జలుబు వచ్చిందంటే చాలు ఓ పట్టాన వదలదు. దీని వల్ల ప్రతీ ఒక్కరూ చాలా ఇబ్బందులు పడుతుంటారు. వాతావరణ మార్పుల ఫలితంగా విజృంభిస్తున్న రకరకాల వైరస్‌లు చాలాచోట్ల ఇంటిల్లిపాదిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. జలుబు మరియు ఫ్లూ రెండు చిన్న చిన్న ఇన్ఫెక్షన్లే అయినే త్వరగా వదిలిపెట్టవు. దీని వల్ల నిద్ర కూడా సరిగా పట్టదు… మరి జలుబు, జ్వరం ఉంటే కంటినిండా నిద్రపోయేదెలా?
జలుబు, ఫ్లూ రెండు వైరల్ ఇన్ఫెక్షన్ లే. గొంతు నొప్పి, ముక్కు కారటం, దగ్గు, అలసట, వంటివి రెండింటిలోనూ కనిపించే సాధారణ లక్షణాలు. నిజానికి సాధారణ జలుబు, ఫ్లూ జ్వరాలకు పెద్దపెద్ద చికిత్సలేం అవసరం లేదు. జలుబు అనేది ప్రధానంగా వైరస్ కారణంగా వచ్చే సమస్య. దీనికి రైనో వైరస్ వర్గానికి చెందిన ఎన్నో రకాల వైరస్‌లు కారణం కావచ్చు. పైగా ఈ వైరస్‌లు ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటూ ఉంటాయి. కొన్ని కొత్తగానూ పుట్టుకొస్తుంటాయి. అందుకే అందరినీ తరచూ జలుబు వేధిస్తూనే ఉంటుంది.
సాధారణంగా జలుబు ఒక వారం పాటు బాధిస్తుంది, తర్వాత చాలా వరకూ దానంతట అదే తగ్గిపోతుంది. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలి. తరచుగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు తప్పనిసరిగా నోటికి చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలి. సాధ్యమైనంత ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోవాలి. వేడినీళ్లలో ఉప్పు కలిపి పుక్కిలించి ఉమ్మివేయడం ద్వారా జలుబు, ఫ్లూ సమయాల్లో ఉపశమనంగా ఉంటుంది. ఇది శ్లేష్మ స్థరాన్ని శుభ్రపరిచే దిశగా పనిచేస్తుంది. నెమ్మదిగా గొంతునొప్పి, ముక్కు దిబ్బడ తగ్గించడం లో కీలకపాత్ర పోషిస్తుంది.
సాధారణంగా ఫ్లూజ్వరం వాతావరణంలోని తేమ శాతం ఎక్కువగా ఉన్నపుడు తొందరగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఫ్లూజ్వరం వాతావరణంలో మార్పు, రోగనిరోధక శక్తి తక్కువ ఉండటం, వర్షంలో తడవటం మరియు వైరస్ వలన వ్యాప్తి చెందుతుంది. ఫ్లూ వంటి లక్షణాలు కనపడినప్పుడు ఆవిరి పడితే చాలా చక్కటి రిలీఫ్‌ని పొందొచ్చు. అయితే ఇదేం కొత్త పద్దతి కాదు. చాలా మంది దీన్ని పాటిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు చక్కగా వెంటనే రిలీఫ్‌ని పొందుతారు. కేవలం కాసేపు ఆవిరి పట్టడం వల్ల ఫ్లూ, ముక్కు దిబ్బడ లక్షణాలను తొలగి పోతాయి. పైగా ఎంతో ఉపశమనంగా కూడా ఉంటుంది. దీంతో కొంచెం సులభంగా నిద్రపోవచ్చు.
వేడి ద్రవాలు తాగాలి. వేడి నీరు, వేడి ద్రవాలను కొద్ది కొద్దిగా తాగాలి. జ్వరం వచ్చినప్పుడు కూడా ఇలాగే చెయ్యాలి. గోరువెచ్చటి నీరు, గోరువెచ్చటి సూప్స్ తాగితే… వెంటనే ఉపశమనం కలుగుతుంది. పడుకునే ముందు వేడి స్నానం లేదా స్నానం చేయండి. జలుబు మరియు ఫ్లూ మందులను ప్రయత్నించండి. జలుబు మరియు ఫ్లూ లక్షణాల కోసం చాలా ఓవర్-ది-కౌంటర్ నైట్‌టైమ్ మందులు ఉన్నాయి.
జలుబు మరియు ఫ్లూ ల నుండి ఉపశమనం పొందుటకు ఎంత ప్రయత్నించినా, విశ్రాంతి లేనిదే ఫలితం పొందలేరు. గోరువెచ్చగా ఉండే నీరు గొంతు భాగంలో కలిగే ఇన్‌ఫక్షన్‌ను తగ్గిస్తుంది. రోజు మొత్తం వేడిగా ఉండే నీటిని తరచుగా తాగటం వలన జలుబు నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. మద్యం సేవించవద్దు. ఖచ్చితంగా, ఇది మగతను కలిగించవచ్చు. కానీ ఇది వాస్తవానికి రాత్రి సమయంలో ఎక్కువ మేల్కొనేలా చేస్తుంది. అంతేకాదు జలుబు లేదా ఫ్లూ మందులతో చెడుగా స్పందించవచ్చు.
జలుబు, జ్వరం ఉంటే ఒంటరిగా పడుకోండి. అనారోగ్యంతో ఉన్నప్పుడు, భాగస్వామికి దూరంగా నిద్రపోవడం మంచిది. ఆ విధంగా, అనారోగ్యం వ్యాప్తి చెందే ప్రమాదం లేదు. నిద్ర రాకపోతే ఇంకేదైనా ప్రయత్నించండి. కుర్చీలో కూర్చుని కొద్దిసేపు చదవండి. సంగీతం వినండి. అప్పుడు మీరు నిద్రపోతున్నట్లు అనిపించినప్పుడు తిరిగి పడుకోండి.
సాధారణంగా శీతాకాలంలో జలుబు లేదా రొంప వంటి అనేక అలర్జీ సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యలను రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగుతుండాలి. చెడు కొలస్ట్రాల్ అధిక శాతం పెరగడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోయి అనారోగ్య రుగ్మతలకు దారితీస్తాయి. రోజు వేడినీళ్లు తాగడం ద్వారా హైడ్రేట్‌గా ఉండొచ్చు.