సాధారణంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కొంతమంది శరీరంలో రకరకాల మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా రాత్రివేళ చెమటలు వీరిలో మరీ ఎక్కువగా వస్తుంటాయి. ఈ సమస్య తరచూ ఇబ్బందిపెడుతుంటే నిద్రపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. దీంతో అనేక కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది.
రాత్రివేళ చెమటలు రావడానికి అనేక కారణాలున్నాయి. కొన్నిసార్లు ఈవిధంగా వచ్చే చెమతల వల్ల వేసుకున్న బట్టలు, పడుకున్న బెడ్ కూడా తడిసిపోతుంది. ఇలా వచ్చే చెమతలను తేలికగా తీసేయవద్దు. మహిళల్లో మెనోపాజ్ దశలో కూడా చెమటలు విపరీతంగా వస్తాయి. ఆస్టియోపోరోసిస్, హార్ట్ వాల్వ్స్ వాపుకు గురైనపుడు, గడ్డలకు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు, హెచ్ఐవి సోకినవారికి కూడా రాత్రివేళ అధిక చెమటలు పోస్తాయి.
క్యాన్సర్ ప్రారంభ దశ లక్షణాలలో ఈ చెమటలను కూడా ఒకటిగా చెప్పవచ్చు. ఇంకా కొన్ని రకాల యాంటీ డిప్రజెంట్స్ మందులను తీసుకోవడం వల్ల కూడా ఈ చెమటలు ఎక్కువగా పోస్తాయి. వీటిని తీసుకునే వారిలో 8% నుండి 22% వరకు రాత్రి చెమటలతో బాధపడుతుంటారు. ఈ మందులు వాడేవారిలో రక్తంలో చక్కెర ఎక్కువగా ఉండటం వలన కూడా రాత్రివేళ చెమటలు వస్తుంటాయి. నార్మల్ ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉన్నప్పుడు వర్కౌట్స్ ఎక్కువగా చేయడం వల్ల రాత్రుల్లో చెమటలు పడుతాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
రాత్రివేళ చెమటల వల్ల ఆందోళన చెందాల్సిన పనిలేదు. కానే కొన్ని సందర్భాల్లో మన శరీరంలో అంతర్లీనంగా ఉండే వ్యాధులను అవి సూచిస్తుంటాయి. అందుకే రాత్రివేళ అధిక చెమటలు వస్తుంటే వైద్యున్ని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి. కెఫిన్, ఆలహాల్, పొగాకు ఎక్కువగా తీసుకునేవారిలో కూడా రాత్రివేళ చెమటలు వస్తుంటాయి. తరచుగా దగ్గు, అధిక జ్వరం, అధిక బరువు లాంటివి కనిపిస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.. రాత్రివేళ చెమటల వల్ల నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి సమయంలో పడక గదిని సౌకర్యవంతమైన ఉష్ణోగ్రతల వద్ద ఉంచినట్లైతే రాత్రివేళ ఆ గది చల్లగా ఉంటుంది. వీలైంత వరకు మంచం మీద దుప్పట్లను తీసివేసి తేలికైన వస్త్రాలను ధరించడం వల్ల పడక గదిలో కిటికీలు తెరిచిపెట్టడం వల్ల రాత్రివేళ చెమటలతో బాధపడుతున్నవారికి ఉపశమనం లభిస్తుంది.
మన శరీరంలో చెమటలు పట్టడం సాధారణం. కానీ ఇలా నైట్ స్వెట్ కు లింపోమా సంకేతం కావచ్చు. క్యాన్సర్ కణుతులు లిప్స్ సెల్స్ లో డెవలప్ కావచ్చు. చాలా మంది లింపోమా పేషంట్స్ లో రాత్రుల్లో చెమటలు అధికంగా పడుతున్నట్లు గుర్తించారు. వీరిలో ఒకేసారిగా బరువు తగ్గడం లేదా ఫీవర్ వంటి లక్షణాలు కూడా కనబడతాయి. ముఖ్యంగా ఈ సమస్యతో బాధపడుతున్నవారు రాత్రివేళ వ్యాయామం చేయకూడదు. కారంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవద్దు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలను తీసుకోవడం వల్ల సాధారణంగా రాత్రివేళ వచ్చే చెమటలను నివారించవచ్చు. అలాకాకుండా శరీరంలో ఉన్న ఇతర వ్యాధుల వలన ఈ రాత్రి చెమటలు వస్తుంటే వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకుంటే సమస్యను అధికం కాకుండా జాగ్రత్తపడవచ్చు.








