ORANGE BENEFITS : ఆరెంజ్‌ తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

By manavaradhi.com

Published on:

Follow Us
ORANGE BENEFITS

ఆరెంజ్ తినడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరమే లేదు. ఆరెంజ్ తీసుకున్నట్లయితే 60 క్యాలరీలు, ఉప్పు, కొవ్వు ఉండదు. 3 గ్రాముల పీచు పదార్థం , 12 గ్రాముల చక్కెర, ఒక గ్రాము ప్రోటీన్, 70 మిల్లీ గ్రాముల విటమిన్ సి, 6 శాతం క్యాల్షియం ఉంటుంది. ఆరెంజ్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అధికంగానే ఉన్నాయి. విటమిన్ సి వల్ల అనేక ప్రయోజనాలు వీటి వల్ల కలుగుతాయి. మన శరీరంలో ఉన్న కణాలు దెబ్బతినకుండా కాపాడటంలో ఆరెంజ్ ను మించిన ఔషధం లేదు. దీనివల్ల చర్మం ఎప్పుడు నిగనిగలాడుతూ ఉంటుంది. ఏదేని గాయాలు అయినప్పుడు అంత త్వరగా మానవు. ఆరెంజ్ తింటే గాయాలు త్వరగా మాయమౌతాయి. ఐరన్ సంగ్రహించడం సులభతరం కావాలంటే ఆరెంజ్ తినాల్సిందే. బ్యాక్టీరియా, వైరస్ నుంచి కాపాడుకోవడానికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. ఆ పని చేసిపెట్టడంలో ఆరెంజ్ ను మించింది లేదు.

కొందరికి వయసు పెరుగుతున్న కొద్దీ కంటి లోపాలు ఎక్కువవుతాయి. ఆ కోవలో వచ్చే ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డీ జనరేషన్ వ్యాధిని అరికట్టడానికి ఆరెంజ్ తప్పనిసరిగా తినాలి. ఆందోళనకరంగా ఉంటే మాత్రం విటమిన్ సి తీసుకుంటే చక్కని ఫలితం కనిపిస్తుంది. ఒత్తిడి ఎక్కువైతే తలపట్టేసినట్లవుతుంది. ఈ సమయంలో మన శరీరంలో రసాయన చర్య జరుగుతుంది. కార్టిసోల్ అనే హార్మోన్ చెలరేగిపోకుండా విటమిన్ సి బాగా పనిచేస్తుంది. ఈ హార్మోన్ పనితీరును దెబ్బతీయడానికి ఆరెంజ్ చేయాల్సిందిల్లా చేస్తుంది. కొన్ని రకాల ఆహారాలు మీ శరీరం మీద ఎంతో కొంత ప్రభావాన్ని చూపుతాయి. శరీరం వాపు రావడానికి కారణభూతం అయ్యే ఆహారం జోలికి అస్సలు వెళ్లకూడదు. డయాబెటీస్, హార్ట్ డీసీజెస్, ఆర్థరైటిస్, క్యాన్సర్, అల్జీమర్స్ వ్యాధి వచ్చినప్పుడు ఆరెంజ్ తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఆరెంజ్ లో ఉండే పీచుపదార్థం తింటే మాత్రం జీర్ణవ్యవస్థ కుదుటపడుతుంది. కడుపులో గడబిడ లేకుండా ఉండవచ్చు. కొవ్వు పదార్థం తక్కువైతే మాత్రం లాభాలధికంగానే ఉన్నాయి. మన శరీరానికి అవసరమయ్యే మరో ముఖ్య పోషకం క్యాల్షియం. ఈ క్యాల్షియం వల్ల ఎముక గుల్లబారకుండా బలంగా ఉంటుంది. కండరాలు పటిష్టంగా ఉండటానికి దోహదపడుతుంది. అమ్మ కాబోయేవారికి ఆరెంజ్ బాగా పనిచేస్తుంది. అంతేకాదు పుట్టబోయే బిడ్డకు కూడా మంచిది. పుట్టుకతో వచ్చిన లోపాలను సరిదిద్దడానికి, విటమిన్ బి అందివ్వాలంటే ప్రతి గర్భిణి ఆరెంజ్ తప్పనిసరిగా తినాలి. చక్కెర సహజసిద్దంగా తనంతతాను ఉత్పత్తిచేసుకునే ఆరెంజ్ శరీరానికి చాలా అవసరం. సగటు ఆరెంజ్ 12 గ్రాముల చక్కెర తయారు చేసుకుంటుంది. పొటాషియం విషయానికి వస్తే ఆరెంజ్ తక్కువేమికాదు. రక్తపోటును నివారించే గుణం పొటాషియంకి ఉంది. ఇది ఎక్కువపాళ్లలో ఉండాలంటే ఆరెంజ్ డైట్లో భాగం చేసుకోవాలి. విటమిన్ సి అతిగా తీసుకోవడం వల్ల వాంతులు , వికారం , డయేరియా, కడుపునొప్పి, తలనొప్పి, నిద్రలేమి వంటివి దరిచేరతాయి.

రుచిగా ఉందని చాలామంది ఎక్కువ మొత్తంలో ఆరగించేస్తుంటారు. కానీ ఆరెంజ్ ను అతిగా తీసుకోరాదు. మన శరీర అవయవాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరెంజ్ తినాల్సిందే. కానీ ఏదైనా మితంగా తింటేనే ఆరోగ్యం మెరుగవుతుంది.

Leave a Comment