How to Prevent Ashtma : ఆస్తమాకు దూరంగా ఉండాలంటే ఏం చేయాలి ?

By manavaradhi.com

Published on:

Follow Us
How to Prevent Ashtma

ఆస్తమా.. ఈ శ్వాసకోశ వ్యాధితో .. ప్రపంచవ్యాప్తంగా 23 కోట్ల 50 లక్షల మంది బాధపడుతున్నారు. అంటే .. జబ్బు ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణ జలుబు.. శ్వాసకోశ ఇబ్బందులతో మొదలై.. దీర్ఘకాళిక రోగంగా పరిణమిస్తుంది. కొంత మందిలో వ్యాధి తీవ్రత ముదిరే వరకు .. కూడా వారికి ఉబ్బసం వ్యాధి ఉన్నట్లు అవగాహన ఉండదు. సాధారణంగా వాతావరణ మార్పుల వచ్చే సమస్యే అని తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. శ్వాసకోశ నాళాలు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ల కారణంగా ఆస్తమా వ్యాధి వస్తుంది.

ఉఛ్వాశ.. నిశ్వాసాలు చేస్తున్న సమయంలో గాలిలోని కొన్ని రకాల బ్యాక్టీరియా లేదా వైరస్ లు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. అలాంటప్పుడు వాటిని ఎదుర్కునేందుకు మన శరీరం కూడా కొన్ని యాంటీబాడీలను విడుదల చేస్తుంది. ఐతే యాంటీబాడీల కంటే .. వైరస్ ప్రభావం ఎక్కువైనప్పుడు .. శ్వాసనాళాలు ఇన్ఫెక్షన్ కు గురవుతాయి. దీంతో శ్వాస నాళాలు కుంచించుకుపోయి.. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఆస్తమా ఉన్న వారిలో తరుచూ ఆయాసం , పిల్లికూతలు, దగ్గు, ఛాతీ బరువుగా అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంత మందిలో తరుచూ తుమ్ములు రావడం, ముక్కునుంచి నీరు కారడం, కొద్దిపాటి వాతావరణ మార్పులు రాగానే జలుబు చేయడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి… ఆస్తమా వ్యాధికి కారణాలు చాలానే ఉన్నప్పటికీ వాటిలో ప్రధానంగా జన్యుసంబంధిత కారణాలు ఎక్కువని చెప్పుకోవచ్చు. అంటే .. ఇది ఓ వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి అన్నమాట. దీంతోపాటు వాతావరణ పరిస్థితులు, ఇంటిలోపల, బయటా కాలుష్యం కూడా కారణం కావచ్చు. ముఖ్యంగా.. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో, పిల్లల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

ఈ వ్యాధికి ఇప్పటి వరకు సరైన చికిత్స అందుబాటులో లేదు. అందుకే వ్యాధి నివారణ ఒక్కటే మార్గమని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే జబ్బు నివారణ కోసం .. ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. 1998లో ఇందుకోసం గ్లోబల్ ఇనీషియేటివ్ ఫర్ ఆస్తమా అనే సంస్థ రూపొందింది. ఏటా ఈ సంస్థ.. అస్తమాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఏటా మే నెల తొలివారంలోని మంగళవారం రోజున ప్రపంచవ్యాప్తంగా ఆస్తమాపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది స్టాప్ ఫర్ ఆస్తమా అనే థీమ్ తో అవగాహన నిర్వహిస్తోంది. STOP.. అంటే . . సింప్టమ్ ఎవాల్యుయేషన్, టెస్ట్ రెస్పాన్స్, అబ్జర్వ్ అండ్ అసెస్, ప్రొసీడ్ టు అడ్జస్ట్ ట్రీట్ మెంట్ అన్నమాట. అంటే వ్యాధికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం .. పరీక్షలను క్షుణ్నంగా పరిశీలించడం.. వ్యాధి తీవ్రతను అంచనా వేయడం ఆ తర్వాత చికిత్సకు ఉపక్రమించడం అనేది ఈ ఏడాది థీమ్ గా చెప్పవచ్చు.. .

ఆస్తమా డే నిర్వహించడం ద్వారా .. రోగులకు తమ జబ్బు పట్ల పూర్తి అవగాహన వస్తుందని గ్లోబల్ ఇనీషియేటివ్ ఫర్ ఆస్తమా సంస్థ చెబుతోంది. దీని వల్ల ఉబ్బసం వ్యాధిని నియంత్రించుకోవడం .. జాగ్రత్తలు పాటించడం ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించుకునే అవకాశం ఉంటుందంటున్నారు.

Leave a Comment