Dark Chocolates: డార్క్‌ చాకొలేట్స్‌ హెల్త్‌ సీక్రెట్స్‌

By manavaradhi.com

Published on:

Follow Us
Dark Chocolates

డార్క్ చాక్లెట్ గూర్చి మీరు ఎప్పుడైనా విన్నారా? డార్క్ చాక్లెట్ తింటే స్వర్గంలో విహరించినట్టు ఉంటుంది మనలో చాలామందికి. దేవుళ్ల ఆహారం చాక్లెట్ అని అంటుంటారు. ఈ చాక్లెట్లు ఎన్నో రకాలుగా మనకు లభ్యామవుతున్నాయి. చాక్లెట్ ను మొదటిసారిగా 1519లో గుర్తించినట్టు చారిత్రక ఆధారాలు లభించాయి. ఇవి కోకో బీన్స్ నుంచి తయారవుతాయి. 18 శతాబ్దంలో చాక్లెట్లో పాలు కల్సినట్టు చెబుతున్నారు. ఈ చాక్లెట్లు మీ ఆరోగ్యానికి ఎంతో మంచివి. అసలు చాక్లెట్ లు అంటే ఇష్టము లేని వారంటూ ఎవరూ ఉండరు. చిన్నారుల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టపడతారు. ఈ చాక్లెట్ లలో అధిక క్యాలరీలు ఉండటం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు వీటిని ఎక్కువగా తినకుండా జాగ్రత్తపడాలి. డార్క్ చాక్లెట్స్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి.

చాక్లెట్స్ ఒక రకమైన ఫ్లేవనాయిడ్స్ నుంచి వస్తాయి. అంటే అదో రకం ఫైటో కెమికల్ . ఇవి కోకో బీన్స్ నుంచి తయారవుతాయి. తర్వాత ఇందులో పాలు కలుస్తాయి. కోకో బీన్స్ ఉన్న చాక్లెట్లో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో డార్క్ చాక్లెట్ దోహదపడుతుంది. రక్తపోటును నియంత్రించడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. డార్క్ చాక్లెట్ చెడు కొవ్వును తగ్గించి మంచి కొవ్వును పెంచుతుంది. మెదడుకు రక్త ప్రసరణ అయ్యేలా చేస్తుంది. డయాబెటీస్ రిస్క్ నుంచి తప్పించడానికి దోహదపడుతుంది. అయితే లావుగా ఉన్నవారికి డార్క్ చాక్లెట్ అంత మంచిదికాదు. ఇందులో ఉండే చక్కెర, క్యాలరీలు లావుగా ఉన్నవారికి మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. కాబట్టి తక్కువ మోతాదులో డార్క్ చాక్లెట్ ను కొద్దికొద్దిగా తింటూ ఉండాలి. ఒక్క ఔన్స్ డార్క్ చాక్లెట్ తింటే ఒకేసారి 150 కాలరీలు శరీరంలో చేరతాయి.

మిల్క్ చాక్లెట్లలో 50శాతం కోకో బీన్స్ ఉంటాయి. డార్క్ చాక్లెట్స్ లో ఎక్కువ మొత్తంలో క్యాలరీలుంటాయి. కొవ్వుకూడా ఎక్కువగానే ఉంటుంది. సాచురేటెడ్ ఫాట్ కూడా అధికంగానే ఉంటుంది.డార్క్ చాక్లెట్లో చక్కెరశాతం ఎక్కువగా ఉంటుంది. చాక్లెట్ లిక్కర్, కోకోబట్టర్ ఎక్కువగానే ఉంటుంది. ఒక్కోసారి వెనీలా ఉంటుంది. చాక్లెట్లు తినటం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ చాక్లెట్లు మన మూడ్ ను మెరుగుపరుస్తాయి. కాబట్టి చాక్లెట్స్ ను మితంగా తినండి. మీ మూడ్ ని రెట్టింపు చేసుకోండి.

చమ్మని రుచి ఒక మధురానుభూతి. ఆ తియ్యదనాన్ని డార్క్ చాక్లెట్స్ మరింత రెట్టింపు చేస్తాయి. ఎంత ఒత్తిడి ఉన్నా సరే వీటిని తింటే ఐదు నిమిషాల్లో ఆ ఒత్తిడి దూరమవుతుంది.

Leave a Comment