అన్ని సీజన్లలో దొరికే పండ్లలో అరటిపండు ముఖ్యమైనది. దీన్ని అన్ని వయసులవారు ఎంతో ఇష్టంగా తింటుంటారు. పోషకాలు మెండుగా ఉండే ఈ అరటి పండు వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి అంటున్నారు వైద్య నిపుణులు. రోజుకో అరటిపండును తీసుకోవడం ద్వారా లివర్‌ను శుభ్రం చేసుకోవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. ఈ అరటి పండు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో మేలుచేస్తుందని చెబుతున్నారు.
మనం నిత్యం ఎన్నోరకాల పండ్లను తింటుంటాం. కొన్ని పండ్లు ఆయా సీజన్లలోనే దొరుకుతాయి. అయితే అన్ని సీజన్లలో దొరికేపండు అరటిపండు ఒక్కటే. అందరికి అందుబాటు ధరలో ఉండటమే కాకుండా చిన్నవారి నుండి పెద్ద వారికి నచ్చిన పండు. అరటిపండు సులువుగా జీర్ణమవుతుంది. అరటిపండు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతే మేలు చేలు చేస్తుందని పోషకాహార నిపుణులు సెలవిస్తున్నారు. అరటిపండులో సహజసిద్దమైన చక్కెరలు, పీచుపదార్ధాలు సమృద్దిగా వుంటాయి. అరటిపండులో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉండటం వలన మనకు రోజంతా ఎనర్జీని ఇస్తుంది. ప్రతిరోజు అరటిపండు తినడం వల్ల ఇందులో ఉండే ఐరన్, హిమోగ్లోబిన్‌ని ఎక్కువ చేసి అనీమియా వ్యాధిని రాకుండా చేస్తుంది.
అరటిపండు తక్షణ శక్తిని అందించటమే కాకుండా, శక్తి స్థాయిలను గణనీయంగా పెంచుతుంది. రోజూ మూడుపూటల అరటిపండ్లు తింటే గుండె సంబంధింత వ్యాధుల బారిన అస్సలు పడరు. అరటి పండ్లు రోజూ తింటే ఎముకలు గట్టిగా మారుతాయి. అరటి పండ్లలోని సెరటోనిన్ మన మెదడు బాగా పని చేసేలా చేస్తుంది. రోజూ అరటిపండ్లు తింటే మానసికంగా కూడా బలంగా ఉండగలుగుతారు. జ్ఞాపకశక్తి పెరిగేందుకు అరటిపండ్లు బాగా ఉపయోగపడతాయి. ఒత్తిడికి లోనైనవారు ఈ ఫలం తీసుకుంటె ఒత్తిడి తగ్గి మనస్సు ప్రశాంతత పొందుతారు. వీటిలో లభించే బీ 6 విటమిన్ రక్తంలోని చక్కర మోతాదునను నియంత్రిస్తుంది. రక్తంలోని ఎర్రకణాలను వృద్దిచేసుంది. వీటిలో లభించే అధికశాతం పొటాషియం వలన రక్తపుపోటుని అదుపులోవుంచి పక్షవాతం రాకుండా ఆపుంది. వీటిలో ఉండే అధిక పీచుపదార్ధం మలబద్దకం సమస్యను నివారిస్తంది.
మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నవారు అరటిపండు తినడం వల్ల శరీరానికి పొటాషియం అంది ప్రమాదకరంగా తయారుచేస్తున్నందున వాటిని దూరం పెట్టాలి. ఉదయం వేళ అల్పాహారంగా, మద్యాహ్న భోజనం తరువాత అరటిపండును పిల్లలకు ఇవ్వడం మంచిది. అరటిపండు గుజ్జులో కొద్దిగా తేనె కలిపి రాసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. అరటిపండు గుజ్జుతో పెరుగుని కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత చన్నీళ్ళతో శుభ్రం చేసుకుంటే జుట్టు రాలే సమస్య నుండి విముక్తి కలుగుతుంది. వీటిలోని విటమిన్స్ కంటిచూపునకు చక్కగా పనిచేస్తాయి. ఆపిల్ పండుతో పోలిస్తే నాలుగురెట్లు అధికంగా మాంసకృత్తులు, రెట్టింపు పిండిపదార్ధాలు, మూడురెట్లు సల్ఫర్, ఐదురెట్లు అధికంగా విటమిన్ ఏ మన శరీరానికి లభిస్తుంది.
అరటిపండులో దాగున్న పోషక విలువల గురుంచి తెలుసుకున్నారు కదూ. ఇతర అనారోగ్య సమస్యలున్నవారు మాత్రం ఈ అరటి పండును వైద్యుల సూచనల మేరకు మాత్రమే తీసుకోవాలి. సొ.. ఇకనుంచి ఈ అరటిపండును మీ రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోండి.







