Mahesh Babu-Gautham: సూప‌ర్ స్టార్ మహేశ్‌బాబు తనయుడు గౌతమ్ యాక్టింగ్ చూశారా?

By manavaradhi.com

Published on:

Follow Us
Mahesh Babu's son Gautam performs mime at New York college

సూప‌ర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh babu) తనయుడు గౌతమ్‌ (Gautham Ghattamaneni)ఇప్ప‌టికే గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశాడు. గ‌త కొంత‌కాలంగా అమెరికాలో ఉంటూ.. యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్న విషయం తెలిసిందే. తన యాక్టింగ్‌ స్కిల్స్‌ను బయటపెడుతూ ఇటీవల అతడు ఒక స్కిట్‌లో పాల్గొన్నాడు.

సూప‌ర్ స్టార్ మహేశ్‌బాబు తనయుడు గౌతమ్‌ ప్పటికే గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు.అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలో నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఇందులోభాగంగానే తనలోని యాక్టింగ్‌ స్కిల్స్‌ను బయటపెడుతూ ఇటీవల అతడు ఒక స్కిట్‌లో పాల్గొన్నాడు. తోటి విద్యార్థితో కలిసి అతడు చేసిన ఈ స్కిట్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో ఆరంభంలో చిరునవ్వుతో ప్రశాంతంగా కనిపించిన గౌతమ్‌.. కొద్ది క్షణాల్లోనే ఆగ్రహావేశాలకు లోనై సంభాషణలు చెబుతూ కనిపించారు. దీనిని చూసిన నెటిజన్లు గౌతమ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గౌతమ్‌ యాక్టింగ్‌ భలే చేస్తున్నాడంటూ మెచ్చుకుంటున్నారు.

గౌతమ్‌ తన తండ్రి బాటలోనే నటుడిగా రాణించాలని ఆశిస్తున్నాడు. ఇందులోభాగంగానే యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. కొంతకాలం క్రితం లండన్‌లో తొలి స్టేజ్‌ ప్రదర్శన ఇచ్చాడు. గౌతమ్‌ బాల నటుడిగా తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. మహేశ్‌ హీరోగా తెరకెక్కిన ‘1 నేన్కొక్కడినే’ (1 Nenokkadine) లో కనిపించి అలరించాడు. మరోవైపు, మహేశ్‌ కుమార్తె సితార సైతం వరుస వాణిజ్య ప్రకటనలు చేస్తోంది. ఇప్పటికే నగల దుకాణానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించిన తను.. తండ్రితో కలిసి తాజాగా దుస్తుల బ్రాండ్‌ ప్రకటనలో యాక్ట్‌ చేసింది.

ఇక వీడియో చూసిన ఘ‌ట్ట‌మ‌నేని అభిమానులు గౌత‌మ్ న‌ట‌న‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. భ‌లే యాక్టింగ్ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. ఇంకెందుకు ఆల‌స్యం మీరు కూడా మ‌హేశ్ వార‌సుడి యాక్టింగ్‌పై ఓ లుక్కేయండి.

Leave a Comment