ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు పెద్దలు. ఉల్లి మాత్రమే కాదు.. వెల్లుల్లి వల్ల కూడా మనకు అనేక రకాల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యం పెంపొందిచుకోవడానికి వెల్లుల్లి చక్కని పరిష్కారం చూపుతుంది. అందుకే కాబోలు ప్రతి వంటకంలో మన పెద్దలు వెల్లుల్లిని కచ్చితంగా ఉపయోగించేవారు. వెల్లుల్లి వలన మనకు కలిగే ఆరోగ్యకరమైన ఉపయోగాలేంటి…?
వెల్లుల్లి ఆహారానికి రుచిని మాత్రమే కాకుండా సువాసనని కూడా ఇస్తుంది. అంతేకాకుండా ఆహార ప్రణాళికలో వెల్లుల్లిని ఉపయోగించడం ద్వారా అనేక ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు.వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియా మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, రోగ నిరోధక శక్తి, అకాల వృద్ధాప్య నివారణా తత్వాలతో పాటు, రక్తనాళాల నష్టం వంటి సమస్యల నుండి కాపాడగలిగే పోషక తత్వాలు కూడా ఇందులో ఉన్నాయి. గుండె జబ్బు, ఆస్టియో ఆర్థరైటిస్ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషించగలదు. అంతేకాదు జీర్ణమైన ఆహారంలోని కొవ్వును వెల్లుల్లి ప్రొసెస్ చేయడమే కాదు అనవసరమైన ఫ్యాట్‌ను శరీరం నుంచి బయటకు పంపించేస్తుంది. వెల్లుల్లి తీసుకోడం వలన జీర్ణశక్తి వృద్ధిచెంది మంచి ఆకలి పుడుతుంది.
వెల్లుల్లి జీర్ణమైన ఆహారంలోని కొవ్వును ప్రాసెస్ చేయడమే కాకుండా అనవసరమైన ఫ్యాట్‌ను శరీరం నుంచి బయటకు పంపుతుంది. వెల్లుల్లి అడ్రినలిన్ ని అధికంగా విడుదల చేసి నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. శరీర జీవక్రియ సక్రమంగా జరుగుతుంది. ఇందులో సల్ఫర్ తో పాటు అల్లిసిన్ అనే సమ్మేళనం కూడా ఉంటుంది. వెల్లుల్లి జీర్ణం అయిన తర్వాత ఎర్ర రక్తకణాల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఇవి హైడ్రోజన్ సల్ఫెడ్ ను సృష్టించడం ద్వారా రక్త ప్రవాహం పెరుగుతుంది. దీని వల్ల రక్త సరఫలా సహజమైన స్థాయికి చేరుతుంది. ఫలితంగా గుండె జబ్బు సమస్యలు తగ్గుముఖంపడతాయి.
వెల్లుల్లి ని తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు. వెల్లుల్లికి రక్తాన్ని శుద్ధిచేసే గుణం ఉంది. అంతేకాదు శరీరం లోపలి భాగాల్ని కూడా శుద్ధిచేస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల చర్మంపై ముడతలు రావు. వెల్లుల్లి గుండెను కూడా కాపాడతుంది. వెల్లుల్లిలో ఉన్న యాంటి క్లాటింగ్ ప్రాపర్టీస్ వల్ల శరీరంలో బ్లడ్ క్లాట్స్ సంభవించవు. సర్జరీల తర్వాత మాత్రం వెల్లుల్లిని తీసుకోకూడదని వైద్యులు సూచిస్తారు.
వెల్లుల్లిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల ఇది అలర్జీల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది. కీళ్ళ వాపులు తగ్గుతాయి. శ్వాస సమస్యలకు సైతం వెల్లుల్లి చక్కని పరిష్కారం చూపుతుంది. వెల్లుల్లి డయాబెటిస్ విషయంలోనూ కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధనల్లో తేలింది. వారానికి కనీసం 5 వెల్లుల్లి రెబ్బలు తినే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా సగానికి తగ్గుతాయని వైద్య నిపుణులు . ఛాతీకి సంబంధించిన కొన్ని రకాల వ్యాధులను వెల్లుల్లి సమర్ధవంతంగా నివారిస్తుంది. శ్వాసకోశాలకు పట్టిన కొవ్వును కరిగించి శ్వాస సక్రమంగా జరిగేట్లు చేస్తుంది. బీపిని తగ్గించటానికి సమర్థవంతమైన మందుగా వెల్లుల్లి ఉపయోగపడుతుంది.
చిన్న ధమనులు మీద పడే ఒత్తిడిని, టెన్షన్‌నూ వెల్లుల్లి తగ్గిస్తుంది. నాడి చలనాన్ని నిదానపరిచి గుండె వేగాన్ని క్రమబద్ధీకరిస్తుంది. ఊపిరి అందకపోవటం, కళ్ళు తిరగటం, కడుపులో వాయువు ఏర్పడటం లాంటివాటిని అరికడుతుంది. వెల్లుల్లి తీసుకోడం వలన విటమిన్ సి, విటమిన్ బి6, మాంగనీస్, సెలీనియం, పాస్ఫరస్, క్యాల్షియం, ఐరన్, మరియు రాగి వంటి ఇతర ఖనిజాలకు ప్రధాన మూలముగా ఉంటుంది. అందుచేతనే రోజువారీ ఆహార ప్రణాళికలో భాగంగా కనీసం నాలుగు వెల్లుల్లి రెబ్బలను తీసుకోవలసినదిగా పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు.
మన ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని లాంటిది. వెల్లుల్లిని తినలేకపోతే ఆహారపదార్థాలలోనైనా వేసుకొని తప్పనిసరిగా తినడం మంచిది.