Nara Lokesh : ప్రతి ఒక్క తెలుగువాడూ ఆంధ్రప్రదేశ్‌కు ఒక ‘బ్రాండ్ అంబాసిడర్’

By manavaradhi.com

Published on:

Follow Us
LokeshinSouthKorea

Nara Lokesh : దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరిగిన తెలుగు డయాస్పోరా (ప్రవాస తెలుగువారి) ప్రత్యేక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, విదేశాల్లో స్థిరపడిన ప్రతి ఒక్క తెలుగువాడూ ఆంధ్రప్రదేశ్‌కు ఒక ‘బ్రాండ్ అంబాసిడర్’ అని కొనియాడారు. “మీరు సాధించే ప్రతి విజయం, మీరు ప్రారంభించే ప్రతి వ్యాపారం ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో గర్వకారణం. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మన రాష్ట్ర అభివృద్ధి గాథను, ఇక్కడి అవకాశాలను చాటిచెప్పాలి” అని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఏ రంగంలోనైనా కలిసి పనిచేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న లోకేష్.. అత్యంత వేగవంతమైన అనుమతులు, పారదర్శకమైన పాలనతో నిజాయితీ గల ప్రతి పెట్టుబడిదారుడికీ, ఆవిష్కర్తకూ స్వాగతం పలుకుతామని స్పష్టం చేశారు.

Leave a Comment