రోజూ కంటి నిండా నిద్రపోతే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం. చాలా మంది … అదే పనిగా రేయింబవుళ్లు నిద్రపోతుంటారు. ఇలా గంటల కొద్దీ నిద్ర పోవడం వల్ల అనేక రకాల అనారోగ్యాలకు గురికావచ్చు. గుండె జబ్బులు, కేన్సర్ లాంటి వ్యాధులకు ఇది కారణం అవుతుంది. అతిగా నిద్రపోయేవారికి ఎదురైయే సమస్యలు ఏంటి..?
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత అవసరవెూ నిద్ర కూడా అవసరమే. మంచి ఆరోగ్యముతో ఉండాలంటే రోజుకు 8 గంటల నిద్ర అవసరం. నిద్ర వల్ల విశ్రాంతిని పొందడమే కాదు.. మన శరీరంలోని అతి ముఖ్య పనులకు సహాయపడుతుంది.చాలా అధ్యాయాల్లో ఎక్కువ నిద్ర, తక్కువ నిద్ర రెండూ ఆరోగ్యానికి మంచివి కాదు అని తేలింది. ఆరు గంటల కన్న తక్కువ నిద్రపోవడాన్ని తక్కువ నిద్ర అని.. పది గంటల కన్నా ఎక్కువ నిద్రపోవడాన్ని ఎక్కువ నిద్ర అని అంటారు. ఈ రెండూ కూడా మన ఆరోగ్యానికి హానిచేసేవే. అయితే ప్రతిరోజు 7 నుండి 9 గంటల పాటూ నిద్రపోవటం ఆరోగ్యానికి మంచిది అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 9 గంటల కంటే ఎక్కువ సమయం పాటూ నిద్రపోవటం వలన శరీర విధులలో ఆటంకాలు ఏర్పడతాయి. అతినిద్ర వలన పూర్తి ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
అతినిద్ర వల్ల కలిగే అనర్ధాలు ఏవి…?
- నిద్ర ఎంత సేపు పోవాలనే విషయంలో ఒక్కొక్కరిలో ఒక్కో అలవాటు ఉంటుంది. కొంత మంది కొన్ని గంటల నిద్రతో సరిపెడతారు. మరి కొంత మందికి 7 నుంచి 9 గంటల నిద్ర లేకపోతే సరిపోదు. రోజుకు 5 గంటల కన్నా నిద్ర తగ్గినా, 9 గంటల కన్నా ఎక్కువ సేపు నిద్ర పోయినా అనారోగ్య సమస్యలు తప్పవని పలు అధ్యయనాల్లో గుర్తించారు.
- ఎక్కువ సమయం పడుకున్న వారు డిప్రెషన్ కు గురయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశోధనలలో తేలింది. అతినిద్ర వలన మెదడు పనితీరు కూడా దెబ్బతింటుంది. మెదడు పనితీరులో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి.
- పది గంటల కంటే ఎక్కువ సమయం పాటూ పడుకునే వారిలో, టైప్- 2 మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ సమయం పాటూ నిద్రపోవటం వలన గుండె సంబంధిత సమస్యలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు.
- నిద్రలేమి వల్ల డిప్రెషన్ కు గురి అవుతారనేది సాధారణంగా విషయం. అయితే అధిక నిద్ర వల్ల కూడా డిప్రెషన్ కు లోనవుతారని కొన్ని స్టడీస్ కనుగొనబడ్డాయి. కాబట్టి రెగ్యులర్ చాలా అవసరం.
- ఒంట్లో బాగాలేనప్పుడు లేదా ఏదైనా భాదలో ఉన్నప్పుడు నిద్రపోతే ఉపశమనం కలుగుతుంది. కాని ఎక్కువ సేపు నిద్ర నిద్రపోవడం వల్ల భాదను తగ్గించకపోగా పెంచుతుంది.
- ఎక్కువ సేపు పక్క మీద పడుకోవటం వల్ల వీపు భుజాల నొప్పి మెుదలవుతుంది. అతి నిద్రవల్ల తరచుగా తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి.
- అంతే కాదు అతి నిద్ర వల్ల మైగ్రేన్ తలనొప్పికి కారణమై మనలో ఆందోళన లెవెల్స్ ను పెంచుతుంది. అతి నిద్ర వల్ల శారీరక మానసిక సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి రోజు తగినంత సేపు నిద్ర పోవడం ఆరోగ్యానికి మంచిది.
వ్యక్తులను బట్టి ఎంత సేపు నిద్రపోవాలి అన్నది కూడా ఉంటుంది. కొంతమంది ఆరుగంటలు పడుకుంటే సరిపోతుంది. కొందరు తప్పనిసరిగా తొమ్మిది గంటలు నిద్రపోవాలి. అడల్ట్స్ రోజు ఏడు నుంచి ఎనిమిది గంటలు పడుకోవాలి. యుక్తవయస్సులో ఉన్నవారు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవాలి. ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల ఊబకాయం సమస్యలు వచ్చే అవకాశముంది. వయసు పైబడిన వారు పది గంటలకు మించి నిద్రపోవడం వల్ల వారిలో మతి మరుపు సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది.అతి నిద్రతో టెన్షన్ పెరుగుతుంది. అతి నిద్ర ఏకాగ్రతను దెబ్బతీస్తుంది.
అతి నిద్ర, మనిషి వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేస్తుంది. ఉద్యోగం చేసేవారికి అతి నిద్ర ఇంకా ప్రమాదకరం. ఎక్కువ సమయం నిద్రపోకుండా ఉండేందుకు ఏదైనా పనిచేసేలా ప్లానింగ్ చేసుకోవాలి. పనిచేస్తున్నప్పుడు నిద్ర ముంచుకురాగానే కాస్తా అటూఇటూ నడవాలి. శరీరాన్ని ఉత్తేజితపరిచే కాఫీ, టీ తీసుకోవడం వల్ల నిద్ర పోకుండా చూసుకోవచ్చు. మీరు ప్రతి రోజూ ఒకే సమయానికి పడుకోవడం, ఒక సమయానికి నిద్రలేవడం చాలా మంచిది. కనీసం సరైన టైమ్ కు నిద్ర లేవడం వల్ల మీరు ఎంత సేపు నిద్రపోయార్నది ఒక అంశంగా గుర్తించాల్సిన అవసరం లేదు.
ప్రతి ఒక్కరికీ నిద్ర చాలా అవసరం. ఎంత అవసరం అంటే ఆరోగ్యానికి మంచి చేసేంత వరకు మాత్రమే. మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి 7-8 గంటల నిద్ర సరిపోతుంది. అంతకు మించి నిద్రపోతే ఆరోగ్యసమస్యలు కొని తెచ్చుకున్నట్లే.. కాబట్టి మంచి నిద్ర ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. అతి నిద్ర అంత హాని కూడా చేస్తుందని గుర్తించుకోవాలి.