Night Sweats : రాత్రుల్లో చెమటలు తరచూ పడుతుంటే ఈ అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నట్లు..!

By manavaradhi.com

Published on:

Follow Us
  • ప్రతి ఒక్కరి శరీరంలో స్వేదగ్రంధులు ఉంటాయి. వీటి ద్వారా ప్రతి ఒక్కరిలో చెమటలు పట్టడం సహాజం. అయితే ఒక్కొక్కరిలో ఒక్కోవిధంగా ఉంటుంది. అందరిలో ఒక విధంగా చెమటలు పట్టవు. పగట పూట ఉష్ణోగ్రతలో కారణంగా చెమటలు పట్టడం సహజం. అయితే రాత్రి పూట ఎలాంటి శ్రమ లేకండా చెమటలు పడితే అనారోగ్య సమస్యలను సూచిస్తుంది. కొన్ని సందర్బాల్లో రాత్రుల్లో చెమటలు పట్టినా, ముఖంలో ఫ్రెష్ లుక్ కనిపిస్తుంది.
  • కొంత మందిలో చెడు కలలు వస్తున్నా రాత్రుల్లో చెమటలు అధికంగా పడుతుంటాయి. రాత్రుల్లో చెమటలు ఎక్కువగా పడుతుంటే అందుకు వివిధ రకాల కారణాలుంటాయి.
  • నైట్ స్వెట్ ను తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు. ఇది ఏదో ఒక అనారోగ్యానికి చిహ్నంగా గుర్తించాలి. నైట్ స్వెట్ కు మరో పేరు హైపర్ హైడ్రోసిస్. నిద్రించేటప్పుడు ఎక్కువ చెమటలు పట్టడం. మద్యరాత్రిలో చెమటలతో నిద్రలేవడం వల్ల హాపీ ఫీలింగ్ ఉండదు మరియు చికాకు కలిగిస్తూ…అసౌకర్యానికి గురిచేస్తుంది. నైట్ స్వెట్ చాల మందిలో చూస్తుంటాము.
  • మద్యరాత్రిలో చెమటతో తడిచిన జుట్టు, బెడ్ షీట్స్ తేమగా ఉండటం గమనిస్తుంటారు. ఇలా ఏకారణం లేకుండా రాత్రి చెమటలు పడితే తప్పని సరిగా వైద్యుని సంప్రదించాలి.

రాత్రుల్లో చెమటలు తరచూ పడుతుంటే అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నట్లు గుర్తించాలి. చెమటలు అధికంగా ఉన్నట్లై వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. శరీరంలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది. ఉదాహరణకు లంగ్ ఇన్ఫెక్షన్ లేదా మలేరియా వంటి ఇన్ఫెక్షన్స్ తో శరీరం పోరాడే సమయంలో శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. మోనోపాజ్ మహిళల్లో మోనోపాజ్ దశలో వేడి వల్ల చెమటలు అధికంగా పడుతాయి. మోనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో రాత్రుల్లో చెమటలు అధికంగా పడుతాయి. 70 శాతం కంటె ఎక్కువగా మోనోపాజ్ మహిళల్లో చెమటలు అధికంగా పడుతాయి. క్యాన్సర్ లివర్ లేదా బోన్ క్యాన్సర్ కు ప్రారంభ సంకేతం. రాత్రుల్లో చెమటలు పట్టడానికి ముఖ్యమైన కారణం లింపోమా.. ఇంకా లుకేమియా కూడా నైట్ స్వెట్ కు కారణమవుతుంది. అదే విధంగా చెమటలు కార్సినాయిడ్ ట్యూమర్స్, అడ్రినల్ ట్యూమర్స్ కు కారణమవుతుంది. మన శరీరంలో చెమటలు పట్టడం సాధారణం. కానీ ఇలా నైట్ స్వెట్ కు లింపోమా సంకేతం కావచ్చు. క్యాన్సర్ కణుతులు లిప్స్ సెల్స్ లో డెవలప్ కావచ్చు. చాలా మంది లింపోమా పేషంట్స్ లో రాత్రుల్లో చెమటలు అధికంగా పడుతున్నట్లు గుర్తించారు. వీరిలో ఒకేసారిగా బరువు తగ్గడం లేదా ఫీవర్ వంటి లక్షణాలు కూడా కనబడతాయి.

  • మనం చేసే వ్యాయామాలు కూడా రాత్రివేళ చెమటలు పట్టడానికి కారణాలు కావచ్చు. నార్మల్ ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉన్నప్పుడు వర్కౌట్స్ ఎక్కువగా చేయడం వల్ల రాత్రుల్లో చెమటలు పడుతాయి. ఇది ఓవర్ ట్రైనింగ్ కు సంకేతంగా చెప్పవచ్చు.
  • హార్మోన్ డిజార్డర్ కారణంగా కూడా చెమటలు అధికంగా పడుతాయి. ట్యూమర్స్ కు కారణమయ్యే హార్మోన్స్ అధికంగా ఉత్పత్తి చేస్తాయి . ఈ హాట్ ఫ్లాషెస్ వల్ల ఈస్ట్రోజెన్ లెవల్స్ పెరుగుతాయి. అలాగే మహిళల్లో హైపోథాలమస్ ఎఫెక్ట్ కూడా అధికంగా ఉంటుంది. హైపోథాలమస్ బ్రెయిన్ కు సంబంధించినది. ఇది ఆకలి, నిద్ర, శరీర ఉష్ణోగ్రతలు హార్మోన్స్ ను ప్రభావితం చేస్తుంది.
  • కొన్ని సందర్భాల్లో నార్మల్ ఈస్ట్రోజెన్ లెవల్స్ నేచురల్ గా తగ్గిస్తుంది. హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ కు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల 10 సంవత్సరాల తర్వాత ఎయిడ్స్ ను సూచిస్తుంది. ఎయిడ్స్ కు గురైన వ్యక్తిలో వ్యాధినిరోధక శక్తి పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. హెచ్ఐవి లో రాత్రుల్లో చెమటలు పట్టడం, డయోరియా, స్కిన్ రాషెస్, అలసట, నాలుక రుచి కోల్పోవడం వంటి లక్షణాలను సూచిస్తుంది.
  • కాబట్టి రాత్రివేళ చెమటలు పడుతుంటే అశ్రద్థ చేయకుండా వెంటే డాక్టర్ ను సంప్రందించి దానికి గల కారణాలను కనుక్కోవాలి. చిన్న సమస్యగా చూసి దాని అలా వదిలేస్తే భవిష్యత్తులో తీవ్రమైన జబ్బుల భారిపడకతప్పుదు. ఈ విధంగా మీరుకూడా నైట్ స్వెట్ తో భాదపడుతుంటే ఏమాత్రం అశ్రద్ధ చెయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. చెమటలు పట్టడమే కదా… అని ఏమాత్రం అశ్రద్ధ చెయకండి.

Leave a Comment