తిరుమల: తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి నారా లోకేశ్, సింగపూర్ మంత్రి షణ్ముగం కలిసి దర్శించుకున్నారు. మంగళవారం వేకువజామున వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన వారు.. శ్రీవారి సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన సేవల్లో పాల్గొన్నారు.
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు నారా లోకేశ్, షణ్ముగంలకు ఆశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థప్రసాదాలతో పాటు శ్రీవారి చిత్రపటాన్ని వారికి అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లు, సేవల వివరాలను వారికి వివరించారు.







