసుందాం .
మధ్య వయసు దాటిన తర్వాత అనారోగ్యాలు ఒక్కొక్కటిగా చుట్టుముడుతూనే ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులు వస్తూ ఉంటాయి. రకరకాల వ్యాధులకు యాంటీకొలినెర్జిక్ మందులను వైద్యులు సూచిస్తారు. ఈ మందుల్లో బెనెడ్రిల్ నుంచి డయాఫెనీడ్రొమైన్, కొన్ని యాంటిసైకోటిక్స్, పార్కిన్సన్ మందుల వరకు ప్రతిదీ ఉన్నాయి. ఈ మందులు డిప్రెషన్, క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మినరీ డిసీస్ COPD , చురుగ్గా ఉంటే మూత్రాశయం, అలర్జీలు, పేగుల్లో కనిపించే వ్యాధుల చికిత్సలో పనిచేస్తాయి. ఐతే ఈ మందులు దీర్ఘకాలికంగా వాడడం వల్ల మతిమరుపు వచ్చే అవకాశం ఉందని కొత్తగా చేసిన పరిశోధనల్లో వెల్లడైంది. యాంటీకొలినెర్జిక్ మందులు కండరాలను రిలాక్స్ చేసేందుకు ఉపయోగపడతాయి. నాడీ వ్యవస్థలో సందేశాలను ప్రసారం చేసే ఎసిటైల్కోలిన్ అనే రసాయనాన్ని నిరోధించడం ద్వారా పనిచేస్తాయి. ఐతే బ్రిటీష్ పరిశోధకులు యాంటీకొలినెర్జిక్ మందులపై అధ్యయనం చేసినప్పుడు రోగులు ఎవరైతే 55 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు మూడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ రోజులు రోజూ బలమైన యాంటికోలినెర్జిక్ ఔషధాలను తీసుకుంటున్నారో వారికి 50 శాతం మతిమరుపు వచ్చే ప్రమాదం ఉందని వెల్లడించారు.
ఈ మందులు.. స్వల్పకాలిక సైడ్ ఎఫెక్ట్ లు కలిగి ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు. అంటే ఈ మందులు వాడిన రోగుల్లో అతి కొద్ది కాలంలోనే తికమకగా ఉండడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. ముఖ్యంగా యాంటిడిప్రసెంట్స్, మూత్రాశయ యాంటీముస్కారినిక్ మందులు, పార్కిన్సన్ వ్యతిరేక మందులు మూర్చ వ్యాధికి వాడే ఔషధాలతో ఈ అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించారు. మరోవైపు చాలామంది నిద్ర కోసం యాంటీకొలినెర్జిక్ మందులపై ఆధారపడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు.
మందుల దుకాణాలకు నేరుగా వెళ్లి ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు కొనుగోలు చేస్తున్నందువల్ల ఇలా దీర్ఘకాలికంగా ఈ మందులు వాడడం వల్ల ప్రమాదం పొంచి ఉందనేది గుర్తించడం లేదంటున్నారు. నిద్ర కోసం ఇతరత్రా మార్గాలను ఆశ్రయించాలి కానీ .. మందులపై ఆధారపడవద్దని సూచిస్తున్నారు. రోజులో కనీసం 8 గంటలు శ్రమించడం .. ఉదయం, సాయంత్రం తేలికపాటి వ్యాయామాలు చేయడం .,. ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా రాత్రి పూట నిద్ర వస్తుందని చెబుతున్నారు.
యాంటీకొలినెర్జిక్ మందుల వల్ల వచ్చే సైడ్ ఎడ్ ఎఫెక్ట్ లు స్వల్పకాలంలోనే ప్రభావం చూపిస్తాయి. ఈ మందులను మందుల షాపులో నేరుగా కొనుగోలు చేసి ఉపయోగించవద్దు. వైద్యుల సూచన మేరకు మాత్రమే తగిన మోతాదులో వాడుకోవాలి. దీర్ఘకాలికంగా వాడాల్సి వచ్చినప్పుడు మెమొరీ లాస్ కు సంబంధించిన విషయాలను వైద్యులతో తప్పనిసరిగా చర్చించాలి.