Health Care: ఆహారాన్ని మింగేటప్పుడు గొంతు నొప్పిగా ఉందా?

By manavaradhi.com

Updated on:

Follow Us
Swallowing problem

మనకు తెలియకుండానే మన శరీరంలో కొన్ని పనులను అసంకల్పితంగా చేసేస్తూ ఉంటాం. ఈప్రక్రియల్లో ఏదైన ఇబ్బంది ఏర్పడినప్పుడు మాత్రమే మనం వాటి గురించి పట్టించుకుంట్టాం. ముఖ్యంగా మనం ఏదైనా తింటున్నప్పుడు మింగడంలో ఇబ్బంది ఏర్పడితే చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కోక్కసారి గుటకకూడా వేయ లేనంత కష్టంగా ఉంటుంది. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనికి కారణాలు ఏంటి ..?

మనం తీసుకున్న ఆహారాన్ని నమిలి మింగిన తరువాత… అది గొంతు నుంచి అన్నవాహిక ద్వారా జీర్ణకోశం చేరుకుంటుంది. అక్కడ అరిగించబడుతుంది. తద్వారా మనం తీసుకునే అనేక పదార్థాల ప్రభావం అన్నవాహిక పైన కూడా ఉంటుంది. ముద్ద మిండు పడకపోవడం, గోంతు పట్టేసినట్లు ఉండం అనేది చాలా వరకు వయసు మళ్ళిన వారిలో చూస్తూఉంటాం. ఇందుకు ఆహారాన్ని సరిగా నమలకపోవడం, వయసుతోపాటు అన్నవాహిక కండరాలు సన్నపడడం లాంటి కారణాలు ఉంటాయి. అయితే నోటితో గాలి పీల్చుకునే అలవాటు ఉన్నప్పుడు, లాలాజలం తగినంత ఉత్పత్తికానప్పుడు , గోంతు తడిఆరిపోతున్నప్పుడు… కూడా ముద్ద మింగడం కష్టంగా ఉంటుంది. ఇక క్యాన్సర్ లాంటివి వచ్చినప్పుడు రెడియోథెరఫి తీసుకున్నప్పుడు అన్నవాహిక కండరాల్లో వాపు వచ్చి అవి దెబ్బతిని పోతుంటాయి. అలాగే థైరాయిడ్ గ్రంధి వాపు ఉన్నప్పుడు కూడా ముద్ద మింగడం అనేది కష్టంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు.

ఆహారం మింగుతున్నప్పుడు నొప్పి ఎందుకు వస్తుంది ?

డిస్ ఫేజియాతో బాధపడుతున్నప్పుడు ముద్దమింగడంలో ఇబ్బందితో పాటు గొంతులో నొప్పిగా ఉంటుంది. మింగుతున్నప్పుడు గొంతు ఛాతి భాగాల్లో ఏదో అడ్డుగా ఉన్నట్లు ఉంటుంది. ముద్ద మధ్యలో ఆగిపోయినట్లు అనిపిస్తుంది. ఆహారపు తునకలు,ద్రవాలు తిరిగి గొంతులోకి వస్తున్నట్లు ఉంటాయి. తరచుగా ఛాతిలో మంటగా ఉంటుంది. డిస్ ఫేజియా సమస్య ముదిరేకొద్ది బరువు తగ్గిపోవడం, రక్తహీనత లాంటి సమస్యలు మెుదలవుతాయి. ఇలాంటి సమస్యలు వస్తున్నప్పుడు కొన్ని వైద్యపరీక్షల ద్వారా సమస్యను గుర్తించవచ్చు. మింగడంలో ఇబ్బందిని చాలా వరకు మందులతోనే తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా నోటి శుభ్రతను పాటించడంతో పాటు మల్టీ విటమిన్, యాంటి బయోటిక్స్ వాడడం ద్వారా మింగడంలో ఇబ్బందిని చాలవరకు తగ్గించుకోవచ్చు. సమస్యమరీ తీవ్రంగా ఉన్నప్పుడు ఒకవైపు మందులు వాడుతున్న సమస్య తగ్గకపోతే ఒక్కసారి బయోప్సి చేయించుకోవాలి. క్యాన్సర్ లాంటిది ఉంటే ముందుగానే నయంచేయడానికి వీలుటుంది.

డిస్ ఫేజియాకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

ముద్ద నోటిలో పెట్టుకుని నమిలి మింగబోతుండగా గొంతు మొదటి భాగంలో ఇబ్బంది, నొప్పిగా అనిపిస్తే అది ఫారింక్స్‌కు సంబంధించిన సమస్యగా భావించవచ్చు. ఆహారం కిందికి దిగుతున్నప్పుడు ఇబ్బంది అనిపిస్తే అన్న వాహికలో ఏదైనా లోపం ఉండి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. సాధారణంగా గుటక వేసినప్పుడు అన్నవాహిక కండరాలు ఒక క్రమపద్ధతిలో పనిచేయడం వలన భోజన పదార్థాలు కిందకు చేరుతాయి. . ఈ ప్రయాణమార్గంలో ఎక్కడ ఏ చిన్న భాగం దెబ్బతిన్నా అది మింగటానికి అవరోధం అవుతుంది. మింగటం ఇబ్బంది అవుతుంది. మింగటంబాధాకరంగా, ఇబ్బందిగా ఉండేట్లు చేసే అంశాలు ఎన్నో ఉన్నాయి. అయితే వీటిలో చాలాభాగం తాత్కాలికంగా వచ్చిపోయేవి మాత్రమే ఉంటాయి. అయితే మింగటం ఇబ్బందిగా ఉండటం ఏకొద్ది రోజులో కాకుండా… ఎక్కువ రోజుల పాటు కొనసాగి, రానురాను పరిస్థితి దిగజారుతున్న ట్లుగా అనిపించి… పైకి ఏ కారణమూ కనిపించకపోతే సీరియస్‌గా తీసుకోవాలి. మింగటంలో సమస్యలు ఏర్పడు తున్నప్పుడు దానిని నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌కు చూపించుకోవడం అవసరం.

మామూలుగా ఆహారం మింగుతున్నప్పుడు నొప్పిగా ఉండి, తల పైకెత్తి మింగితే నొప్పి లేకపోవడం… అన్నవాహిక లోపం కాక, ఫారింక్స్‌లో ఏదో సమస్య ఉండటం వలన అయి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఈ సమస్య ఎక్కువగా ఉంటే అలసత్వం వహించకుండా వెంటనే వైద్యుని సంప్రదించి తగిని చికిత్స తీసుకోవాలి.

Leave a Comment