చాలామంది ఆస్తమా, ఉబ్బసం, మొదలైన వ్యాధులతో బాధపడుతుంటారు ఇవి పెద్దవారితో పాటు చిన్నపిల్లలను కూడా వేధిస్తుంటాయి. ఇలాంటి వ్యాధులనుండి త్వరగా ఉపశమనాన్ని కలిగించడానికే నెబ్యులైజర్ అనే పరికరాన్ని వైద్యులు ఉపయోగిస్తారు.
నెబ్యులైజర్ ఇది ఒక ఔషధ సరఫరా పరికరం. దీనిని ఉపయోగించి ఔషదాన్ని, ఆవిరి రూపంలోకి మార్చి శ్వాస కోశ సంబంధమైన వ్యాధుల చికిత్సలలో ఉపయోగిస్తారు. అస్తమాతో బాధపడుతూ శ్వాస పీల్చూకోవడానికి కూడా కష్టంగా ఉన్న పెద్దవారికి చిన్నపిల్లలకి కూడా ఈ నైబ్యులైజర్ పరికరాలను వైద్యులు సూచిస్తారు ఇంకా క్లోమము శ్వాసనాళము పేగులలోని గ్రంథులలో చిక్కటి శ్లేష్మం పేరుకొని పోయి ఇబ్బంది పడే వారికి ఈ పరికరము ఎంతో ఉపయోగపడుతుంది కొన్ని సమయాలలో వ్యాధిని నివారించే క్రమంలో ఔషధాన్ని పెద్ద మోతాదులో ఉపయోగించాల్సి ఉంటుంది ఇలాంటి సమయంలో కూడా నేబ్యులైజర్ చికిత్స ఎంతో ఉపయోగపడుతుంది
శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇతర శ్వాసకోశ సంబంధ సమస్యలతో బాధపడుతున్నప్పుడు నెబ్యులైజర్స్ ఎంతో చక్కగా ఉపయోగపడతాయి. ఈ పరికరాన్ని ఉపయోగించి మందును పొగ రూపంలోకి మార్చుకొని పీల్చడం వలన కొంత ఉపశమనాన్ని పొందవచ్చు ఆస్తమా, న్యూమోనియా తీవ్రమైన అలెర్జీలు C O P D (క్రానిక్ అబ్స్ట్రాక్టివ్ పల్మనరీ డీసీజ్ ) ఉన్నవారికి డాక్టర్లు ఈ నెబ్యులైజర్స్ ని సిఫారసు చేస్తారు. ఇంకా శ్వాసలో గురకను నివారించడానికి, ధీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే వారికి నెబ్యులైజర్స్ సహాయంతో చికిత్సను అందిస్తారు
ఒకటి కంటే ఎక్కువ మందులను నెబ్యులైజర్స్ ను ఉపయోగించి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇలాంటి ట్రీట్మెంటును తీసుకోవాలనుకునేవారు ఖచ్చితంగా వైద్యుల సలహాను పాటించాలి. వైధ్యులు ఏ వ్యాధికి ఏ మందును సూచిస్తారో వాటిని మాత్రమే వాడాలి. నెబ్యులైజర్స్ ను వాడిన తర్వాత వాటిని క్లీన్ చేసి పెట్టాలి. లేకపోతే దానిలోనికి బాక్టీరియా చేరుతుంది. దీని వలన అనేక కొత్తవ్యాధులు వస్తాయి. చిన్న పిల్లలకు ఈ నెబ్యులైజర్ ట్రీట్ మెంట్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల సూచనల మేరకు వారికి ఈ ట్రీట్ మెంట్ ను ఇవ్వాలి.