Potassium Rich Foods – పొటాషియం అధికంగా లభించే ఆహారాలు ఇవే!

By manavaradhi.com

Published on:

Follow Us
Potassium Rich Foods

పొటాషియం ఉన్న ఆహారం తీసుకుంటున్నారా.. అవును రోజూ పొటాషియం ఉన్న ఆహారం డైట్ లో చేర్చుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. పొటాషియం శ‌రీరానికి కావాల్సిన స్థాయిలో అందితే గుండెజబ్బులు, రక్తపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం త‌క్కువ‌గా ఉంటుంది. అధిక రక్తపోటుతో భాదపడుతున్నవారు పొటాషియం ఎక్కువ తీసుకోవడం మంచిదని పరిశోధనలు చెబుతున్నాయి. పొటాషియం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏవి… అలాగే ఇది మనకు ఎక్కువగా ఏయే ఆహారాల్లో లభిస్తుంది..!

మనం నిత్యం తీసుకునే అనేక రకాల ఆహారాల్లో ఎన్నో విటమిన్లు, మినరల్స్ ఉంటాయని అందరికీ తెలిసిందే. అలాంటి పోషకాల్లో పొటాషియం కూడా ఒకటి. ఇది మన శరీరంలో అనేక పనులను నిర్వర్తించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కండరాల కదలికలకు, నరాలు ఆరోగ్యంగా ఉండాలన్నా, ద్రవాలు నియంత్రణలో ఉండేందుకు పొటాషియం అవసరం అవుతుంది. కాగా నేటి తరుణంలో చాలా మంది సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం వల్ల వారిలో పొటాషియం లోపం వస్తున్నది. దీంతో వారు పలు అనారోగ్యాల బారిన కూడా పడుతున్నారు. పొటాషియం అధికంగా ఉండే ఆహారాల‌ను నిత్యం తీసుకోవ‌డం వల్ల వీటిని నుంచి బయటపడవచ్చు.

పొటాషియం ఎక్కువగా లభించే ఆహారాలు ఏవి ?

  • మన శరీరానికి అత్యవసరమైన మూలకాలలో పొటాషియం ఒకటి. శరీరంలో పొటాషియం తగ్గితే గుండె, మూత్రపిండాలు, మెదడు, కండరాలు మొదలైన అవయవాలు పనితీరు దెబ్బతింటుంది. వీటి పనితీరు సరిగా ఉండాలంటే.. పొటాషియం అవసరం తప్పనిసరి.
  • ఒక సాధారణ అరటిపండులు 422 మిల్లి గ్రాముల పొటాషియం ఉంటుంది. అరటిపండును అలాగే తినేకంటే ఓట్స్ లేదా పెరుగుతో కలిపి తీసుకుంటే మంచిది. పొటాషియంతో పాటు అరటిపండులా ఫైబర్, విటమిన్ బి6, విటమిన్ సి, ఐరన్ వంటి మూలకాలు కూడా ఉంటాయి.ఇవి శరీరానికి వివిధరకాలుగా ఉపయోగపడతాయి.
  • ఆకుపచ్చని కూరగాయలు ఆరోగ్యానికి మంచివనే సంగతి తెలుసు. ఎక్కువ పోషకాలు కలిగిన ఆకుకూరల్లో పాలకూర ముందు వరసలో ఉంటుంది. ఒక కప్పు పాలకూరలో 837 మిల్లీగ్రాముల పొటాషియం లభిస్తుంది. పాలకూరను తగిన మోతాదులో, వివిధరకాల పదార్ధాలతో కలిపి తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకపదార్ధాలు లభిస్తాయి.
  • స్వీట్ పొటాటోలో కూడా మనకు తగినంత పొటాషియం లభిస్తుంది. స్వీట్ పొటాటోను ఉడికించి, పచ్చిగా లేదా సూప్ లా తీసుకోవచ్చు. స్వీట్ పొటాటో ను ఆహారంగా తీసుకుంటే… వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

మన ఆరోగ్యానికి సరిపడా పొటాషియం లభించాలంటే తాజా పండ్లు, కూరగాయలు, పప్పులు ఎక్కువ‌గా తీసుకోవాలి. ఒక పండిన అవకాడో పండులో 975 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. అవకాడో ఇతర పదార్ధాలతో కలిపి సలాడ్ లా తీసుకోవచ్చు. సాధారణంగా ప్రతి ఇంట్లో బంగాళ దుంపను ఆహారపదార్ధంగా తీసుకుంటుంటారు. తోలుతో సహా ఉడికించిన ఒక బంగాళ దుంపలో 950 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. పొటాషియంతో పాటు.. వివిధ రకాల పోషకపదార్ధాలు లభిస్తాయి. తక్కువ కేలరీలు ఉండి ఎక్కువ పొటాషియం లభించే ఆహారపదార్ధాలలో బంగాళాదుంప ఒకటని ఖచ్చితంగా చెప్పొచ్చు.

ఆరోగ్యానికి ఉపయోగపడే ఆహారపదార్ధాలలో వైట్ బీన్స్ ఒకటి. అరకప్పు వైట్ బీన్స్ లో 502 మిల్లీగ్రాముల పొటాషియం లభిస్తుంది. మష్రూమ్స్ లో కూడా మనకు పొటాషియం లభిస్తుంది. మష్రూమ్స్ ను సలాడ్, కూర లేదా శాండ్విచ్ రూపంలో తీసుకుంటారు. పుట్టగొడుగులో పొటాషియంతో పాటు క్యాల్షియం వంటి పోషకపదార్ధాలు లభిస్తాయి. పుట్టగొడుగులు శరీరంలోని కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది కాబట్టి మధుమేహం, ఊబకాయం వంటి జబ్బులకు మంచిది.

కొబ్బరి నీళ్లలో కూడా మనకు అధిక మెుత్తంలో పొటాషియం లభింస్తుంది. హై బీపీ తో బాధపడుతున్నవారు కొబ్బరి నీళ్లను తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సినంత పొటాషియం లభిస్తుంది.

పొటాషియం ఎక్కువగా మనకు ఎటువంటి ఆహారాల ద్వార లభిస్తుందో.. రోజువారీగా మనం తీసుకునే ఆహారంలో ఉప్పు తక్కువగా.. పొటాషియం ఎక్కువుండేలా చూసుకోవాలి. మనం రెగ్యులర్‌గా తీసుకునే ఆహారంలో ఏయే పదార్థాల్లో పొటాషియం పరిమాణం సమృద్ధిగా ఉంటుందో చెక్‌ చేసుకోవాలి. అలాంటి ఆహారాన్ని డైట్ లో చేర్చుకుంటే స‌రిపోతుంది.

Leave a Comment