Passive Smoking : ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కలిగే అనర్థాలెంటి? ఈ సమస్య నుంచి ఎలా బయటపడవచ్చు?

By manavaradhi.com

Published on:

Follow Us
passive smoking effects

కొందరు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నాగుప్పుగుప్పుమంటూ రింగురింగుల పొగలు వదులుతుంటారు. అయితే సిగరెట్లు, బీడీలు కాల్చేవారు వదిలే పొగను పీల్చుకోవడం వల్ల పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు. చిన్నపిల్లలకు ప్యాసివ్ స్మోకింగ్ వల్ల జీవితాంతం ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

నేడు ఎంతోమంది పొగాకు ఉత్పత్తులను తీసుకోవడం వల్ల అనారోగ్యాల పాలై ప్రాణాల్ని కోల్పోతున్నారు. ప్రపచంలో కనిపించే క్యాన్సర్స్‌లో 30% పొగత్రాగడం, పొగాకు పదార్ధాల్ని నమలడం వల్ల వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇంట్లో ఉండేవారిలో 52 శాతం, ఉద్యోగరీత్యా బయటకు వచ్చేవారిలో 30 శాతం మంది ఈ ప్యాసివ్ స్మోకింగ్ బారిన పడుతున్నారు. 80 నుంచి 90 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్లు పొగతాగడం వల్లనే వస్తున్నాయి. పొగతాగేవాళ్లు ఆ అలవాటు లేనివాళ్లకన్నా ఏడున్నరేళ్ల ఆయుర్దాయాన్ని కోల్పోతారు. పొగాకులో ఉన్న నికోటిన్‌ అనేక అవయవాల మీదే కాకుండా క్రోమోజోమ్స్‌, జీన్స్‌ మీద ప్రభావం చూపుతుంది.

పొగత్రాగే వాళ్ళలో క్యాన్సర్‌ నెమ్మదిగా వస్తుంది కాని పాసివ్‌ స్మోకింగ్‌ వల్ల పొగతాగేటప్పుడు పక్కన ఉంటూ వారు వదిలే పొగను పీల్చే వాళ్ళకు గుండె జబ్బులు త్వరగా వచ్చే అవకాశముంది. ఇవేకాక ఊపిరితిత్తులు, గుండె, ఆహారనాళము, రక్తనాళాలు, నోరు మొదలైన అవయవాలు కూడా దెబ్బతింటాయి. పొగ పీల్చడం వల్ల వల్ల శ్వాస నాళాలు, ఊపిరిత్తులు పాడై ఊపితిత్తుల క్యాన్సర్స్‌ రావచ్చు. వీరిలో దగ్గు ఎక్కువగా వస్తుంది. బరువు తగ్గుతారు. ఉమ్మిలో రక్తం పడుతుంది. గొంతు మారుతుంది. ఛాతిలో నొప్పి ఉంటుంది. ఎక్స్‌రే, కళ్ళ పరీక్షల ద్వారా ఈ సమస్యని గుర్తించవచ్చు.

పొగవల్ల ఊపిరితిత్తులతో పాటు అది వెళ్ళే మార్గంలో ఉన్న స్వరపేటిక, నాలుక, పెదాలతో పాటు గొంతు, ఆహారనాళం కూడా బాగా దెబ్బతింటాయి. ఊపిరితిత్తులలో ఉండే ఇన్‌ఫెక్షన్‌ ఆహారనాళంలోకి రావచ్చు. అలాగే పొగత్రాగడం వల్ల ఆహారనాళం లోపలివైపు ఉండే మ్యూకస్‌ దెబ్బతింటుంది. అల్సర్స్‌ రావచ్చు. పొగాకు పదార్థాల ప్రభావం రక్తనాళాలమీద కూడా పడుతుంది. పొగ, పొగాకు పదార్ధాలలవల్ల సన్నటి రక్తనాళాలు సంకోచించి, వ్యాకోచించే గుణాలు దెబ్బతింటాయి. కాళ్ళలో రక్తప్రసరణ దెబ్బతిని గాంగ్రీన్‌ రావచ్చు. పొగాకులోని విషపదార్ధాల వల్ల హార్మోన్లు దెబ్బతింటాయి.

పొగత్రాగితే మగవాళ్ళలో బర్జర్స్‌ డిసీజ్‌ రావచ్చు. ఈ వ్యాధి వస్తే కాళ్ళలోనూ, చేతుల్లోనూ చివర్లలో ఉండే ఆర్టెరీస్‌ దెబ్బతింటాయి. ఈ అనారోగ్యం ప్రారంభంలో పాదాలలో నొప్పి వస్తుంది. పొగత్రాగడం వల్ల నోటి క్యాన్సర్‌ రావడానికి అవకాశాలు ఎక్కువ. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా, పక్కనే ఆడుకుంటున్నా కొందరు పొగ తాగుతారు. అయితే సిగరెట్లు, బీడీలు కాల్చేవారు వదిలే పొగను పీల్చుకోవడం వల్ల కూడా పిల్లలకు అనారోగ్యం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లలకు ప్యాసివ్ స్మోకింగ్ వల్ల అప్పటికప్పుడే కాకుండా.. జీవితాంతం కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా పిల్లలకు గుండెజబ్బులు, శ్వాస సంబంధమైన సమస్యలు తలెత్తే ముప్పు ఉందని, వారి ఆయుష్షు తగ్గిపోతుంది. ప్యాసివ్ స్మోక్ లో రక్త నాళాలు, రక్త ప్రసరణ, రక్తపోటు, గుండె లయను దెబ్బతీసే చేసే రసాయనాలు ఉంటాయి. వీటి వల్ల పిల్లలకే ప్రమాదం ఎక్కువ. అంతేకాదు.. గర్భస్థ శిశువులకూ సిగరెట్ పొగతో హాని తప్పదు. చాలామందిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇందుకు రోజురోజుకూ కలుషితమవుతున్న వాతావరణ కాలుష్యమూ కారణమే.

ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ఫ్యామిలీ హిస్టరీ ఏమీ ఉండదు. ఊపిరితిత్తుల క్యాన్సర్ కుటుంబంలో వంశానుగతంగా రాదు. అయితే ఏ క్యాన్సర్‌కైనా జన్యువుల్లో అకస్మాత్తుగా కలిగే మార్పులే కారణమవుతాయి. కాని ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు వీటిని గుర్తించలేము. ఈ మార్పులను సాధారణంగా శరీరం కంట్రోల్ చేస్తుంటుంది. ఇది కంట్రోల్ చేయలేనప్పుడు అది క్యాన్సర్‌కి దారితీస్తుంది. ఈ మార్పులు నిరంతరం మారుతుంటాయి. అందుకే వాటిని గుర్తించడం కూడా సాధ్యపడడం లేదు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ రిస్కు ఉంటుంది. ఎందుకంటే అందరిలోనూ ఉత్పరివర్తనాలు ఏర్పడుతాయి. చెడు అలవాట్లుంటే ఈ రిస్కు పెరుగుతుంది. ఏ క్యాన్సర్ విషయంలో అయినా, వ్యాధి నిర్ధారణ, అది ఏ దశలో ఉందో తెలుసుకోవడం, ఆ తరువాత చికిత్స ఇలా మూడు దశలు ఉంటాయి.

క్యాన్సర్‌కి ప్రధానంగా చేసే పరీక్ష బయాప్సీ. జన్యుమార్పులు ఉండి, బయోమార్కర్లు పాజిటివ్ వచ్చినవాళ్లకు ఇక వేరే టెస్టులేమీ చేయకుండా టార్గెటెడ్ థెరపీ ఇస్తారు. నెగటివ్ ఉన్నవాళ్లకు కీమోథెరపీ ఇస్తారు. టార్గెటెడ్ చికిత్స ఏడాది పాటు కొనసాగించిన తరువాత వ్యాధి ఏ స్థితిలో ఉందో తెలుసుకుని, ఒకవేళ పెరిగిందనుకుంటే మళ్లీ బయోమార్కర్ టెస్టు చేయాల్సి ఉంటుంది. స్మోకింగ్ అలవాటు ఉన్నవారికి సంతానం కలగడం చాలా ఆలస్యం కావచ్చు. భర్త స్మోకింగ్ కారణంగా భార్యలోని జీవరసాయనాల్లో మార్పు వచ్చి, అండాల సంఖ్య గణనీయంగా తగ్గడం సాధారణంగా కనిపిస్తుంది. ఒకసారి అండాల సంఖ్య తగ్గితే వాటిని తిరిగి పొందడం సాధ్యంకాదు. సిగరెట్ పొగలో ఉన్న రసాయనాల వల్ల మహిళలకు చాలా త్వరగా మెనోపాజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు సంతాన సాఫల్యం కలిగేలా చూడాల్సి వస్తే ఐవీఎఫ్ ప్రక్రియలో ఆమె ఓవరీ స్టిమ్యులేషన్‌కు మరిన్ని మందులు అవసరమవుతాయి. పుట్టే పిల్లల్లో బరువు తక్కువగా ఉంటుంది. వారి పిల్లలకు భవిష్యత్తులో డయాబెటిస్, గుండెజబ్బులు, స్థూలకాయం వచ్చే అవకాశాలు ఎక్కువ.

ప్యాసివ్ స్మోకింగ్ వల్ల వారు ప్రేమించే అతి దగ్గరివారికీ అది ప్రమాదకరం. కాబట్టి ఈ అలవాటును ఎంత త్వరగా వదుల్చుకుంటే అంత మేలు. ఈ పొగ తాగే సరదా అలవాటు క్రమంగా మానలేని పెను వ్యసనమై ప్రాణాలకే ముప్పు తెస్తుంది. అంతేకాదు జబ్బుల వలయాన్ని కూడా ముందుకు తెస్తుంది. పీల్చే సిగరెట్టయినా, నోట్లో వేసుకునే గుట్కా అయినా.. రూపమేదైనా సరే సుమారు నాలుగు వేల రకాల మృత్యుపాశాలను పంపే పొగాకుకు ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ఉన్నట్టే.

Leave a Comment