బ్రెస్ట్ క్యాన్సర్.. నేడు స్త్రీలను భయపెడుతున్న క్యాన్సర్. ఈ క్యాన్సర్ ఉన్న వారు కచ్చితంగా డైట్ నియమాలు పాటించాల్సిందే. లేనిపక్షంలో స్థూలకాయం కారణంగా మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
రోజూ తీసుకునే ఆహారం బరువును ప్రభావితం చేస్తుంది. స్థూలకాయం కారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వారు మరింత ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే రొమ్ము క్యాన్సర్ ఉన్న వారు అదనంగా కొన్ని పౌండ్ల బరువు పెరిగే అవకాశం ఉంది. ఐతే ఇందుకోసం బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవారు తప్పనిసరిగా తమ డైట్ చార్ట్ ను పాటించాలి. దీని వల్ల జీవించే అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు. ఇందుకోసం కూరగాయలు, తృణధాన్యాలు, చికెన్, చేపలు అధికంగా ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు తినే వారు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చు. పండ్లు, కూరగాయలు తీసుకోవడం .. బరువును నియంత్రణలో ఉంచుకునే ఆహార సూత్రం . ఇది రొమ్ము క్యాన్సర్ రాకుండా తిరిగి రాకుండా ఉండడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అత్యంత దూకుడుగా ఉండే కణితుల నుండి రక్షించడానికి బరువు నియంత్రణలో ఉండడం సహాయపడుతుందని పరిశోధకులు అంటున్నారు.
తృణధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి. ప్రాసెస్ చేయని గోధుమలు, బియ్యం, ఓట్స్, మొక్కజొన్న, బార్లీని ఆహారంలో చేర్చుకుంటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ. ఈ ఆహారాలలో ఫైటోకెమికల్స్ గా పిలిచే పోషకాలు .. క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. ఇవి హృదయ సంబంధ వ్యాధుల నుంచి రక్షించడంలో కూడా సహాయపడతాయి . సోయా-ఆధారిత ఆహారాలు .. టోఫు, సోయా పాలు వంటివి – ఫైటోఈస్ట్రోజెన్ అనే రసాయనాలను కలిగి ఉంటాయి. ఇవి ఈస్ట్రోజెన్ మాదిరిగానే ఉంటాయి. ఈస్ట్రోజెన్ పెరగడానికి ఇంధనంగా ఉపయోగించే రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న మహిళలు.. దీని వల్ల ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. మరోవైపు సోయా సప్లిమెంట్స్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. శరీరంలో కొవ్వు స్థాయిని పెంచే పదార్థాలకు దూరంగా ఉండాలి. కొవ్వు .. కణతుల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. మాంసం, వెన్న, జున్ను, ఐస్ క్రీం, వేపుడు ఆహారాలు, స్మోక్ చేసిన ఆహారాలు శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి. శరీరానికి మంచి ప్రోటీన్ అందాలంటే … చేపలు , చికెన్ తీసుకోవచ్చు. మరోవైపు ఫైబర్ కూడా శరీరానికి చాలా అవసరం . ఇందుకోసం పండ్లు, కూరగాయలు చిక్కుళ్ళు పుష్కలంగా తింటే ఫైబర్ లభిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థలో బాగా ఉపయోగపడుతుంది. ఈ రకమైన ఆహారం రొమ్ము క్యాన్సర్ అవకాశాలను తగ్గిస్తుందని తెలుస్తోంది.
బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వారికి విటమిన్ D చాలా అవసరం . విటమిన్ డి లోపం కణితుల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి ఎక్కువగా లభించే ఆహారాలు సాల్మన్ చేపలు, గుల్లలు, హెర్రింగ్, మెకరెల్ , సార్దిన్ లను డైట్ చార్ట్ లో చేర్చుకుంటే మంచిది. రొమ్ము క్యాన్సర్ ఉన్న వారు .. కెరొటినాయిడ్స్ ఎక్కువగా ఉన్న కూరగాయలు తీసుకోవాలి. ఈ రకమైన కూరగాయల్లో ఫైటోకెమికల్ ఎంజైమ్… క్యాన్సర్ ను తగ్గిస్తుందని తెలుస్తోంది. కెరొటినాయిడ్స్ ఉన్న ఆహారాల కోసం నారింజ, పసుపు ముదురు ఆకుపచ్చ రంగు కూరగాయలను ఎంచుకోవచ్చు. క్యారెట్లు, గుమ్మడికాయలు, వింటర్ స్క్వాష్, బచ్చలికూర, కాలే, చిలగడదుంపలు తీసుకుంటే మంచిది. వీటితోపాటు వెల్లుల్లి, గ్రీన్ టీ, సోయాబీన్స్ అవిసె గింజలను ఆహారంలో చేర్చుకోవాలి.
బ్రెస్ట్ కేన్సర్ కు మందులు ఇప్పటికీ ప్రయోగ దశలోనే ఉన్నాయి. ఐతే కేన్సర్ ఉన్న వారు తమ మందులు యధావిధిగా వాడుకుంటూనే సమతుల ఆహారం తీసుకోవాలి. ఊబకాయం రాకుండా రోజూ తగినంత వ్యాయామం చేయాలి.