మనం ఎల్లప్పుడు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎముకలు ఆరోగ్యంగా ఉండటం ఎంతో ముఖ్యం. మరి ఈ ఎముకలు దృఢంగా ఉండాలంటే క్యాల్షియం మరియు విటమిన్-డి అవసరం ఎంతో కీలకం. ఇవేకాకుండా మాంసకృత్తులు, పొటాషియం, మెగ్నీషియం, పాస్ఫరస్, విటమిన్-కె ఎముకలు పెళుసుబారకుండా ఉండటానికి దోహదపడతాయి.
మనం శారీరీకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎముకలు దృఢంగా ఉండడం చాలా అవసరం . ఎముకలు దృఢంగా ఉండాలంటే అందుకు కావాల్సిన సమతుల పోషకాలు తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ K ఇందుకు చాలా ఉపయోగపడుతుంది. విటమిన్ K వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. రక్తం గడ్డకట్టేందుకు సహాయపడడమే కాకుండా ఎముకలోని మజ్జ పెరిగేందుకు ఉపయోగపడుతుంది. ఫలితంగా ఎముకలు పెళుసుగా మారి వచ్చే వ్యాధి ఆస్టియో పోరోసిస్ ను అరికడుతుంది. గుండె సమస్యలను అడ్డుకుంటుంది. విటమిన్ K.. విటమిన్ D లభించే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే ఎముకలు దృఢంగా తయారవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఆకుపచ్చని కూరగాయలు, ఆకు కూరల్లో విటమిన్ K ఎక్కువగా లభిస్తుంది. ముఖ్యంగా పాలకూర, కాలే లాంటి కూరగాయలు తీసుకోవాలి. కాలేను విటమిన్ K కు పవర్ హౌజ్ గా భావించవచ్చు. రోస్టెడ్ బ్రస్సెల్స్, గ్రీన్ క్యాబేజీలు కూడా విటమిన్ K బూస్టర్లుగా చెప్పుకోవచ్చు..
గ్రీన్ ఆపిల్స్ నుంచి కూడా విటమిన్ K ఎక్కువగా లభిస్తుంది. అవకాడో పండ్లు తీసుకుంటే 50 మైక్రో గ్రాముల వరకు విటమిన్ K లభిస్తుంది. అందుకే ఈ రెండు పండ్లు .. వారంలో కనీసం మూడు రోజులైనా తీసుకోవాలని న్యూట్రీషియన్ లు చెబుతున్నారు. వీటితో పాటు బ్లూబెర్రీస్ , గ్రేప్స్ కూడా తీసుకుంటే మంచిది. విటమిన్ K ఎక్కువ లభించే నూనెలు సోయా బీన్, ఆవనూనె . ఒక టేబుల్ స్పూన్ సోయా బీన్ నూనెలో 25 మైక్రోగ్రాముల వరకు విటమిన్ K ఉంటుంది. అలాగే ఆవనూనె నుంచి 10 మైక్రో గ్రాముల వరకు విటమిన్ K లభిస్తుంది. ఇలాంటి నూనెలతోపాటు చేపలు కూడా ఆహారంలో చేర్చుకుంటే ఎముకలు దృఢంగా తయారవుతాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. చేపల్లో ఆరోగ్యకరమైన నూనెలతోపాటు ప్రొటీన్ , ఒమేగా ఫ్యాటీ 3 ఆమ్లాలు లభిస్తాయంటున్నారు.
సాల్మన్, ష్రింప్ లాంటి చేపలను ఒక ఔన్స్ తీసుకుంటే 37 మైక్రో గ్రాముల వరకు విటమిన్ K లభిస్తుందంటున్నారు. వీటితోపాటు ధాన్యాలు కూడా ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. వాటిలో ప్రొటీన్ , పీచుతోపాటు నూనెలు లభిస్తాయని చెబుతున్నారు. ఇవి శరీరంలో వాపులను నిరోధిస్తాయంటున్నారు. ఇందులో ముఖ్యంగా కాజు, బాదం ద్వారా విటమిన్ K ఎక్కువగా లభిస్తుందంటున్నారు. తాజా పండ్ల కంటే కేరట్ జ్యూస్ లాంటివి తీసుకుంటే శరీరానికి త్వరగా విటమిన్ కె లభిస్తుంది. ఒక్క కప్పు కేరట్ జ్యూస్ లో 28 మైక్రో గ్రాముల విటమిన్ కె లభిస్తుంది. అలాగే దానిమ్మ రసం తీసుకున్నా 19 మైక్రో గ్రాముల వరకు విటమిన్ కె లభిస్తుందని ఆహార నిపుణులు చెబుతున్నారు.
ఎల్లప్పుడూ మనం ఎముకలను దృఢంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే క్యాల్షియం, విటమిన్ డి వంటి ఖనిజాలను శరీరానికి ఎక్కువ మొత్తంలో అందేలా చూసుకోవాలి. దీంతో ఎముకలు గట్టిపడతాయి. లేదంటే ఎముక పేలుసుగా మారి ఆస్టియోపొరోసిన్ వంటి సమస్యలకు దారితీస్తుంది.








