Health tips : బ్రెడ్ ఆరోగ్యానికి మంచిదేనా ?

By manavaradhi.com

Published on:

Follow Us
Is Bread Really So Bad for You?

సాధారణంగా మనం అందరం ఎక్కువగా చూసేది వైట్ బ్రెడ్ ఇందులో క్రొవ్వులు మరియు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. చాలామంది సాండ్ విచ్ కోసం వైట్ బ్రెడ్ ఉపయోగిస్తుంటారు. బ్రెడ్‌ల్లో వైట్ బ్రెడ్‌ని మ‌నం దూరంగా పెడితేనే మంచిది. ఎందుకంటే ఇందులో పీచు ప‌దార్థం అస‌లేమాత్రం ఉండ‌దు. పీచుప‌దార్థం ఎక్కువగా ఉన్న ప‌దార్థాలు మ‌న‌కు ఎక్కువ స‌మ‌యం పొట్ట‌నిండుగా అనిపించేలా చేస్తాయి. కానీ బ్రెడ్‌లో పీచు లేనందున దీన్ని క‌డుపునిండా తిన్నా కూడా, వెంట‌నే ఏదో ఒక ఆహారం తీసుకుంటాం. అలా ఎక్కువ ఫుడ్ తీసుకోవాల్సి వ‌స్తుంది. కార్బోహైడ్రేట్లు శ‌రీరానికి అవ‌స‌ర‌మే అయినా బ్రెడ్‌ని తీసుకుంటే ఇవి అవ‌స‌రానికి మించి లోప‌లికి వెళ‌తాయి. అందుకే బ్రెడ్‌ని త‌ర‌చుగా తింటే బ‌రువు పెరిగే అవ‌కాశం ఉంది. ఇందులో ఉన్న పంచ‌దార‌, ఉప్పు, నిల‌వ ఉంచేందుకు వాడే ర‌సాయ‌నాలు ఇవ‌న్నీ కూడా బ‌రువుని పెంచుతాయి.

మ‌న ఆరోగ్యం విష‌యంలో చూసుకుంటే అన్నిటికంటే చివ‌ర‌గా వైట్ బ్రెడ్ ఉంటుంది. ఎన్నో ద‌శ‌ల్లో ప్రాసెస్ చేసిన‌ పిండిని దీని త‌యారీకి వాడ‌తారు. అంతేకాక ఇందులో పోష‌క‌విలువ‌లు సైతం చాలా త‌క్కువ‌గా ఉంటాయి. ఆహారంలో ఎక్కువ శాతం బ్రెడ్‌ని ఎక్కువ‌కాలం వాడితే దీర్ఘ‌కాలంలో పోష‌కాహార లోపం క‌లుగుతుంది. వైట్ బ్రెడ్ లో ఎలాంటి ఫైబర్ ఉండదు. బ్రెడ్ తయారిలో అనేక వస్తువులను కలపటం వలన భారీ మోతాదులో కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. తక్కువ మోతాదులో తిన్నప్పుడు పిండిపదార్ధాలు శరీరానికి లాభం చేకుర్చినప్పటికి ఎక్కువ మొత్తంలో తిన్నప్పుడు మీకు హానిని కలిగిస్తాయి. పిండి పదార్థాలను అధిక మోతాదులో తీసుకొంటే జ్ఞానపరమైన క్రియలు యొక్క తగ్గుదల అంటే ‘మెదడు ఫాగ్’కు కారణం కావచ్చు. అధికంగా పిండిపదార్ధాలు తినటం వలన,ముఖ్యంగా శుద్ధి చేసిన పిండిపదార్ధాల వలన మధుమేహం, గుండెపోటు మరియు మెదడు దెబ్బతినడం, రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులు వంటి వ్యాధులు వస్తాయి. కాబట్టి సాద్యమైనంత వరకు వైట్ బ్రెడ్ కు దూరంగా ఉండాలి.

బ్రెడ్లను మనం తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే వీటిని మనం ఏరూపంలో తీసుకున్న మనకు ఎలాంటి పోషకాలు లభించవు. కాకపోతే గోధుమలతో కానీ పూర్తి ధ్యానంతో తయారుచేసిన బ్రెడ్లను తీసుకొంటే ఎక్కువ మెుత్తంలో కాకాపోయిన కొన్ని పోషకాలు మాత్రం లభిస్తాయి. నిజానికి, బ్రెడ్స్ లో వివిధ రకాలున్నాయి.తృణధాన్యాలతో తయారు చేసిన బ్రెడ్ లో ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. బ్రౌన్ బ్రెడ్ ను గోధుమ మరియు సోయా పిండి కలయికతో తయారు చేస్తారు. అందుకే అది బ్రౌన్ కలర్ లో ఉంటుంది. ఇది జిగట లేని కారణంగా ఇది లోఫ్యాట్ కలిగి ఉండటం చేత ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మల్టీ గ్రెయిన్ బ్రెడ్ అంటే ఆరోగ్యానికి మేలు చేసే వివిధ రకాల ధాన్యాలు గోధుమలు, రే, మిల్లెట్ మొదలగువాటితో తయారు చేస్తారు. అందువల్లే ఇందులో డైటేరియన్ ఫైబర్ అధికంగా ఉంటుంది. కాక‌పోతే వీట‌న్నింటిలోనూ ప‌ళ్లు, న‌ట్స్ కూర‌గాయ‌ల‌తో పోలిస్తే పోష‌కాలు చాలా త‌క్కువ‌. కాబట్టి దీన్ని త‌ర‌చుగా స్నాక్‌గా తిన‌క‌పోవ‌డ‌మే మంచిది.

బ్రెడ్‌ల్లో వైట్ బ్రెడ్‌ని మ‌నం దూరంగా పెడితేనే మంచిది. కృత్రిమ‌మైన ఫ్లేవ‌ర్లు, నిల‌వ ఉంచే ర‌సాయ‌నాలు, మితిమీరిన చెక్కెర ఇవ‌న్నీ బ్రెడ్ ‌లో ఉంటాయి. ఇవ‌న్నీ మ‌న ఆరోగ్యానికి మేలు చేసేవి కావు. క‌నుక బ్రెడ్‌ని ఎంత త‌క్కువ తింటే అంత మంచిది.

Leave a Comment