లిక్విడ్ డైట్ ద్రవ పదార్థ రూపంలో ఉన్న ఆహారం. ఇది గది టెంపరేచర్ వద్ద తీసుకుంటే ఎటువంటి ప్రమాదం లేదు. దీన్ని ఎక్కువగా స్పొర్ట్స్ పర్సన్స్ తీసుకుంటూ ఉంటారు. తక్షణ శక్తిని అందించే ఈ లిక్విడ్ డైట్ వల్ల మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది.
లిక్విడ్ డైట్ అనేది ప్రస్తుతం చాలామంది నోట వినిపిస్తున్న మాట. ఈ లిక్విడ్ డైట్ లో ఏముంటుందనే సందేహాలు చాలామందిలో తరచూ వస్తుంటాయి. దంత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు నమలడం కష్టం గా ఉంటుంది. ఎందుకంటే దవడ ఎముకలు గాయాలకు గురి అయినప్పుడు సరిగ్గా నమలలేరు. నమలడం కష్టంగా మారడంతో శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. పోషకాలు అందనప్పుడు సహజంగానే బలహీనంగా తయారవుతారు. దీన్ని అధిగమించడానికి ద్రవ పదార్థాలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
దంత వరుసలో ఏదేని దంతం లేనట్లయితే ఇన్ ఫెక్షన్ అవుతుంది. ఇలా ఇన్ ఫెక్షన్ అవడం మూలంగా ఘన పదార్థాలను తినడం సవాల్ గా మారుతుంది. ఎందుకంటే దంత వరుసలో ఒకటి లేదా రెండు దంతాలు లేనట్లయితే ఆహార పదార్థాలు ఇరుక్కుని ఇన్ ఫెక్షన్ ప్రారంభమవుతుంది. నోటి లోపల పుండ్లు ఏర్పడినప్పుడు కూడా ఆహారం నమలడం కష్టంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కూడా ద్రవ పదార్థాలను తీసుకోవాలి.
జీర్ణశక్తి సన్నగిల్లినప్పుడు అనారోగ్యం చేరువవుతుంది. వ్యాధులు సంక్రమిస్తాయి. శస్త్రచికిత్సలు జరిగినప్పుడు కూడా ఘన ఆహార పదార్థాలను తినకూడదు. నొప్పి తగ్గే వరకు ద్రవ పదార్థాలను తీసుకోవాలి. ప్రేవుల్లో ఎటువంటి ఇబ్బంది ఉన్నా తాత్కాలికంగా ద్రవపదార్థాలను తీసుకోవాలి. మల బద్దకం ఉన్నప్పుడు కూడా ద్రవ పదార్థాలను తీసుకుంటారు. కడుపులో లేదా జీర్ణాశయం లోపల పరీక్షలు చేయడానికి పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షలు చేయడానికి 24 నుంచి 48 గంటల ముందే ఘన ఆహారం తీసుకోవడం మానేయాలి. అప్పుడు పరీక్షలు చేయడం వల్ల ఫలితాలు స్పష్టంగా ఉంటాయి.
ప్రేవుల్లోపల ఏదేని ఘన పదార్థం ఇరుక్కున్నట్లయితే కూడా ఘన ఆహారం తీసుకోకూడదు. దీనివల్ల పరీక్షల మీద ప్రభావం చూపుతుంది. పండ్ల రసాలను శస్త్రచికిత్స ముందు తీసుకోవాలి. కొలనోస్కోపి అంటే పెద్ద ప్రేవులకు చేసే పరీక్ష. అప్పుడు కూడా పండ్ల రసాలను తీసుకోవాలి. పాలు, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల అలసట వంటివి దరిచేరవు.వేసవిలో నార్వేలాంటి కొన్ని దేశాల్లో పగటి సమయం ఎక్కువగా ఉంటుంది.
నిజానికి చివరిగా భోజనం చేసిన 8గంటల తరవాత కానీ శరీరం ‘ఉపవాస స్థితి’లోకి వెళ్లదు. అప్పటిదాకా మనం తీసుకున్న ఆహారం నుంచే శరీరం పోషకాలను శోషించుకుంటుంది.ఆ తరవాత శరీరం శక్తి కోసం కాలేయం, కండరాలలో నిక్షిప్తమైన గ్లూకోజ్పైన ఆధారపడటం మొదలుపెడుతుంది. అప్పటికీ ఆహారం తీసుకోకపోతే గ్లూకోజ్ స్థాయులు కూడా తగ్గిపోతాయి. దాంతో పేరుకుపోయిన కొవ్వే శరీరానికి తదుపరి శక్తి వనరుగా మారుతుంది.మొదట ఆహారం నుంచి, ఆపైన కాలేయం, కండరాలలో నిక్షిప్తమైన గ్లూకోజ్ నుంచి శరీరం శక్తిని పొందుతుంది.కొవ్వు కరగడం మొదలవగానే ఆ ప్రభావం శరీర బరువుపైనా పడుతుంది. క్రమంగా కొలెస్ట్రాల్ స్థాయులతో పాటు బరువు కూడా తగ్గడం మొదలవుతుంది. దీనివల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. కానీ రక్తంలో చక్కెర శాతం తగ్గడం వల్ల నీరసం ఆవరిస్తుంది. తలనొప్పి, అలసట, నోటి దుర్వాసన లాంటి సమస్యలూ తలెత్తుతాయి. ఆకలి తీవ్రత కూడా ఈ దశలో చాలా ఎక్కువగా ఉంటుంది. తొలి రెండ్రోజుల ఉపవాస సమయంలో శరీరం దానికి అలవాటు పడటానికి ప్రయత్నిస్తుంది. క్రమంగా కొవ్వుని కరిగించి దాన్ని శక్తిగా మార్చుకోవడం మొదలుపెడుతుంది.కానీ వేసవి కాబట్టి చెమట కారణంగా శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకే ఉపవాస విరామం సమయంలో ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.