మనం ప్రతి రోజు ఇంట్లో వాడే వస్తువులు వల్ల అనేక సమస్యలు తలెత్తవచ్చు. వాటివల్ల మనకు అనేక రకాల ఆరోగ్యసమస్యలు రావచ్చు. చిన్న చిన్న విషయాలే కదా అని వదిలేస్తే మరిన్ని సమస్యలను తెచ్చిపెడతాయి. కాబట్టి మనం ప్రతి నిత్యం ఇంట్లో వాడే వస్తువుల పట్ల తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి .
నిత్యం ఆరోగ్యంగా జీవించాలంటే పరిశుభ్రమైన గాలి, వెలుతురు వచ్చే ఇంట్లో నివసించాలి. ఇల్లు ఎంత శుభ్రం చేసినా ఎక్కడో ఒక చోట బ్యాక్తీరియా వుండి పోతుంది. అన్నిటికంటే ఎక్కువ క్రీములు కిచెన్ టవల్స్ లోనే చేరుతున్నాయని.. వీటివల్లే ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశాలు చాలా ఉన్నాయని పరిశోధనలు చెపుతున్నారు. అదే విధంగా మనం వాడే ఫిల్టర్లు కూడా ఎక్కువ రోజులైన తర్వాత వాటిని మార్చుకోవాలి. వంటగది పరిశుభ్రతే ఇంటిల్లిపాదిని ఆరోగ్యంగా కాపాడుతుంది. స్టౌవ్ ఉంచిన ఫ్లోర్‌తో పాటు స్టౌవ్‌పై మరకలు లేకుండా శుభ్రం చేసుకోవాలి. వాటిని రోజులతరబడి వాడితే మీతో బ్యాక్టీరియానూ ఉంచుకున్నట్లేనని మరిచిపోవద్దు. ఇంట్లో వేర్వేరు వ్యక్తులు చాలా తరచుగా టెలివిజన్‌ను ఉపయోగిస్తారు. దాంతో ఇది సూక్ష్మజీవుల నిలయంగా మారుతుంది. మన ఇంట్లో తరచుగా తాకే ప్రదేశాలలో తలుపు హ్యాండిల్స్ ముఖ్యమైనవి. అందుకే ఇవి సూక్ష్మక్రిములకు నెలవుగా మారతాయి. ఇంటి లోపల బ్యాక్టీరియా వ్యాప్తికి తలుపు హ్యాండిళ్లే కారణమని వైద్యులు కూడా ధృవీకరించారు. అందుకే ప్రతి మూడు, నాలుగు రోజులకోసారి క్రిమిసంహారక ద్రావణంతో తలుపు హ్యాండిల్స్‌ను తుడిచివేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి.
ఇప్పుడు హైటెక్నాలాజీతో వస్తున్న ఫోనుల్లో టివి, ఐపాడ్, ల్యాప్‌టాప్‌లతో.. రేడియేషన్ ఎక్కువగా ఉండటం వల్ల లాభం కన్నా నష్టమే అధికంగా జరుగుతోంది. . రోజూ పడుకునే ముందు ఈ వస్తువులను మీకు దూరంగా ఉంచటం మంచిది. లేదంటే మీ ఆలోచన వాటిమీదే ఎక్కువగా ఉండి సరిగ్గా నిద్రపోరు.సమయానికి మించి ఎక్కువగా సంగీతం వినటం, ల్యాప్ టాప్ ముందు గంటల తరబడి కూర్చోవటం వల్ల శరీరం బరువు పెరిగి మధుమేహనికి దారి తీసే ప్రమాదం ఉంది.వీటి నుంచి వెలువడే అతినీలలోహిత కిరాణల ప్రభావం మీ కంటి పై పడి దృష్టి లోపం ఏర్పడే ప్రమాదం ఉంది. ఎయిర్ కండీషనర్స్ వల్ల కూడా జలుబు రావచ్చు. కాబట్టి ఎయిర్ కండీషనర్స్ ఫిల్టర్స్ పరిశుభ్రంగా ఉండాలి. ఇక అలంకరణ వస్తువులు విషయానికి వస్తే.. ముఖ సౌందర్యాలకు మెరుగులద్దడానికి ఉపయోగించే మేకప్ బ్రష్ ల వాడకం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం.. లేదంటే చర్మం సమస్యలు బాధించే ప్రమాదం ఉంటుంది.
ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అందులో నివసించే వారూ అంతే ఆరోగ్యంగా ఉంటారు. వ్యక్తిగత శుభ్రత ఒకరికే మంచి చేస్తుంది. అదే ఇంటి శుభ్రత కుటుంబ సభ్యులందరికీ మంచి చేస్తుంది. చాలామంది వారానికోసారి దుమ్ము దులుపుదామని అనుకుంటారు. కానీ దుమ్ము కొట్టుకున్న సోఫాలు, టీపారు వంటివి ఉపయోగించడానికి అసహ్యం అనిపిస్తాయి. అంతేకాదు దానిపై చేరిన దుమ్ము అనారోగ్యం పాలు చేస్తుంది. అందుకే ప్రతిరోజూ వాడే వస్తువుల దుమ్ము దులపడం చాలా అవసరం. పుస్తకాల సొరుగుల్లో దుమ్ము పడుతుంది. వారానికి ఒకసారైనా చీపురుతో దులిపి, శుభ్రం చేసుకోవాలి. బెడ్స్ ప్రతిరోజూ శుభ్రం చేసుకోవాలి. ఇంటి పరిశుభ్రతలో మరొకటి ఫ్లోరింగ్. ఇంట్లోకీ బయటకూ నడుస్తుంటాము, గాలి, వెలుతురు కోసం, విండోలను తెరచి ఉంచుతాం. అటువంటప్పుడు, దుమ్మూధూళీ ఫ్లోర్ మీద పడి, అది తినే ఆహారాలపై, మనం వేసుకునే దుస్తులపై పడి, కొన్నిరకాల ఇన్ఫెక్షన్లకు గురిచేస్తుంది. కాబట్టి, ఫ్లోర్ క్లీనింగ్ తప్పనిసరిగా చేయాలి. ఇది ఇంటిసభ్యుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.