Obesity health issues: ఊబకాయం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు

By manavaradhi.com

Updated on:

Follow Us
Obesity health issues

నేటి ఆధునిక సమాజంలో ఊబకాయం ఎంతో ప్రమాదకరంగా మారింది. ఆరోగ్య సమస్యల్లో ఊబకాయం ప్రధాన సమస్యగా ఉంది. మారుతున్న జీవన పరిణామాలకు అనుగుణంగా ఆహార అలవాట్లు మారుతుండటంతో ఊబకాయం ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తుంది. పెద్దలతో పాటు చిన్నారులు కూడా ఊబకాయం బారిన పడడం ఆందోళన కలిగించే అంశమే. ఊబకాయంపై నిర్లక్ష్యం వహిస్తే పలు వ్యాధులకు గురి కాక తప్పదు.

నేడు ఎంతోమందిని ఊబకాయం సమస్య పట్టిపీడిస్తోంది. దీనికి అనేక కారణాలున్నాయి. శరీరంలో అతిగా కొవ్వు పేరుకుపోవడం వల్ల అధిక బరువు సంభవిస్తుంది. దీనినే ఊబకాయం అంటాం. మనం ఆహారంలో అతిగా కాలరీలు తీసుకొని, తక్కువ కాలరీలు ఖర్చుచేయటం వల్ల అది కొవ్వుగా మారి శరీరంలోని భాగాలలో పేరుకుపోవడం వల్ల ఈ ఊబకాయం వస్తుంది. ఈ ఊబకాయానికి దారితీసే కారణాలు చూసినట్లైతే… ఊబకాయాన్ని చాలా వరకు జన్యుపరమైన సమస్యగా చూడవచ్చు.

ఊబకాయులైన తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలకి 80% ఊబకాయం వస్తుంది. అలాగే తల్లిదండ్రులలో ఏ ఒక్కరికైనా ఈ సమస్య ఉన్నట్లయితే 50% వరకు వారి పిల్లలకు ఊబకాయం వచ్చే అవకాశం ఉన్నట్లుగా పరిశోధనలు చెబుతున్నాయి. ఇది అన్ని వయసుల వారికి వచ్చే అవకాశం ఉంది. పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి హర్మోన్ల అసమతుల్యత కారణమై ఉండవచ్చు. జీవనశైలిలో వస్తున్న మార్పుల వలన మనిషి ఆహారపు అలవాట్లలో మార్పులు చోటుచేసుకుంతుండటం, ఆహార నియమాలపై అశ్రద్ద వహించటం వలన ఈ సమస్య రోజురోజుకు పెరిగిపోతుంది. అంతేకాదు ఎక్కువ సమయం కంప్యూటర్ల ముందు కూర్చోవడం వల్ల ఊబకాయం పెరుగుతోంది. ఒత్తిడి కారణంగా చాలామందిలో తమకు తెలియకుండానే ఎక్కువ ఆహారం తీసుకుంటారు. దీనివల్ల ఊబకాయం రావొచ్చు.

స్థూలకాయం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటి..?

అధిక బరువు కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. శ్వాస కండరాలు కూడా పని చేయకపోవచ్చు, కాబట్టి మీరు తగినంత గాలిని తీసుకోలేరు. బొడ్డు కొవ్వుతో సంబంధం ఉన్న వాపు ఊపిరితిత్తులను కూడా ప్రభావితం చేయవచ్చు. స్థూలకాయం బాధపడేవాళ్లలో ఫ్యాటీ లివర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాలేయంలో ఇన్ల్ఫమేషన్, స్కార్రింగ్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో లివర్ డ్యామేజ్ కి కూడా.. ఒబేసిటీ కారణమవుతుందని స్టడీస్ చెబుతున్నాయి.

ఎక్కువ బరువు కీళ్లపై మరియు ఎముకల చివరలను రక్షించే మృదులాస్థిపై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది నొప్పి మరియు దృఢత్వాన్ని కలిగిస్తుంది. ఎక్కువ శరీర కొవ్వు కూడా మరింత మంటను ప్రేరేపిస్తుంది. ఒబేసిటీతో బాధపడేవాళ్లకు హై కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒబేసిటీ కాకుండా, స్మోకింగ్, డ్రింకింగ్, వయసు పెరగడం, వారసత్వం, డయాబెటిస్, బ్లడ్ ప్రెజర్ వంటివి హై కొలెస్ట్రాల్ విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి వ్యాయామం ద్వారా బరువు తగ్గితే.. ఈ సమస్య నుంచి బయటపడవచ్చు

స్థూలకాయం విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏవి…?

అధిక బరువు ఉన్న వ్యక్తుల్లో గాల్ బ్లాడర్, గాల్ స్టోన్స్ అనేది చాలా సాధారణ సమస్య. గాల్ స్టోన్స్ ఏర్పడటానికి కొలెస్ట్రాల్ ప్రధాన కారణం. సాధారణ స్థాయి కంటే.. ఎక్కువ బీఎమ్ఐ కలిగిన వాళ్లలో గాల్ స్టోన్స్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గడం ద్వారా గాల్ బ్లాడర్ సమస్యలు నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. బెల్లీ ఫ్యాట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌తో ముడిపడి ఉంటుంది. అలాంటప్పుడు శరీరం ఇన్సులిన్‌ను తయారు చేస్తుంది, కానీ రక్తం నుండి గ్లూకోజ్‌ని బయటకు తీయడానికి కణాలు దానిని సరిగ్గా ఉపయోగించలేవు. సాధారణం కంటే ఎక్కువ రక్తంలో చక్కెర మధుమేహం కావచ్చు మరియు గుండె, నరాలు, కళ్ళు మరియు మరెన్నో సమస్యలకు దారితీయవచ్చు. టైప్ 2 డయాబెటిస్ వచ్చే 10 మందిలో 8 మంది అధిక బరువుతో ఉన్నారు.

ఒబేసిటీ క్యాన్సర్ రిస్క్ ని పెంచుతుంది. శరీరంలో రకరకాల క్యాన్సర్ కణాలు ఏర్పడటానికి ఒబేసిటీ కారణమవుతుంది. బ్రెస్ట్, కొలన్, రెక్టమ్, యుట్రస్, గాల్ బ్లాడర్, కిడ్నీ క్యాన్సర్లకు ఒబేసిటీ వ్యక్తుల్లో ఎక్కువ ఛాన్స్ ఉంది. ఊబకాయంతో అండాశయాల్లో నీటితిత్తులు ఏర్పడొచ్చు. ఇది సంతానం కలగటంలో ఇబ్బందులు సృష్టిస్తుంది. బీఎమ్ఐ స్థాయి పెరిగితే.. గుండె వ్యాధులకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒబేసిటీ కారణంగా గుండెకు రక్త సరఫరా సక్రమంగా అందకుండా.. ప్లాక్యూ ఏర్పడుతుంది. ఇది బ్లడ్ ఫ్లోని అడ్డుకుంటుంది. దీనివల్ల స్ట్రోక్ రిస్క్ ఎక్కువ ఉంటుంది.ఒబేసిటీ కారణంగా హైపర్ టెన్షన్ రిస్క్ ఉంది. ఉప్పు ఎక్కువగా తినడం, తాగడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి, బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ పెరుగుతుంది. కాబట్టి వెంటనే బరువు తగ్గడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

ఒకసారి బరువు పెరిగాక తగ్గటం అంత తేలిక కాదు. అందువల్ల ముందు నుంచే జాగ్రత్త పడాలి. అలాగని అధిక బరువును అసలే తగ్గించుకోలేమని కాదు. ఆహార, వ్యాయామాలతో దీన్ని అదుపులో ఉంచుకోవటం పెద్ద కష్టమేమీ కాదు.

Leave a Comment