Weight loss: బరువు తగ్గేందుకు అద్భుతమైన డైట్ – 80/20 డైట్ రూల్ గురించి మీకు తెలుసా?

By manavaradhi.com

Published on:

Follow Us

మాంసకృత్తులు, పిండి పదార్థాలు, కొవ్వులు మనిషి శరీరానికి చాలా అవస రమైనవి. తినే ఆహారం ద్వారా సక్రమంగా అందాల్సినవి కూడా. వాటితో పాటు విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచుపదార్థం వంటివి తక్కువ మోతాదులోనైనా తప్పనిసరిగా అందాలి. లేనిపక్షంలో వాటి లోపం వల్ల కొన్ని అవయాల పనితీరు మందగించడం, దెబ్బతినడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

80/20 నియమం అంటే మీరు 80% సమయం ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలను తినాలి మరియు మిగిలిన 20% మీకు ఇష్టమైన ఆహార పదార్థాలను తినవచ్చు. ఈ నియమంలో ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాల్లో ప్రధానంగా పూర్తిగా, శుద్ధి చేయని లేదా కొద్దిగా శుధ్ది చేసిన ఆహార పదార్థాలు ఉంటాయి. వాటిలో కాయగూరలు, పండ్లు, తక్కువ ప్రోటీన్ మరియు శుద్ధి చేయని ధాన్యాలతోపాటు అధిక మోతాదులో నీరు ఉంటాయి. ఇటువంటి ఆహార పదార్థాల్లో పీచు మరియు నీరు పుష్కలంగా ఉంటాయి మరియు కెలోరీలు తక్కువగా ఉంటాయి. ఈ శాతం ఆహార పదార్థాల్లో చిరుతిళ్లు లేదా ‘ఇష్టమైన ఆహార పదార్థాలు’ ఉన్నప్పటికీ, మీరు రోజులో తినే మిగిలిన ఆహార పదార్థాలు కంటే వీటిని ఎక్కువ మోతాదులో తినకూడదు. ఉదాహరణకు, మీరు డిన్నర్‌కు ఒక పిజ్జా తినవచ్చు లేదా ఒక తీపి పదార్థం తినవచ్చు, కాని మీరు రెండింటినీ ఒకేరోజు తినకూడదు.

ఆరోగ్యవంతమైన జీవితం కోసం సంపూర్ణమైన ఆహారం చాలా అవసరం. మనం తినే పదార్ధాలతోనే మనకు పోషక విలువలు లభిస్తాయి. అవి మన శరీర పెరుగుదలకు, రక్షణకు, చురుకుదనానికి చాలా అవసరం. కొన్ని ఆహార పదార్థాలలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. కొన్నింటిలో తక్కువ పోషక విలువలు ఉంటాయి. అలాగని ఏ ఆహారాన్ని తీసి పారేయటానికి వీలులేదు. ఆహారంతో ఆరోగ్యంగా జీవించేందుకు ముదురు ఆకుపచ్చ, నారింజ రంగు కూరగాయలను తరచుగా తీసుకోవాలి. వీలైనంత ఎక్కువ‌గా సీజ‌న‌ల్‌ పండ్లను తిన‌డం చాలా మంచిది.

నిత్యం తీసుకునే ఆహారాల్లో క‌నీసం మూడు తృణ‌ధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో తిన‌కుండా ఎక్కువ సార్లు త‌క్కువ మొత్తంలో తిన‌డం అల‌వాటుచేసుకోవాలి. వీలైనంత వ‌ర‌కు స్వీట్ల‌ను దూరంగా పెట్టాలి. అలాగే కెఫిన్ అధికంగా ఉండే ప‌దార్థాల‌ను తిన‌కూడ‌దు. ప్యాకెజ్డ్ ఫుడ్‌, యాడెడ్ షుగ‌ర్ డ్రింక్స్‌, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ప్రతిరోజూ ఒకే నిర్ణీత సమయానికి భోజనం చేయాలి. ఇలా చేస్తే మన శరీరంలో జీవక్రీయలన్ని సక్రమంగా జరుగుతాయి.

మనం తీసుకోనే ఆహారంలో ఖచ్చితంగా కోన్ని ఆహార నియమాలను పాటించాలి. తీపిపదార్థాలు, వేపుడు పదార్థాలు వీలయినంత వరకు తగ్గించుకోవాలి. దీనిద్వారా అసిడిటీకి దూరంగా ఉండవచ్చు. ఆహారంలో ఎక్కువగా సలాడ్స్ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల ఏదైనా జీర్ణంకాని పదార్థాలు మీ జీర్ణవ్యవస్థను ఇబ్బంది పెడుతుంటే ఈ సలాడ్స్ ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తాయి. కడుపు నింపుకోవడానికి కాకుండా శరీరానికి శక్తిని అందివ్వడానికి మనం ఆహారం తీసుకోవాలి. వాతావరణ, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆహారం తీసుకోవాలి. అలాగే వెన్న తీసిన పాలూ, పాల పదార్థాలూ.. చిరుధాన్యాలు తీసుకోవాలి. అప్పుడే శరీరానికి అవసరమైన పోషకాలన్నీ అందుతాయి.

చాలామంది ఖాళీ స‌మ‌యాల్లో టీవీ చూస్తున్న‌ప్పుడు క్రంచీ, క్రిస్పీ స్నాక్స్ తిన‌డం చాలా మందికి అల‌వాటు. ఆలు చిప్స్ ను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంటారు. అయితే వీటికి బ‌దులుగా పాప్‌కార్న్ చేర్చుకుంటే ఆరోగ్యంతోపాటు సంతృప్తిని పొందవ‌చ్చు. ఒక క‌ప్పు పాప్‌కార్న్‌లో 31 క్యాల‌రీలుంటాయి. కొవ్వు అస్స‌లు ఉండ‌దు.

ప్యాక్‌ చేసిన బయటి ఆహారాన్ని కొంటున్నప్పుడు తప్పనిసరిగా వెనక భాగంలో ఉండే వివరాలను చదవాలి. దానిలో ఉండే కెలోరీలు, కొవ్వు, ఉప్పు శాతం ఎంతున్నాయో చూసుకోవడం మంచిది. మనిషి తన అవసరాలకు అనుగుణంగా ఆహారం తీసుకోవాలి. ఆ ఆహారపదార్థాలు సరియైనపాళ్ళలో వుండాలి. అవి ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన శక్తినీ ఇవ్వగలిగి వుండాలి. ఇటు వంటి ఆహారాన్ని సమతుల్య ఆహారం అంటాం. ఆహారపదార్థాలు సరియైన పాళ్ళలో లేకపోయిన.. కొన్ని పదార్థాలు ఎక్కువైనా, తక్కువైనా అందులోని సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. అయితే మనం రోజూ తినే ఆహారాన్నే కొద్దిగా మార్పులు, చేర్పులతో సమతుల్యంగా మలచుకోవచ్చు.

Leave a Comment