మనం నడిచేందుకు ఎంతో ఉపయోగపడే పాదాలను మనం అంతగా పట్టించుకోము అన్నది పచ్చి నిజం. కేవలం చెప్పులు వేసుకోవడం వరకే చూస్తాం. అయితే పాదాలు బాగుంటేనే మనం బాగా నడువగలుగుతాం. అంతటి ప్రాధాన్యత ఉన్న పాదాలకు సరైన విధంగా కాపాడుకోవాలి.
మనం ఎక్కువగా నిర్లక్ష్యం చేసే మన శరీర అవయవాల్లో ప్రధానంగా చెప్పుకోదగినది పాదాలు. ఎవరు చూస్తారులే అని చాలా మంది భావిస్తుంటారు. కానీ అది తప్పు. పాదాలు, చేతులను సరైన రీతిలో మెయింటేన్ చేయని వాళ్లపై.. ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బ్యాడ్ గా పడుతుందని పలు పరిశోధనల్లో తేలింది. రోజంతా మన భారాన్ని మోసే పాదాలకు మొత్తంగా అతి తక్కువ ప్రాధాన్యం ఇస్తామని చెప్పొచ్చు. పాద రక్షలు వాడే అలవాటు లేకపోవటం, వాడే చెప్పులు సైతం పాదాలకు అనుకున్నంతగా రక్షననివ్వలేక పోవటం వల్ల పాదాలు రంగు మారటం, పగుళ్ళు ఇవ్వటం వంటి మార్పులకు లోనవుతూ ఉంటాయి. ఎక్కువగా నడవడం, పని ఒత్తిడి కారణంగా పాదాలు చాలా డ్యామేజ్ అవుతుంటాయి. అలాగే తీవ్ర ఎండవేడివి కూడా పాదాలకు చాలా హాని చేస్తుంది. కాలి వేళ్లు, చేతి వేళ్లకు ఒకే రంగు వేసుకోవడంతో పాటు అదేరంగు మెట్టలు ధరించడం వల్ల ఎదుటివారిని ఇట్టే ఆకర్శించవచ్చు. అందుకని పెడిక్యూర్‌ను ఒక పద్ధితిగా చేసుకోవడం అలవాటుచేసుకోవాలి.
అలసి పోయిన పాదాలు, మడమలు, కాలి వేళ్ళు, గిలక భాగాలకు సున్నితమైన మసాజ్ సాయంతో ఉపశమనాన్ని కలిగించటమే పెడిక్యూర్. ప్యూమిస్ స్టోన్, మసాజ్ క్రీమ్, నెయిల్ బ్రష్, నెయిల్ క్లిప్పర్స్, నెయిల్ వార్నిష్, ఒక చిన్న టబ్ సమకూర్చుకుంటే ఎవరికీ వారు ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోవచ్చు. పెడిక్యూర్ లో భాగంగా చేసే మసాజ్, టోనింగ్ వల్ల పాదాలకు బలం చేకూరటమేగాక రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. తేలికపాటి నూనె, షాంపూ కలిపిని నీటిలో పాదాలు నానిన తర్వాత ప్యూమిస్ స్టోన్‌తో మడమలు, అరికాళ్ళను రుద్ది శుభ్రం చేయాలి. పెడిక్యూర్ చేసేప్పుడు క్రిములు వచ్చి చేరేందుకు ఉపయోగపడే క్యూటికల్స్ పొరను కత్తిరించకూడదు. మాయిశ్చరైజర్‌తో మెత్తగా రుద్ది శుభ్రం చేయాలి. పెడిక్యూర్ తర్వాత గోళ్ళ మీద దృష్టి పెట్టాలి. ఎగుడు దిగుడుగా పెరిగిన గోళ్ళను సమంగా కత్తిరించుకోవటం, అక్కడ ఏమైనా మట్టి చేరితే తొలగించటం చేయాలి. తర్వాత నూనె లేదా క్రీముతో గోళ్లను, పాదాలను మర్దన చేయటం వల్ల గొప్ప ఉపశమనం కలుగుతుంది.
పెడిక్యూర్ చేసుకోవడానికి ముందు గతంలో వేసుకొన్న గోళ్ల రంగులను తొలగించాలి. పెడిక్యూర్ చేసుకోవడానికి ముందు కాలిని షేవ్ చేయవద్దు. మీ పర్సనల్ పనిముట్లను పెడిక్యూర్ కోసం వినియోగించడం చాలా మంచిది. పాదాల సంరక్షణకు రెగ్యులర్ గా సన్ స్క్రీన్ రాసుకోవడం చాలా అవసరం. ఫిష్ పెడిక్యూర్ పద్ధతిని సెలూన్లో కంటే ఇంట్లో చేసుకోవడమే ఉత్తమం. సెలూన్‌లో చేసుకోవడం వల్ల కొన్ని వ్యాధులు వ్యాప్తిచెందే అవకాశాలు ఉన్నాయి. శీతాకాలంలో పాదాలకు మరకలు కాకుండా ఉండేందుకు ప్లాస్టిక్ రాప్‌తో పెడిక్యూర్ చేసుకోవాలి. కొన్నిరోజులపాటు వేళ్లకు రంగులు వేయకుండా ఉంచడం ద్వారా తేమ లేకుండా చూసుకోవచ్చు. గర్భం ధరించిన సమయంలో పెడిక్యూర్ చేసుకోవడం వల్ల మంచి ఉపశమనం పొందవచ్చు.pedicure precautions in telugu