ఉరుకుల పరుగుల జీవితం..ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకొనే వరకు బిజీ బిజీగా గడుపుతుంటారు. దీంతో వారు కొంత మానసిక వత్తిడికి గురవుతుంటారు. మరి అలాంటప్పుడు రోజంతా ఆహ్లాదంగా..ఉల్లాసంగా ఉండాలంటే.. మనం తీసుకోనే ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల శరీరం రోజంతా చురుగ్గా మారుతుంది. శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. ఎలాంటి ఆహారాలను తీసుకోవడం ద్వారా ఉత్సాహంగా ఉండవచ్చు.
శరీరానికి మంచి విటమిన్లు, ఖనిజ లవణాలు, మాంసకృత్తులు లభించాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి. మనం ఏ పని చేయాలన్నా శక్తి అవసరం. మరి మనకు శక్తి ఎక్కడి నుంచి లభిస్తుంది. తీసుకున్న ఆహారం జీర్ణమై.. గ్లూకోజ్ గా మారి శరీరంలో ప్రతి అవయవానికి శక్తినిస్తుంది. శరీరానికి కావాల్సిన శక్తినిచ్చేవి కార్బొహైడ్రేట్లు. 70 నుంచి 80 శాతం కేలరీలు కార్బొహైడ్రేట్ల ద్వారానే అందుతున్నాయి. ముడి ధాన్యాలైన బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి వాటి ద్వారానూ కార్బొహైడ్రేట్లు లభిస్తాయి. పైగా వీటిలో ఫైబర్ ఉండడం వల్ల జీర్ణశక్తికి తోడ్పడుతుంది.
కొందిరిలో ఆందోళన ఎక్కువగా ఉంటుంది. కాఫీలోని కెఫిన్ మెదడులోని కర్టిసోల్ హార్మోన్ల మెరుగుపరిచి ఆందోళనను తగ్గిస్తుంది. కాఫీ మనిషిలో త్వరగా స్పందించే గుణాన్ని, ఆలోచించే సామర్ధ్యాన్ని పెంపొందిస్తుంది. అంతేకాకుండా నిస్సత్తువను మాయం చేసి దాని స్థానంలో ఎంతో ఉత్సాహాన్ని కలుగజేస్తుంది. డార్క్ చాక్లెట్ లో మీ మానసిక స్థితి మరియు జ్ఞానపరమైన ఆరోగ్యం మీద అనుకూల ప్రభావాన్ని కలిగించే అనేక రసాయన సమ్మేళనాలు కలిగి ఉంది . చాక్లెట్ మెదడులో ఎండర్పియన్ ను ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. సో, డార్క్ చాక్లెట్ తినడం వల్ల మిమ్మల్ని సంతోషంగా ఉండేలా చేస్తుంది.
శరీరం ముందుకు నడవడానికి కాస్త చక్కెర స్థాయి అవసరం. ఇవి తగ్గినప్పుడు మెదడు సరైన విధంగా పని చేయదు. అందుకే మధ్యాహ్నం కాస్తంత చిరుతిళ్ళను తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. ప్రొటీన్ మిళితం చేసిన స్నాక్స్ తీసుకోవడం, తాజా పండ్లు లాంటివి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి చక్కగా ఉంటుంది. సాధారణంగా తీసుకొనే ఆహారం జీర్ణమవడం, శక్తినివ్వడం జరగడానికి కొంత సమయం పడుతుంది. ప్రక్రియను పూర్తిగా శరీరం నిర్వహించలేని స్థితిలో పళ్ళరసాలు తేలికగా అదేశక్తినిస్తాయి. పళ్ళరసాలలో ఉండే 95 శాతం పోషకాలను శరీరం సులువుగా గ్రహించగలుగుతుంది. అలాగే నిమ్మరసం తీసుకుంటే మంచిది. శరీరాన్ని రిఫ్రెష్ చేయటంతో పాటు ఎనర్జీ లెవల్స్‌ను పెంచుతుంది.
తక్షణ శక్తికి స్ట్రాబెర్రీ పండును మించింది లేదు. అధికమైన పీచు, అధిక ఎనర్జీ, అధిక విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అన్నీ కలబోసిన ఈపండు తక్షణ శక్తినిస్తుంది. నరాలను జివ్వును ఉత్తేజపరచాలంటే గ్రీన్ టీ ఎంతో మంచిది. సాధారణ కాఫీ, టీల కంటే గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుంటాయి. లోపలి భాగాలను శుభ్రపరచి అధికమైన శక్తినివ్వటంలో గ్రీన్ టీ ని మించిన పానీయం లేదు.
ఒక్కోవ్యక్తికి ఒక్కో రకంగా పౌష్టికాహారం అవసరమౌతుంది. ఏదైనా సరే ఆహారాన్ని మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా తీసుకోవాలి. ప్రతిరోజూ ఒకే నిర్ణీత సమయానికి భోజనం చేయాలి. ఇలా చేస్తే మన శరీరంలో జీవక్రీయలన్ని సక్రమంగా జరుగుతాయి.మనం తీసుకోనే ఆహారంలో ఖచ్చితంగా కోన్ని ఆహార నియమాలను పాటించాలి. తీపిపదార్థాలు, వేపుడు పదార్థాలు వీలయినంత వరకు తగ్గించుకోవాలి. తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తినాలి. గంటకు ఒకసారి కొంతకొంత తినడం ఉత్తమం. దీనిద్వారా అసిడిటీకి దూరంగా ఉండవచ్చు. ఆహారంలో ఎక్కువగా సలాడ్స్ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల ఏదైనా జీర్ణంకాని పదార్థాలు మీ జీర్ణవ్యవస్థను ఇబ్బంది పెడుతుంటే ఈ సలాడ్స్ ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తాయి.
కడుపు నింపుకోవడానికి కాకుండా శరీరానికి శక్తిని అందివ్వడానికి మనం ఆహారం తీసుకోవాలి. వాతావరణ, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆహారం తీసుకోవాలి. బ్యాలెన్సింగ్ ఫుడ్ అన్నీ విధాలా శ్రేయస్కరం. మనం నిత్యం తీసుకునే ఆహారం, విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేడ్లు.. ఇలా అన్నీ సమపాళ్లలో ఉండాలి. తీసుకునే ఆహారం ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు. కాలానుగుణంగా వచ్చే పండ్లూ, కూరగాయలు ఎంచుకోవాలి. దీని పట్ల అవగాహన కలిగి ఉండడం ద్వారా, మన సంప్రదాయ ఆహారాలతోనూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ .. ఉత్సాహాంగా ఉండవచ్చు. తీసుకునే ఆహారం ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు. కాలానుగుణంగా వచ్చే పండ్లూ, కూరగాయలు ఎంచుకోవాలి.