మన చుట్టూ నిరంతరం బోలెడన్ని హానికారక సూక్ష్మక్రిములు తిరుగుతుంటాయి. ఎప్పుడైనా వాటి బారినపడే ప్రమాదముంది. దీంతో రకరకాల ఇన్ఫెక్షన్లు, జబ్బులు దాడిచేస్తాయి. అయితే మనలో రోగనిరోధక శక్తి బలంగా ఉందనుకోండి. అవేమీ చేయలేవు. వ్యాయామం, మంచి జీవనశైలి మాత్రమే కాదు… కొన్నిరకాల ఆహార పదార్థాలు కూడా రోగనిరోధకశక్తి పుంజుకోవటానికి తోడ్పడతాయి.
మనం నిత్యం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది. మన శరీరంలో వివిధ అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే సరైన ఆహారం మరియు ఆరోగ్యం అవసరం. అలాగే అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోదక శక్తి అవసరం. మంచి రోగనిరోదక శక్తి ఉంటే వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువ. మన శరీరంలో విషాపద్ధాలను బయటకు పంపటానికి మరియు వ్యాధుల మీద పోరాటం తెల్ల రక్త కణాలు చేస్తాయి. అందువల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి.
మన శరీరంలో జరిగే విధులకు రోగనిరోదక శక్తితో సంబంధం ఉంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే తరచుగా జలుబు, జ్వరం, అలర్జీల బారిన పడుతూ ఉంటారు. అందువల్ల రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు నిత్యం తీసుకుంటూ ఉండాలి.
రోగనిరోదక శక్తిని పెంచే ఆహారాలు ఏంటి…?
లోపల ఎర్రటి గుజ్జుతో చూడగానే నోరూరించే పుచ్చకాయలో నీటిశాతం ఎక్కువ. ఇందులో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ కూడా దండిగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లు, జబ్బులు రాకుండా కాపాడుతుంది. దాదాపు అన్నికాలాల్లోనూ దొరికే క్యాబేజీలో ఉండే గ్లుటమైన్ రోగనిరోధకశక్తి పుంజుకోవటానికి ఎంతగానో తోడ్పడుతుంది. కాబట్టి దీన్ని కూరగానో సలాడ్గానో తరచుగా తీసుకోవటం అలవాటు చేసుకుంటే మంచిది.
మారుతున్న కాలానికి తగ్గట్టు సరైన పోషకాహారం తీసుకోవాలి. విటమిన్లు, మినరల్స్, పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకుంటే.. శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తి అందుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. ఇవి వైరస్‌పై పోరాడి ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా కాపాడుతాయి. టమాట, బంగాళదుంప, నారింజ, నిమ్మ, కమలా, కివి వంటి వాటిలో విటమిన్ సి ఎక్కువ మోతాదులో ఉంటుంది. క్యారెట్ కంటికే కాదు రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. నిత్యం అరకప్పు తాజా క్యారెట్‌ను తీసుకోవడం వల్ల ఇందులో ఉండే బీటా కెరోటిన్, విటమిన్ బి6లు యాంటీ ఆక్సిడెంట్లను ఉత్తేజపరుస్తాయి.
ఎంతో రుచికరంగా ఉండే పెరుగును చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ పెరుగును ప్రతిరోజూ ఒక కప్పు తీసుకోవాలి. ఇది జీర్ణాశయంలో ఉండే బాక్టీరియాను నిర్మూలిస్తుంది. ఐరన్ శరీరానికి చాలా అవసరం. రోజూ నాలుగు లేదా ఐదు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల శరీరానికి సరిపడా ఐరన్ అందుతుంది. గ్రీన్ టీలో రోగనిరోదక శక్తిని పెంచటానికి యాంటీఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. గ్రీన్ టీ శరీరంలో ప్రతి అవయవం పనితీరు బాగుండేలా రోగనిరోదక శక్తిని పెంచుతుంది.
యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే ఆహారాలు ఏవి ?
పుట్టగొడుగులలో విటమిన్ బి,ప్రోటీన్,ఫైబర్ మరియు ఇతర ఖనిజాలు ఉండటం వలన రోగనిరోదక శక్తిని పెంచుతాయి. శరీరం కోల్పోయిన యాంటీ ఆక్సిడెంట్స్ తిరిగి ఏర్పడటానికి జింక్ బాగా తోడ్పడుతుంది. కోడిగుడ్లు, మాసం, పెరుగు, పాలు, బీన్స్ తోపాటు సీఫుడ్‌లలో జింక్ లభిస్తుంది. ప్రతి వంటకానికి రుచితో పాటు.. సువాసనను అందించే వెల్లుల్లిని నిత్యం తీసుకోవడం మంచిది. దీనిలో ఉండే మినరల్స్ బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్ఫెక్షన్లపై పోరాడేలా చేస్తాయి. మీ డైట్ లో వెల్లుల్లిని చేర్చుకుంటే ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.
పసుపును ఎక్కువుగా వివిద రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. ఇందులో అనేక రకాల ఔషద గుణాలు కూడా ఉన్నాయి. శరీరంలో రకాల దోషాలను ఇది నియంత్రిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను మెరుగ్గా పని చేసేలా చేస్తుంది. బాదంపప్పుల్లో విటమిన్ ఎ, సి, ఇలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణను అందిస్తాయి.
మనకు పండ్ల ద్వారా పొటాషియం అందుతుంది. అరటిపండు, ఆప్రికాట్ వంటి పండ్లలో ఎక్కువ మోతాదులో పొటాషియం ఉంటుంది. కాబట్టి వీటిని నిత్యం తీసుకోవడం వల్ల అధిక రక్తపోటుని తగ్గించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
సరైన పోషకాహారం తీసుకోవడాన్నే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అంటారు. లీన్ ప్రోటీన్, పిండి పదార్థాలు, కొవ్వులను సమానంగా తీసుకోవాలి. వీటన్నింటినీ బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. దీంతో శరీరం బలంగా తయారవుతుంది.. వ్యాధులు దూరం అవుతాయి.