Snoring tips:గురక సమస్యతో బాధపడుతున్నారా..! చిన్నపాటి జాగ్రత్తలతో దీని బారి నుండి బయటపడవచ్చు

By manavaradhi.com

Updated on:

Follow Us
snoring tips

ప్రతి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదో ఒక పనిలో మునిగిపోయి అలసి పోతుంటాము. అలాంటి సమయంలో సాయంత్రం అయ్యే సరికి హాయిగా నిద్రపోవాలి. తగిన విశ్రాంతిని తీసుకోవాలని ప్రతి ఒక్కరి మనస్సుకు అనిపిస్తుంది.. ఇలాంటప్పుడు గురక పెట్టడం అనే చిన్న సమస్య మనలను భాదకు గురిచేస్తే ? మనకు తెలియకుండానే మన సమస్య ఇంకొకరిని బాధిస్తుందని మనకు తెలిస్తే మన మనస్సు చివుక్కుమంటుంది. అసలు ఈ గురక అనేది ఎందుకు వస్తుంది.

గురక అనేది సాధారణమైన సమస్య. కాని ఇది మనిషి అనారోగ్యాన్ని సూచిస్తుంది.. నిద్రలో గాని పీల్చుకుంటున్నపుడు కొండ నాలుకతో పాటు అంగటిలోని మెత్తని భాగం కూడా గాలి పీల్చుకోలేని సందర్భాల్లో నోటితో గాలి పీల్చడం వలన ఈ గురక అనేది శబ్ధం రూపంలో బయటికి వినిపిస్తుంది. ఈ గురక అనేది రెండు రకాలుగా కనిపిస్తుంది.
(1) నోరు మూసి గురక పెట్టడం
(2) నోరు తెరచి గురక పెట్టడం

నోరు తెరచి గురక పెడుతుంటే దానికి కారణం నాలుక. ఒక వేళ నోరు మూసి గురక పెడుతుంటే దానికి కారణం గొంతు కణాలలో ఉండే సమస్యగా గుర్తించాలి. మనం నిద్ర పోతున్నపుడు ముక్కుతో గాలిని పీల్చుతుంటాం. ఇలా ముక్కుతో గాలిని పీల్చడంలో ఇబ్బంది ఎదురైతే మనకు తెలియకుండానే నోటి ద్వారా శ్వాసను తీసుకుంటూ ఉంటాం.. ఇలాంటి సమయాలలో శ్వాసకోశం సంకోచ, వ్యాకోచాలకు గురై నాలుక, అంగటిని నియంత్రించే కండరాలు వాటి నియంత్రణలో విఫలం అయినపుడు ఈ గురక వస్తుంది.

నిద్ర మాత్రలు వాడే అలవాటున్నవారిలో, సిగరెట్ తాగే వారిలో, మత్తు పానీయాలు తీసుకునే వారిలో ఈ గురక ఎక్కువగా వస్తుంది. అంతేకాదు ముక్కు రంధ్రాలు సరిగా పనిచేయక పోయినా, ముక్కుకు సంబందించిన సమస్యలు ఏమైనా ఉన్నా ఈ గురక వస్తుంది.. ఈ సమస్య పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ గురక వలన ఆక్సిజన్ సరిగా ఊపిరితిత్తులకు చేరక, ఈ గురక యొక్క ప్రభావం ఊపిరతిత్తులు, గుండె, రక్తప్రసరణ మీద కూడా పడుతుంది… రాత్రి సమయంలో 7 గంటల నిద్రలో కనీసం 30 సార్లు, 10 సెకన్స్ కాలం పూర్తిగా శ్వాస ఆగిపోతే దానిని స్లీప్ ఆప్నియా సిండ్రోం అంటారు.
1.గురక రావడం
2.తెల్లవారు జామున తలపోటు రావడం
3.పగటి వేళలలో నిద్ర రావడం
4.పని మీద ఏకాగ్రత లేకపోవడం
5.వ్యక్తిత్వంలో మార్పులు
6.రాత్రి సమయాలలో ఎక్కువగా మూత్రం రావడం
7.హై బి.పి లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి

సాధారణంగా ఈ గురక సమస్యతో బాధపడుతున్నవారు.. చిన్నపాటి జాగ్రత్తలను తీసుకోవడం వలన కొంత వరకు దాని బారి నుండి బయటపడవచ్చు..
*ఈ గురక సమస్య ఉన్నవారు ఓ పక్కకు తిరిగి పడుకోవడం అలవాటు చేసుకోవాలి.
1.ఎత్తుగా ఉన్న దిండును పెట్టుకోవాలి.
2.స్థూలకాయులు బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.

  1. నిద్ర పోయే ముందు ఆవిరి పట్టుకోవాలి…
    4.నిద్రపోయే ముందు తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి.
    5.డైరీ ఉత్పత్తులు, కేక్స్, కుకీస్, పిజ్జా వంటి ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి.

ఈ గురక సమస్య అనేది ఇంకా అధికమౌతుందని శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది.. అందుకే లేనిపోని అపోహలతో ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోకుండా తగిన జాగ్రత్తలను పాటిస్తే ఆరోగ్యంగా జీవించడం చాలా సులభం అని గ్రహించాలి.

Leave a Comment