Essential Oils – ఈ నూనె మనస్సుకు విశ్రాంతినిచ్చి.. ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం కలిగిస్తుంది

By manavaradhi.com

Updated on:

Follow Us
Essential Oils

ఎప్పటి నుండో ఎస్సెన్షియల్ ఆయిల్స్ ని ఆరోగ్య ప్రయోజనాల కోసం వాడుతున్నారు. ఈ ఆయిల్స్ ని మూలికలు, ఆకులు, తొక్కకు, బెరడు వంటి వాటి నుండి తీస్తారు. ఈ ఆయిల్స్ కి ఆయా మొక్కల యొక్క ఫ్లేవర్, సెంట్, ఎస్సెన్స్ ఉంటాయి. ఈ ఆయిల్స్‌ని వివిధ రకాల పద్ధతుల ద్వారా బిల్డ్ చేస్తారు. అలసిన మనసుకి… సుగంధ నూనెలు ఎంతో మేలు చేస్తాయి. శారీరక, మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయి. మనసును ఉత్తేజితపరుస్తాయి… అయితే వీటి వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

సుగంధ నూనెలు ఎప్పుడో పాతకాలం నుంచి ఉంటూనే ఉన్నాయి. కానీ మనం ఈ మధ్యనే వాటిని చర్మంపై వాడటం మొదలుపెట్టాం. ఇవి స్వభావసిద్ధంగా చాలా గాఢత కలిగివుంటాయి. దాని వలన మనలో చాలామంది వీటిని చర్మంపై వాడటానికి సంకోచిస్తారు. ఆరోగ్య సమస్యలు, చర్మం, జుట్టు సమస్యలకి వీటిని సహజ చిట్కాగా చాలా ఏళ్ళ నుండి ఈ సుగంధ నూనెలను వాడుతున్నారు. పరిమళాలు ప్రధానంగా వాసన ద్వారానే ఒంట్లోకి ప్రవేశిస్తాయి. వాసనను పీల్చినప్పుడు ముందుగా మన ముక్కు పైభాగంలోని వాసనలను పసిగట్టే భాగం ప్రేరేపితమవుతుంది. అక్కడి నాడుల ద్వారా ఆయా సంకేతాలు మెదడుకు చేరుకొని.. భావోద్వేగాలు, కోరికలు, ఆకలి, జ్ఞాపకాలతో ముడిపడిన భాగాన్ని ప్రేరేపిస్తాయి. హార్మోన్ల స్థాయులను నియంత్రించే గ్రంథులనూ ఉత్తేజితం చేస్తాయి. ఇలా శరీరం, మనసు మీద గాఢమైన ప్రభావం చూపిస్తాయి. ఉల్లాసం, ఉత్సాహం ఇనుమడింపజేస్తాయి. మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. డిఫ్యూజర్‌ 2-3 చుక్కల నూనెలు వేస్తే దాన్నుంచి వెలువడే పరిమళాలు చికిత్సగా ఉపయోగపడతాయి.

తెలుపు, గులాబీ రంగు ఆకులు కలిగిన మొక్కల నుంచి వెలువడే నూనె చాలా ప్రశాంతమైన వాసనను కలిగి ఉంటుంది. దీన్నే క్లారి సేజ్ నూనె అని కూడా పిలుస్తారు. ఈ నూనెను చర్మానికి రాసుకోవడం వల్ల రక్త ప్రసరణ స్థాయిలో సమతుల్యంగా పని చేస్తాయి. అలాగే ఆందోళన, ఒత్తిడి, చికాకు వంటి సమస్యలను దూరం చేసి త్వరగా నిద్ర పట్టేలా చేస్తుంది.ముఖ్యంగా సుగంధ నూనెలు చర్మానికి రాసుకుంటే త్వరగా పీల్చుకొని రక్తప్రసరణకు, ఒత్తిడి తగ్గించడానికి సహాయపడతాయి.

లావెండర్ నూనె చాలా ప్రశాంతమైన పరిమళాన్ని వెదజల్లుతుంది. ఈ నూనె నిద్రలోకి త్వరగా జారుకునేలా చేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నూనెను కొద్దిగా చర్మానికి పట్టిస్తే చాలు తల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. మసాజ్ థెరఫీ ఆయుర్వేద వైద్యంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ థెరఫీలో వాడే అనేక తైలాలతో చేసే మర్ధన కారణంగా అనేక రుగ్మతలకు ఉపశమనం లభిస్తుంది. బాడీ మసాజ్ వల్ల మీరు తక్షణ ఉపశమనం పొందడంతో పాటు మీ శరీరంలో రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. బాడీ ఆయిల్ మసాజ్ తో అనేక ప్రయోజనాలున్నాయి.ఇది మనస్సును శరీరాన్ని ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. ఆయిల్ మసాజ్ చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.

ప్రస్తుతం మనకు మార్కెట్ లో చాలా రకాల సుగంధ నూనెలు దోరుకుతున్నాయి. వాటిలో చాలా వరకు పరిమళ భరితమైన నూనెలు , ఎసెన్షియల్ ఆయిల్స్ లాగా ఉన్నా వాటిలో మనకు కావాల్సిన వైద్యపరమైన లాభాలు లభించడంలేదు. సుగంధ నూనెలను కోనే ముందు వాటిని ఒకటికి రెండు సార్లు పరీక్షించుకోవడం మంచిది. ఎసెన్షియల్ ఆయిల్స్ వాడకంలో కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలి. ముఖ్యంగా ఏ ఆయిల్ ని ఎలా వాడాలో పూర్తిగా తెలుసుకున్నాకే వాడాలి.ఈ ఆయిల్స్ ని మీ కళ్ళలో, చెవుల్లో, ముక్కులో ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకండి.

సుంగధ నూనెలను పిల్లలకి అందుబాటులో ఉండకూడదు. ఇవి మెడిసిన్స్ లాగానే భావించాలి. వీటిని కొంటున్నప్పుడూ, స్టోర్ చేస్తున్నప్పుడూ, వాడుతున్నప్పుడూ జాగ్రత్త అవసరం. ఈ ఆయిస్ల్ ని డిఫ్యూజ్ చేసేటప్పుడు బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశాల్లోనే చేయాలి. మీకు ఆ ఆయిల్ వాసన తప్ప ఇంకేం తెలియకపోతే మీరు ఉన్న ప్రదేశానికి మంచి వెంటిలేషన్ లేదన్న మాట. అలాంటి పరిస్థితుల్లో మీ రెస్పిరేటరీ సిస్టమ్ ఇరిటేట్ అయ్యే రిస్క్ ఉంది. టాపికల్ అప్లికేషన్ లో కారియర్ ఆయిల్ ని తప్పని సరిగా వాడలి. ఎస్సెన్షియల్ ఆయిల్స్ వాడిన తరువాత చేతులు కడుక్కోండి.

సుగంధ ద్రవ్యనూనెలను వాడటానికి మంచి పద్ధతి వాటిని ఏదైనా మంచి నూనెలతో కలపటం. ఈ నూనెలు చాలా గాఢంగా ఉండి ఇంకో నూనెతో కలపకపోతే చర్మంపై మంటను కలిగిస్తాయి. కొత్త నూనె ఏది వాడినా ముందు కొంచెం చేతిపై పరీక్షించి చూడటం. ఈ నూనెలను ముదురు రంగు సీసాలలోనే దాచాలి, ఎందుకంటే ఇవి కాంతికి సున్నితంగా ఉంటాయి, లైటు పడితే పాడయిపోతాయి.

Leave a Comment