వయసు పెరుగుతున్నకొద్దీ నిద్రలేమి కూడా పెరుగుతుంది. రకరకాల అనారోగ్య సమస్యలతోపాటు .. మానసిక ఒత్తిడులు దీనికి కారణమవుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే వయసులో ఉన్న వారి కంటే వృద్ధులు ఎక్కువగా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
నిద్ర అందరికీ చాలా అవసరం. దీనికి వయసుతో పెద్దగా తేడా ఏమీ ఉండదు. ఏ వయసు వారికైనా కనీసం రాత్రిపూట 6 నుంచి 7 గంటలు నిద్ర ఉండాలి. అలా విశ్రాంతి తీసుకుంటేనే శరీరానికి నూతనోత్సాహం వస్తుంది. కానీ వయసు పెబడుతున్న కొద్దీ పెద్ద వారిలో నిద్రలేమి సమస్య ఉత్పన్నమవుతుంది. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. వయసు పెరుగుతున్నకొద్దీ నిద్ర విషయంలో తేడాలు వస్తాయి. వృద్ధాప్యంలో అంటే దాదాపు 60 నుంచి వయసు పెరిగిన వారిలో చాలా మార్పులే చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా పెద్ద వారు రాత్రి త్వరగా పడుకోవడం, ఉదయాన్నే సూర్యుడి కంటే ముందుగానే మేల్కొనడం జరుగుతుంది. యవతతో పోలిస్తే వారికి గాఢ నిద్ర చాలా కష్టమైన విషయంగా ఉంటుంది. అలాగే రోజంతా తరచుగా పడుకోవడం, నిద్ర లేవడం అనేది వారి దినచర్యలో భాగంగా ఉంటుంది.
నిద్రలేమి సమస్య వృద్ధులలో పెరుగుతోంది. వివిధ రకాల అనారోగ్యాల కోసం వారు వేసుకునే మందులు ఇందుకు కారణమవుతున్నాయి. చాలా వరకు మందుల్లో నిద్ర కలిగించే ఔషధాలు కలిపి ఉంటాయి. కానీ క్రమంగా మందులు వేసుకోవడం వల్ల ఇది అలవాటైపోయి.. సమయానికి నిద్ర పట్టకుండా తయారవుతుంది. దీంతో నిద్ర కోసం మళ్లీ నిద్ర మాత్రలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితి ఎదురైన వారు .. దీనిపై వైద్యులతో తప్పనిసరిగా చర్చించాలి. రాత్రి పడుకునే ముందు మద్యం తీసుకోవడం కూడా నిద్రలేమికి దారి తీస్తుంది. అలాగే మధ్యాహ్నం పూట ఎక్కువ పడుకోవడం.. కూడా నిద్రలేమికి కారణమవుతోంది. దీంతో చాలా మంది నిద్ర పట్టడం లేదని పడకపైనే అటూ ఇటూ దొళ్లుతుంటారు. ఇది మరింత డిప్రెషన్ కు గురి చేస్తుంది.

వృద్ధులలో మానసిక ఒత్తిడి కాస్త ఎక్కువే . ఎవరైనా కుటుంబ సభ్యులను కోల్పోయినా వారు బయటపడేందుకు చాలా కాలం పడుతుంది. మానసిక సంఘర్షణ కారణంగా వారు నిద్రకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి వారిని తప్పనిసరిగా మానసిక వైద్య నిపుణులకు లేదా కౌన్సిలర్లకు చూపించడం చాలా అవసరం. వృద్ధుల్లో నిద్రలేమి తోపాటు ఆప్నియా , రెస్ట్ లె్స్ లెగ్స్ సిండ్రోమ్ లాంటి సమస్యలు కూడా ఉంటాయి. వీటితోపాటు శరీరంలో రకరకాల నొప్పుల వేదన కారణంగా వారు సరిగ్గా నిద్రపోలేకపోవచ్చు. రకరకాల వ్యాధులు.. వాటికి వాడే మందులే కాదు .. పెద్దవారిలో చాలా సమస్యలు నిద్రలేమికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా హార్మోన్లలో కలిగే మార్పులు కూడా వారిలో నిద్రలేమి సమస్యను తెచ్చిపెడుతోంది. కాబట్టి జీవనశైలిలో మార్పులు చేసుకుంటే మలి వయసును హాయిగా గడపవచ్చు.
రకరకాల వ్యాధులు.. వాటికి వాడే మందులే కాదు .. పెద్ద వారిలో చాలా సమస్యలు నిద్రలేమికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా హార్మోన్లలో కలిగే మార్పులు కూడా వారిలో నిద్రలేమి సమస్యను తెచ్చిపెడుతోంది. కాబట్టి .. వృద్దులు ఈ నిద్రలేమి సమస్యను అధిగమించేందుకు రోజూ ఉదయం లేదా సాయంత్రం కాసేపైనా నడవడం చాలా మంచిది . దీంతోపాటు తేలికపాటి వ్యాయామాలు చేస్తే .. ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. నిద్రలేమి సమస్యను ఎప్పటికప్పుడు వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి. వారు ఇచ్చే సలహాలు సూచనలు పాటించాలి.