stomach bloating: కడుపు ఉబ్బరంగా ఉంటుందా?..కారణాలు..ఎలా తగ్గించుకోవచ్చు?

By manavaradhi.com

Published on:

Follow Us
stomach bloating

కడుపుబ్బరం అనేది నేడు ఎంతోమందిని వేధిస్తున్న సమస్య. ఈ సమస్య తలెత్తడానికి మలబద్ధకం, గాలిని మింగడం, సరిగ్గా లేదా సరైన సమయానికి తినకపోవడం వంటి చాలా కారణాలు ఉంటాయి. వీటితోపాటు మనం తరచూ తినే ఆహార పదార్థాలు కూడా బ్లోటింగ్ సమస్యకు దారితీస్తాయి. ముఖ్యంగా కాలీఫ్లవర్, క్యాబేజీ, ముల్లంగి, చక్కెర, పిండి పదార్ధాలు వంటి ఆహార పదార్థాలు తినడం వల్ల బ్లోటింగ్ సమస్య వస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కొన్ని ఆహార పదార్థాలు తరచూ తినడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని సూచిస్తున్నారు.

కడుపు ఉబ్బరం చాలామంది నిశ్శబ్దంగా అనుభవిస్తూ బాధపడే సమస్య. చెప్పుకోడానికి ఒకింత ఇబ్బంది పడే విషయం కూడా. రోజూ తీసుకునే మోతాదుకంటే ఎక్కువగా ఆహారం తినడం. ఎక్కువగా నమలకుండానే గబగబా ఆహారాన్ని మింగేయడం. కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం.అసిడిక్‌ నేచర్‌ ఎక్కువగా ఉండే ఆహారాలైన నిమ్మ జాతి పండ్లు, పుల్లగా ఉండే పండ్లు, కూల్‌డ్రింక్స్‌లో కార్బొనేటెడ్‌ కోలా డ్రింక్స్‌ ఎక్కువగా తాగడం, కెఫిన్‌ ఎక్కువగా ఉండే కాఫీ, కొన్ని సందర్భాల్లో టీ ఎక్కువగా తాగడం వంటి అంశాలన్నీ కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తాయి.

పైనాపిల్‌లో పుష్కలంగా లభించే డైజెస్టివ్ ఎంజైమ్‌లు.. ప్రోటీన్లు, పిండి పదార్ధాలు తేలిగ్గా అరిగేలా చేస్తాయి. కివి పండ్లలో ఉండే లక్స్జెటివ్ లక్షణాలు కడుపులోని ఆహారాన్ని స్మూత్ గా తయారయ్యేలా చేస్తాయి. బొప్పాయి కూడా అజీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. ఈ పండ్లను తరచూ తినడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడి కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

కడుపు ఉబ్బరానికి కారణాలు ఏంటి..?

కడుపు ఉబ్బరం సమస్యను తగ్గించడంలో పసుపు ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో కర్కుమిన్ అనే సమ్మేళనం బాగా ఉంటుంది. ఇది అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. ఉబ్బరాన్ని తగ్గిస్తుందని కొన్ని అధ్యాయనాలు చెబుతున్నాయి. జీర్ణవ్యవస్థలోని కండరాలను సడలించడానికి పిప్పరమింట్ క్యాప్సూల్స్ సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది కడుపు ఉబ్బరం నుండి ఉపశమనం పొందడానికి గ్యాస్‌ని నెట్టడానికి సహాయపడుతుంది.

టమోటాలతో కూడిన ఆహారం శరీరమంతా యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేసే యాంటీఆక్సిడెంట్ అయిన లైకోపీన్‌పై మిమ్మల్ని లోడ్ చేస్తుంది. టొమాటోలలో పొటాషియం కూడా ఉంది, ఇది మీ శరీరంలో ఉబ్బరం కలిగించే సోడియం స్థాయిలను తగ్గిస్తుంది. ప్రోబయాటిక్‌ డ్రింక్స్‌ కడుపుబ్బరాన్ని తగ్గిస్తాయి. అది కుదరకపోతే తాజా మజ్జిగ తీసుకోవచ్చు. అయితే కొందరికి పెరుగు కూడా కడుపుబ్బరం, గ్యాస్‌ తగ్గిస్తుంది.

పెరుగులోని లాక్టోబాసిల్లస్,బైఫిడోబ్యాక్టీరియమ్‌ అనే మేలు చేసే బ్యాక్టీరియా కడుపులోని ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. క‌డుపు ఉబ్బ‌రం సమస్య నుంచి బయటపడెందుకు ముందుగా మ‌నం తీసుకొనే ఆహారాన్ని నెమ్మ‌దిగా న‌మిలి తిన‌డం అల‌వాటు చేసుకోవాలి. ఆహారం తీసుకునే సమయంలో గాలి ఎక్కువగా నోట్లో పోకుండా చేయడం వల్ల చాలావరకు గ్యాస్‌ సమస్య అధిగమించవచ్చు. తినే సమయంలో మెల్లగా, నింపాదిగా తినాలి. పెదవులు మూసి తినడం మంచిది.

పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయాలి. సోడాలు, కూల్‌డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. జ్యూస్‌ రూపంలో కాకుండా పండ్లను కొరికి, నమిలి తినాలి. గ్యాస్‌ ఉండే ఆహారాలను పరిమితంగా తీసుకోవడం మంచిది.

Leave a Comment