Salaar Release Date : ‘సలార్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ .. ఆరోజునే అంటున్న ప్రశాంత్ నీల్‌

By manavaradhi.com

Updated on:

Follow Us

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ (Prabhas) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సలార్‌’ అప్డేట్ అందింది. కొత్త పోస్టర్ తో అనౌన్స్ మెంట్ అందించారు మూవీ మేకర్స్. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో రానున్న ‘సలార్‌’ రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. డిసెంబర్‌ 22న ఈ చిత్రం విడుదల కానున్నట్లు తెలుపుతూ ట్వీట్‌ చేసింది. దీంతో ప్రభాస్‌ అభిమానులంతా తెగ సంబరపడుతున్నారు. అయితే దానికి ముందు రోజే షారుఖ్ ‘డుంకీ’ కూడా రిలీజ్ కానుంది. రాజ్‌ కుమార్ హిరానీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యే చాన్స్ ఉండగా.. ప్రభాస్, షారుఖ్‌కు జరిగే బ్యాటిల్‌లో గెలుపెవరిదో చూడాలి మరి. మరోవైపు సోషల్‌ మీడియాలో మూడు హ్యాష్‌ ట్యాగ్‌లు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ‘ఎక్స్‌’లో ప్రభాస్‌ ‘సలార్‌: సీజ్‌ఫైర్‌’ (#SalaarCeaseFire) హవానే కనిపిస్తోంది.

మొదట ఈ సినిమాను సెప్టెంబర్‌ 28న విడుదల చేయాలని భావించారు. దీంతో ఈ తేదీకి నెల రోజుల ముందే అభిమానులు రోజుకో పోస్టర్‌తో కౌంట్‌ డౌను కూడా మొదలుపెట్టారు. అయితే కొన్ని కారణాల వల్ల రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో వారంతా నిరాశపడ్డారు. తాజాగా డిసెంబర్‌ 22న రానుందని తెలుపుతూ వారిలో మరోసారి ఉత్సాహాన్ని నింపింది ‘సలార్‌’ టీమ్‌. ఇప్పటికే విడుదలైన టీజర్‌ విశేషంగా అలరించి సినిమాపై అంచనాలు పెంచింది. హీరోని ఎలివేట్‌ చేస్తూ ప్రముఖ నటుడు టీనూ ఆనంద్‌ చెప్పిన ‘సింపుల్‌ ఇంగ్లిష్‌’ డైలాగ్స్‌, యాక్షన్‌ విజువల్స్‌ ప్రేక్షకులతో అదరహో అనిపించాయి. 24 గంటల్లోపే 83 మిలియన్ల వ్యూవ్స్‌ను సొంతం చేసుకుని ఇది రికార్డును సృష్టించింది.

‘సలార్‌’ చిత్రంపై అటు అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే ‘కేజీఎఫ్’తో దర్శకుడు ప్రశాంత్ నీల్ సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు మరి. దీంతో ‘సలార్’ సినిమాపై ఊహాకు అందనంతగా అంచనాలున్నాయి. ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయిక. పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా నటించారు. శ్రియారెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది. రవి బర్సూర్ సంగీతం అందిస్తున్నారు.

1 thought on “Salaar Release Date : ‘సలార్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ .. ఆరోజునే అంటున్న ప్రశాంత్ నీల్‌”

Leave a Comment