Cancer : క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..!

By manavaradhi.com

Updated on:

Follow Us
Cancer- Symptoms, Signs, Types & Causes

క్యాన్సర్….. అదో మహమ్మారి.. ఆధునిక కాలంలో కూడా ఎంతోమందిని పొట్టన పెట్టుకుంటున్న వింత రోగం.. ఇది ఎందుకు వస్తుందో పక్కాగా కారణాలు దొరకవు. పోనీ రాకుండా ఏం చేయాలో చాలా మందికి అవగాహన లేదు. క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా మంచి చిక్సిత అందించవచ్చు. అది దాదాపుగా క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేసుకోవడంతో సమానం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వార క్యాన్సర్ రాకుండా జాగ్రత్తపడొచ్చు.

ఈ మధ్య కాలంలో మనిషిని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న వ్యాధుల్లో క్యాన్సర్ ముందు వరుసలో ఉంటుంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగానే వస్తున్నాయంటున్నారు వైద్య నిపుణులు. క్యాన్సర్ అనేది శరీరంలో ఎక్కడైనా వచ్చే అసాధారణమైన కణాల అనియంత్రిత పెరుగుదల. ఈ కణాలు సాధారణ శరీర కణజాలాలను చొరబాట్లు చేయగలవు. సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో నియంత్రించ బడతాయి. కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఈ కణ సమూహాలనే క్యాన్స‌ర్లుగా పిలుస్తారు. క్యాన్సర్ మన శరీరంలో ఏ భాగానికైనా వచ్చే ప్రమాదం ఉంది. గర్భాశయం, రొమ్ము, ఊపిరితిత్తులు, పేగులు, శ్వాస నాళాలు మొదలైన భాగాలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువ. శ‌రీరం నుంచి ఏ ప్రాంతంలోనైనా రక్తం కారినా, గడ్డలుగా ఏర్పడిన కాన్సర్ లక్షణాలుగా గుర్తించాలి.

ఎందుకు వస్తుందో ఎవరికి వస్తుందో ఎలా వస్తుందో అర్థం కాని మహమ్మారి క్యాన్సర్. శరీరంలో అసాధారంగా పెరిగే కణితులు లేదా ట్యూమర్లు ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మాలిగ్నెంటె ట్యూమర్, రెండు బినైన్ ట్యూమర్. మాలిగ్నెంట్ రకం ట్యూమర్ల నుంచి కొన్ని క్యాన్సర్ కణాలు విడిపోయి దేహాంలో ఏర్పడిన ప్రాంతం నుంచి వేరొక ప్రాంతంలోకి చేరి ద్వితీయ ట్యూమర్లను ఏర్పరుస్తాయి. ఇవి తొందరగా పెరుగుతాయి. అంతే కాదు చాలా ప్రమాదకరమైనవి కూడా. ఇక బినైన్ ట్యూమర్లు నెమ్మదిగా పెరిగి చిన్నవిగా ఏర్పడతాయి. ఇవి అంత హానికరమైనవి కావు. చిన్న శస్త్రచికిత్స ద్వారా వీటిని తొలగించే వీలుంటుంది. మహిళల్ని ఎక్కువగా చుట్టుముట్యే క్యాన్సర్లలో ముందుగా చెప్పుకోవాల్సింది రోమ్ము క్యాన్సర్. 35 ఏళ్ల వయస్సు దాటిన తరువాత ప్రతి రెండేళ్లకోసారి మామెగ్రామ్ చేయించుకోవాలి.

క్యాన్సర్ రాకుండా నివారించుకోవచ్చా.. అంటే దీనికి కచ్చితంగా సమాధానం దొరకదు. క్యాన్సర్ ను ఖచ్చితంగా నివారించే పద్దతి ఏదీ లేదు. కానీ కొన్ని మంచి అలవాట్లు ద్వారా ముందు జాగ్రత్త ద్వారా క్యాన్సర్ వచ్చే అపాయాన్ని కొంతవరకూ తగ్గించుకోవచ్చు. ధూమపానం, నికోటిన్ సంబంధించిన పదార్థాలకు దూరంగా వుండటం మంచిది. అలాగే క్రొవ్వు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, ముడి ధాన్యం, అధికంగా తీసుకోవాలి.


ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఎత్తుకు తగ్గ బరువును మెయింటైన్ చేయాలి. కాలుష్యం నుంచి వీలైనంత వరకూ దూరంగా ఉండాలి. జీవ‌న‌శైలిలో మార్పులు చేసుకొని పోష‌కాహారం తీసుకోవాలి. ఎలాంటి క‌ణుతులు, గ‌డ్డ‌లు క‌నిపించినా అశ్ర‌ద్ధ చేయ‌కుండా స్క్రీనింగ్ ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. ముంద‌స్తుగా గుర్తించి చికిత్స తీసుకోవ‌డం ద్వారా క్యాన్స‌ర్ల‌ను జ‌యించొచ్చు.

ఈ వ్యాధికి ఇదీ కారణం అని చెప్పడానికి లేదు. జన్యుపరంగా సంక్రమించే వీలు కూడా మూడు శాతమే! మిగతా 97% క్యాన్సర్లు ఏ కారణం లేకుండానే రావొచ్చు. అయితే ఆరోగ్యకరమైన జీవనశైలితో క్యాన్సర్‌కు చెక్‌ పెట్టొచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి వల్ల శరీరమే తనలో మొలకెత్తే క్యాన్సర్‌ కణాలను ఎప్పటికప్పుడు చంపేస్తుంది.

Leave a Comment