భయపెట్టేలా నరేశ్‌ కొత్త సినిమా : 12A Railway Colony

By manavaradhi.com

Published on:

Follow Us
12A Railway Colony

హైదరాబాద్‌: నరేశ్‌ (Naresh) హీరోగా నాని కాసరగడ్డ దర్శకత్వంలో కొత్త సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈసినిమా టైటిల్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘12ఎ రైల్వే కాలనీ’ అనే పేరు ఖరారు చేసినట్లు టీమ్‌ తెలిపింది. అల్లరి నరేశ్‌ తో అనగానే సహజంగా హారర్ కామెడీ అనుకుంటారు. కానీ ఇది చెమటలు పట్టించే హారర్ మూవీ అని తాజాగా విడుదల చేసిన టైటిల్ గ్లిమ్స్ చూస్తే అర్థమౌతోంది.‘‘ఈ ఆత్మలు కొంతమందికే ఎందుకు కనిపిస్తాయి. అందరికీ ఎందుకు కనిపించవు’’ అనే డైలాగ్స్‌తో మొదలైన ఈ టీజర్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ‘‘ప్రాణాలతో బయటకు పోవుడు అవసరం లేదన్న…!’’ అంటూ టీజర్‌ చివర్లో నరేశ్‌ చెప్పే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి.

ప్రముఖ నిర్మాత శ్రీనివాస చిట్టూరి (Srinivasaa Chitturi) ప్రొడ్యూసర్ గా పవన్ కుమార్ సమర్పణలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ‘పొలిమేర (Polimera) పొలిమేర -2’ చిత్రాల దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ (Dr Anil Vishwanath) ఈ మూవీకి షో రన్నర్. ‘పొలిమేర, పొలిమేర -2’ చిత్రాలలో నాయికగా నటించిన డాక్టర్ కామాక్షి భాస్కర్ల (Dr Kamakshi Bhaskarla) ఇందులో హీరోయిన్. అనిల్ విశ్వనాథ్ ఆమెతో వరుసగా చేస్తున్న మూడో చిత్రం ఇది. అయితే ఈ సినిమాకు ఆయన షో రన్నర్ గా వ్యవహరించడంతో పాటు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. నాని కాసరగడ్డ దీనికి డైరెక్టర్ కమ్ ఎడిటర్.

Leave a Comment